Flipkart Big Diwali Sale 2022 : టీవీలపై 80% తగ్గింపు.. పలు స్మార్ట్​ఫోన్లపై అదిరే ఆఫర్లు-flipkart big diwali sale 2022 starts from tomorrow 80 discount on televisions here is the more details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Flipkart Big Diwali Sale 2022 Starts From Tomorrow 80% Discount On Televisions Here Is The More Details

Flipkart Big Diwali Sale 2022 : టీవీలపై 80% తగ్గింపు.. పలు స్మార్ట్​ఫోన్లపై అదిరే ఆఫర్లు

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 18, 2022 07:35 AM IST

Flipkart Big Diwali Sale 2022 : అక్టోబర్ 19 (రేపటి) నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ 2022 ప్రారంభం కాబోతుంది. దీనిలో భాగంగా పలు ఐటమ్స్​పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చెల్లింపులు, EMIలపై 10% తక్షణ తగ్గింపును అందిస్తుంది. అంతేకాకుండా iPhone 13పై మరిన్ని ఆఫర్లు కూడా పొందవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ 2022
ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ 2022

Flipkart Big Diwali Sale 2022 : దీపావళి పండుగ దగ్గర పడుతోంది. దీనిలో భాగంగా ప్రసిద్ధమైన ఇ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫారమ్‌లో దీపావళి సేల్ 2022 ప్రారంభాన్ని ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ 2022 ఈవెంట్ అక్టోబర్ 19న ప్రారంభమవుతుంది. ఇది అక్టోబర్ 23, 2022 వరకు కొనసాగుతుంది. అక్టోబర్ 18న అంటే ఈరోజు ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌లోని సభ్యులు డిస్కౌంట్ ఈవెంట్‌కు యాక్సెస్ కలిగి ఉంటారు.

ట్రెండింగ్ వార్తలు

బిగ్ దీపావళి సేల్ కోసం టీజర్ పేజీలో SBI క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేసే కస్టమర్‌లకు Flipkart 10 శాతం తక్షణ తగ్గింపును ప్రమోట్ చేస్తుంది. అదనంగా మీరు కొనుగోలు చేయడానికి మీ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించినప్పుడల్లా.. మీరు లావాదేవీ ధరలో ఐదు శాతం క్యాష్‌బ్యాక్‌కు అర్హులు. Paytm వాలెట్, UPI లావాదేవీలు మొత్తంలో పది శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ ఇస్తున్నాయి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ 2022 టీజర్ పేజీ కంపెనీ Poco X4, అనేక ఇతర పరికరాలపై 45 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ సమయంలో.. మీరు Samsung Galaxy S22+, iPhone 13ని కూడా పొందవచ్చు. కొత్త టెలివిజన్ కోసం ఎదురు చూస్తున్నవారు ఈ ఆఫర్ సమయంలో నిర్దిష్ట మోడళ్లపై 80% వరకు ఆదా చేసుకోవచ్చు. వాషింగ్ మెషీన్లు, స్మార్ట్ టెలివిజన్లు, ఎయిర్ కండిషనర్లు, మరిన్నింటిని 75% వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ 2022తో అద్భుతమైన ఆఫర్‌లు, డిస్కౌంట్‌లతో వచ్చేసింది. దీనిలో మీరు దుస్తులు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, మరిన్నింటిపై అద్భుతమైన ఆఫర్‌లు పొంది.. దీపావళిని చిరస్మరణీయంగా జరుపుకోవచ్చు. దీపావళి సేల్​లో భాగంగా (భారతదేశం) విమానాలపై అద్భుతమైన తగ్గింపులను అందిస్తుంది. మీరు ఈ దీపావళికి విహారయాత్రకు వెళ్లాలని చూస్తున్నట్లయితే హోటల్ బుకింగ్‌లు దీని ద్వారా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

WhatsApp channel

సంబంధిత కథనం