Electric bike : ఇది కదా అసలు సిసలైన ఎలక్ట్రిక్ బైక్ అంటే! రాయల్ ఎన్ఫీల్డ్ అద్భుతం చేసింది..
రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ తన తొలి ఎలక్ట్రిక్ బైక్‌ని రివీల్ చేసింది. దీని పేరు రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6. ఫ్లయింగ్ ఫ్లీ అనేది ఆర్ఈ ఎలక్ట్రిక్ సబ్-బ్రాండ్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ వివరాలను ఇక్కడ చూసేయండి..
దిగ్గజ గ్లోబల్ మోటార్ సైకిల్ బ్రాండ్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్.. కంపెనీ చరిత్రలో కొత్త ఛాప్టర్‌ని ప్రారంభించింది! తన తొలి ఎలక్ట్రిక్ బైక్‌ని సంస్థ తాజాగా లాంచ్ చేసింది. ఈ ఈ-బైక్ పేరు ఫ్లయింగ్ ఫ్లీ సీ6. రెండొవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ సైన్యంలో పనిచేసిన ఒరిజినల్ ఫ్లయింగ్ ఫ్లీ బైక్ నుంచి ప్రేరణ పొందిన కొత్త బైక్ ఇది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
రాయల్ ఎన్ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్..
రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 దాని సరికొత్త ఎలక్ట్రిక్ బైక్స్‌కి ప్రేరణగా నిలుస్తుంది. అయితే కొత్త ఈ-బైక్ పట్టణాల కోసం రూపొందించడం జరిగింది. ఆర్ఈ కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ తేలికైనది. భారతదేశం, యూకే, ఇటలీ సహా సంస్థ సేల్స్ చేస్తున్న వివిధ దేశాల బృందాలచే అభివృద్ధి చేసిన పట్టణ వాహనాల కొత్త కుటుంబంలో మొదటిది! సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ విభాగంలో 200 మందికి పైగా ఇంజనీర్లు పనిచేస్తున్నారు. 2023లో హిమ్-ఈ రూపంలో మొదటి ప్రోటోటైప్‌ని ప్రదర్శించారు. ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల కోసం 28 పేటెంట్లను తయారు చేయగలిగారు. అమ్మకాలు, పంపిణీ బృందం కూడా పెట్రోల్‌తో నడిచే బైక్స్ కంటే భిన్నంగా ఉంటుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6..
రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త ఫ్లయింగ్ ఫ్లీ సీ6 ప్రామాణిక డిజైన్, అత్యాధునిక సాంకేతికతను పొందుతుంది. పేటెంట్ చిత్రాల్లో చూసినట్లుగా ఈ-బైక్ గర్డర్ ఫ్రంట్ ఫోర్క్‌ను పొందింది. ఇవి 1930, 1940ల్లో బైక్‌లపై ప్రాచుర్యం పొందాయి. సీ6 కోసం దీన్ని తిరిగి తీసుకొచ్చారు. ఈ మోటార్ సైకిల్ అల్యూమినియం ఫోర్జ్డ్ ఫ్రేమ్‌లతో నడుస్తుంది. ఇంజిన్ ఉండే చోట బ్యాటరీని ఉంచారు.
ఫోర్జ్డ్ ఫ్రేమ్ తేలికపాటి, బలమైన నిర్మాణాన్ని పొందింది. అయితే మెగ్నీషియం బ్యాటరీ కేస్ సరైన బరువు ఆదా- శీతలీకరణ కోసం సేంద్రీయ డిజైన్ లాంగ్వేజ్‌ని ఉపయోగిస్తుంది. ఎలక్ట్రిక్ మోటారు రాయల్ ఎన్ఫీల్డ్ ఐసీఈ ఆఫర్లలో కనిపించే ఇంజిన్ కేసింగ్‌తో కవర్ చేసి ఉంటుంది.
రౌండ్ హెడ్‌ల్యాంప్, సింగిల్ సీటు ఒరిజినల్ ఫ్లయింగ్ ఫ్లీని గుర్తుకు తెస్తాయి. అయితే వెనుక సీటు యాక్సెసరీగా పొందొచ్చు. రెట్రో లుక్ కోసం రౌండ్ డిస్ప్లేతో టచ్‌స్క్రీన్ టీఎఫ్టీ డిస్ప్లేను ఈ-బైక్ పొందుతుంది. ఎఫ్ఎఫ్-సీ6లోని సెంట్రల్ వెహికల్ కంట్రోల్ యూనిట్ పూర్తిగా అంతర్గతంగా అభివృద్ధి చేసిన బైక్‌లోని అన్ని భౌతిక, డిజిటల్ టచ్ పాయింట్లను అనుసంధానిస్తుంది. వీసీయూ 200,000 కంటే ఎక్కువ రైడ్ మోడ్ కలయికలను అనుమతిస్తుంది. జియోఫెన్సింగ్, థెఫ్ట్ ప్రొటెక్షన్, ఓవర్-ది-ఎయిర్ (ఓటీఏ) నవీకరణలను కలిగి ఉంది.
వీసీయూ కేవలం ఎకానమీ కోసం మాత్రమే కాకుండా థ్రాటిల్, బ్రేక్- రెజెన్ ఫీల్‌కు "సూక్ష్మమైన" సర్దుబాట్లతో రైడింగ్ ఆనందాన్ని కూడా ఆప్టిమైజ్ చేయగలదని ఆర్ ఇ తెలిపింది. ఈ కంట్రోల్స్ చాలావరకు ఫోన్ ద్వారా యాక్సెస్ అవుతాయి.
రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 ఫీచర్లు..
రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త ఫ్లయింగ్ ఫ్లీ సీ6 బ్యాటరీ- మోటార్ స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు. అయితే ఈ బైక్‌లో కార్నరింగ్ ఏబీఎస్, క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయని కంపెనీ ధృవీకరించింది. ఇది దేశీయ త్రీ-పిన్ ప్లగ్ ఉపయోగించి ఛార్జ్ చేయగలదు.
ఫ్లయింగ్ ఫ్లీ సీ6 లాంచ్ ఎప్పుడు?
ఫ్లయింగ్ ఫ్లీ మార్కెట్ అరంగేట్రం, లభ్యత గురించి మరిన్ని వివరాలు రాబోయే వారాల్లో అందుబాటులో ఉంటాయి. 2026లో ఈ మోడల్ మార్కెట్లోకి రానుంది. ఈ నెలాఖరులో జరిగే వార్షిక మోటార్ సైకిల్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ మోటోవర్స్ 2024లో ఈ మోడల్‌ను సంస్థ ప్రదర్శించనుంది.
సంబంధిత కథనం