Bike Discount : టీవీఎస్ రైడర్ పండుగ ఆఫర్.. ఈ బైక్‌పై రూ.10 వేల డిస్కౌంట్!
TVS Raider 125 Discount : పండుగ సీజన్ రాగానే ఆటోమొబైల్ కంపెనీలు డిస్కౌంట్లను ప్రారంభించాయి. ఈ జాబితాలోకి టీవీఎస్ మోటార్స్ పేరు కూడా చేరింది. ఈ కంపెనీకి చెందిన మోటార్ సైకిల్ రైడర్ 125 ప్రారంభ ధరను తగ్గించింది.
భారతదేశంలో పండుగల సీజన్ మెుదలైంది. దీంతో కారు, బైకుల కంపెనీలు డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. చాలా మందికి ఇష్టమైన టీవీఎస్ కంపెనీ కూడా ఆఫర్లు ప్రకటిస్తుంది. తాజాగా టీవీఎస్ రైడర్ 125 ప్రారంభ ధరను తగ్గించారు. ఈ డిస్కౌంట్ ఆఫర్‌తో రూ.10 వేల వరకు తగ్గింపు ధరను మీరు పొందవచ్చు. ఈ బైక్ చాలా మందికి ఇష్టంగా ఉంది. కొనాలి అనుకునేవారికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు.
ధర తగ్గించిన తరువాత ఫీచర్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇందులో డ్రమ్ బ్రేక్స్, సింగిల్ సీట్, స్ప్లిట్ సీట్, ఎస్ఎస్ఈ (సూపర్ స్క్వాడ్ ఎడిషన్), ఎస్ఎక్స్ వేరియంట్లు ఉన్నాయి. ఇది భారతదేశంలో హీరో ఎక్స్‌స్ట్రిమ్ 125 ఆర్, బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125, హీరో స్ప్లెండర్ ఎక్స్టెక్, హోండా ఎస్పీ 125 వంటి మోడళ్లతో పోటీపడుతుంది.
టీవీఎస్ రైడర్ 125 ఫీచర్లు
ఈ బైక్‌లో కంపెనీ 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అందించింది. ఇది 11.2 బీహెచ్‌పీ పవర్, 11.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు. ఇందులో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫోర్కులు, మోనోషాక్, ఇత్తడి టైప్ ఫ్రంట్ డిస్క్‌లు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. ఈ బైక్ బరువు 123 కిలోలుగా ఉంది.
ఈ బైక్‌కు టీఎఫ్‌టీ కనెక్టివిటీని జోడించారు. కంపెనీ గతంలో ఎన్ టార్క్ స్కూటర్‌కు ఇలాంటి కనెక్టివిటీ ఫీచర్లను ఇచ్చింది. బ్లూటూత్ కనెక్టెడ్ హెల్మెట్ సాయంతో వాయిస్ కమాండ్స్ ఇవ్వొచ్చు. మ్యూజిక్ ప్లేయింగ్ ఆప్షన్లు, మ్యాప్ నావిగేషన్, నోటిఫికేషన్ కంట్రోల్‌తో సహా ఇతర ఫీచర్లు కూడా ఉంటాయి. ఇంధనం అయిపోయిన తర్వాత సమీపంలోని పెట్రోల్ బంక్ స్టేషన్‌కు తీసుకెళ్లడానికి కూడా బైక్ మిమ్మల్ని నావిగేట్ చేస్తుంది. డూ నాట్ డిస్టర్బ్ మోడ్ ఆన్ చేయగానే కాల్ సిస్టమ్ ఆఫ్ అవుతుంది.
ఇందులో వినియోగదారులు ఫియరీ ఎల్లో, వికెడ్ బ్లాక్ రంగులతో గేమింగ్ అనుభవాన్ని పొందుతారు. టెక్ గ్యాడ్జెట్‌లో గేమింగ్ కన్సోల్ మాదిరిగానే హ్యాండిల్ రెండు వైపులా హెచ్ఎంఐ యాక్షన్ బటన్లు ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్ బటన్‌తో వాయిస్ కమాండ్స్ ఇవ్వొచ్చు. అదే సమయంలో కుడివైపు బటన్‌తో మెనూ ఓపెన్ అవుతుంది. బటన్ సహాయంతో కాల్ ఎత్తవచ్చు లేదంటే కట్ చేయవచ్చు. వాయిస్ కమాండ్ సపోర్ట్‌తో కరెంట్ లొకేషన్, సమీపంలోని రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు వంటి లొకేషన్లను సెర్చ్ చేయవచ్చు.
ధర ఎంతంటే
పండుగ ఆఫర్‌లో భాగంగా డిస్కౌంట్ రూ.10 వేల వరకు వస్తుంది. దీంతో ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.85,000. అంతకుముందు దీని ధర రూ.95,219గా ఉంది. 5.55శాతం ఆర్ఓఐ (వడ్డీ రేటు)తో రూ .13,000 పొదుపు నుండి కూడా వినియోగదారులు ప్రయోజనం పొందుతారని కంపెనీ పేర్కొంది. డ్రమ్ బ్రేకులు పొందే రైడర్ బేస్ వేరియంట్ ధర రూ.84,869 అని గుర్తుంచుకోవాలి. అదే సమయంలో టాప్-స్పెక్ ఎస్ఎక్స్ ట్రిమ్ ఎక్స్-షోరూమ్ ధర రూ .1,04,330 వరకు ఉంది.