EPFO interest rate : ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు 8.25శాతానికి పెంపు- మూడేళ్ల గరిష్ఠం!
EPFO interest rate : ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును 8.25శాతానికి పెంచుతున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
EPFO interest rate 2023-2024 : 2023-24 సంవత్సరానికి గాను.. ప్రావిడెంట్ ఫండ్‌పై 8.25 శాతం వడ్డీ రేటును నిర్ణయించింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ). రిటైర్మెంట్ ఫండ్ నుంచి ఇది మూడేళ్ల గరిష్ట స్థాయి కావడం విశేషం.
వడ్డీ రేటు పెంపునకు నిర్ణయం..
2021-22లో 8.10 శాతంగా ఉన్న ఈపీఎఫ్ వడ్డీ రేటును.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతానికి పెంచింది. అంతకుముందు 2022 మార్చిలో.. 2021-22 సంవత్సరానికి ఈపీఎఫ్‌పై వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించింది. 1977-78 సమయంలో ఉన్న ఈపీఎఫ్ వడ్డీ రేటు(8 శాతం) తర్వాత.. ఇదే కనిష్ఠం!
2023-24 సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ రేటును అందించాలని ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణాయక సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ).. ఫిబ్రవరి 10న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది. 2023-24 సంవత్సరానికి ఈపీఎఫ్‌పై 8.25 శాతం వడ్డీ రేటును అందించాలని సీబీటీ నిర్ణయించింది.
ఇదీ చూడండి:- EPFO bans Paytm: పేటీఎంకు మరో షాక్; పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఈపీఎఫ్ఓ నిషేధం
EPFO interest rate hike : సీబీటీ నిర్ణయం తర్వాత.. 2023-24 సంవత్సరానికి ఈపీఎఫ్‌పై వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమ్మతి కోసం సమర్పించనున్నారు. ప్రభుత్వం ఆమోదించిన అనంతరం.. వడ్డీ రేటు ఆరు కోట్లకు పైగా ఇపీఎఫ్ఓ చందాదారుల ఖాతాల్లో జమ అవుతుంది.
ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 2018-19లో 8.65 శాతంగా ఉన్న ఈపీఎఫ్ఓ.. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఏడేళ్ల కనిష్ఠ స్థాయి 8.5 శాతానికి తగ్గించింది. 2016-17లో 8.65 శాతం, 2017-18లో 8.55 శాతం, 2015-16లో 8.8 శాతంగా ఉన్నాయి ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు.
Employees provident fund interest rate latest news : రిటైర్మెంట్ ఫండ్ బాడీ 2013-14, 2014-15లో 8.75 శాతం అధిక వడ్డీని అందించగా, 2012-13లో 8.5 శాతంగా ఉంది. 2011-12లో వడ్డీ రేటు 8.25 శాతంగా ఉండేది.
ఈపీఎఫ్ఓ కీలక అప్డేట్..
ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్).. ఇటీవలే ఓ కీలక ప్రకటన చేసింది. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు ఆమోదయోగ్యం కాదని ప్రకటించింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడిఏఐ) ఆదేశాల మేరకు.. పుట్టిన తేదీకి ఆమోదయోగ్యమైన పత్రంగా ఆధార్ కార్డును తొలగిస్తున్నట్టు భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈపీఎఫ్ఓ నోటిఫై చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం