Day trading guide: రిలయన్స్, టాటా మోటార్స్ షేర్ ప్రైస్ టార్గెట్ ఇదే..
Day trading guide for today: రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, పీఐ ఇండస్ట్రీస్, మెక్‌డోవెల్-ఎన్, నవ్‌కర్ కార్పొరేషన్, ఎయిమ్‌కో ఎలికాన్.. స్టాక్స్ ఈ రోజు లాభాలను చవి చూసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Day trading guide for today: మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, పీఐ ఇండస్ట్రీస్, మెక్‌డోవెల్-ఎన్, నవ్‌కర్ కార్పొరేషన్, ఎయిమ్‌కో ఎలికాన్.. స్టాక్స్ ఈ రోజు లాభాలను చవి చూసే అవకాశం ఉంది.
దూసుకెళ్లిన మార్కెట్లు
మంగళవారం ఒడిదుడుకులతో ప్రారంభమైనప్పటికీ.. ఆ తరువాత పుంజుకున్న స్టాక్ మార్కెట్ సెషన్ చివరికి వచ్చే సమయానికి ఆకాశానికి దూసుకువెళ్లింది. నిఫ్టీ 50 ఇండెక్స్ 95 పాయింట్లు లాభపడి 19,889 స్థాయిల వద్ద ముగియగా, బిఎస్‌ఇ సెన్సెక్స్ 204 పాయింట్లు పెరిగి 66,174 మార్క్ వద్ద ముగిసింది. మరోవైపు, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 111 పాయింట్ల లాభంతో 43,880 స్థాయిల వద్ద ముగిసింది. బ్రాడ్ మార్కెట్‌లో, స్మాల్ క్యాప్ మరియు మిడ్ క్యాప్ సూచీలు రెండూ సానుకూలంగా ముగిశాయి.
ఎస్ అండ్ పీ జీడీపీ అంచనా
"గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ S&P FY24 కోసం భారతదేశ GDP వృద్ధి అంచనాను 40 bps పెంచి 6.4%కి చేర్చిన తర్వాత, మిశ్రమ గ్లోబల్ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ ఈక్విటీలు సానుకూలంగా ఉన్నాయి. ఆయిల్ & గ్యాస్, మెటల్స్, పిఎస్‌యు బ్యాంక్ మరియు ఆటోలతో పాటు మెజారిటీ సెక్టార్స్ గ్రీన్‌లో ముగిశాయి.
ఈ రోజు కూడా సానుకూలమే
మార్కెట్లో సానుకూల సంకేతాలు కొనసాగుతున్న కారణంగా ప్రధాన సూచీలు కొత్త ఆల్-టైమ్ గరిష్టానికి వెళ్లే అవకాశముందని, ఒకవేళ, నిఫ్టీ కిందకు వెళ్తే 19,800 వద్ద సపోర్ట్ లభించే అవకాశముందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌లోని టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి విశ్లేషించారు.
ఈ స్టాక్స్ తో లాభాలు
మార్కెట్ నిపుణులు చాయిస్ బ్రోకింగ్ ఈడీ సుమీత్ బగాడియా, ఆనంద్ రాఠీలో సీనియర్ మేనేజర్ టెక్నికల్ రీసెర్చ్ గా ఉన్న గణేశ్ దోంగ్రె, బొనాంజా పోర్ట్ ఫోలియోలో రీసెర్చ్ అనలిస్ట్ గా ఉన్న కునాల్ కాంబ్లే అంచనాల ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, పీఐ ఇండస్ట్రీస్, మెక్‌డోవెల్-ఎన్, నవ్‌కర్ కార్పొరేషన్, ఎయిమ్‌కో ఎలికాన్. ... స్టాక్స్ ఈ రోజు లాభాలను చవి చూసే అవకాశం ఉంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్: ప్రస్తుత ధర రూ. 2394.40; టార్గెట్ ప్రైస్ రూ. 2480; స్టాప్ లాస్ రూ. 2355.
టాటా మోటార్స్: ప్రస్తుత ధర రూ. 697; టార్గెట్ ప్రైస్ రూ. 745; స్టాప్ లాస్ రూ. 670.
పీఐ ఇండస్ట్రీస్: ప్రస్తుత ధర రూ. 3745; టార్గెట్ ప్రైస్ రూ. 3800; స్టాప్ లాస్ రూ. 3700
మెక్‌డోవెల్-ఎన్: ప్రస్తుత ధర రూ. 1042; టార్గెట్ ప్రైస్ రూ 1080; స్టాప్ లాస్ రూ.1020.
నవ్‌కర్ కార్పొరేషన్: ప్రస్తుత ధర రూ. 80.40; టార్గెట్ ప్రైస్ రూ 100; స్టాప్ లాస్ రూ.69
ఎయిమ్‌కో ఎలికాన్: ప్రస్తుత ధర రూ. 1740; టార్గెట్ ప్రైస్ రూ 2180; స్టాప్ లాస్ రూ.1536
సూచన: ఇవి మార్కెట్ నిపుణుల అంచనాలు, అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు స్వీయ విచక్షణతో నిర్ణయం తీసుకోవడం సముచితం.