Day trading guide: పవర్ గ్రిడ్, సెయిల్ సహా ఈ స్టాక్స్ పై దృష్టి పెట్టండి..
Day trading guide for today: పవర్ గ్రిడ్, సెయిల్, టోరెంట్ ఫార్మా, హీరో మోటోకార్ప్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బీపీసీఎల్.. స్టాక్స్ ఈ రోజు లాభాలను చవి చూసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Day trading guide for today: మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. పవర్ గ్రిడ్, సెయిల్, టోరెంట్ ఫార్మా, హీరో మోటోకార్ప్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బీపీసీఎల్.. స్టాక్స్ ఈ రోజు లాభాలను చవి చూసే అవకాశం ఉంది.
అమ్మకాల ఒత్తిడి
గ్లోబల్ మార్కెట్‌లో మిశ్రమ పోకడలను అనుసరించి, భారత స్టాక్ మార్కెట్ బుధవారం మిశ్రమంగా ముగిసింది. నిఫ్టీ 50, బిఎస్‌ఇ సెన్సెక్స్ లాభాల్లో ముగియగా, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ 28 పాయింట్లు లాభపడి 19,811 స్థాయిల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 92 పాయింట్ల లాభంతో 66,023 స్థాయిల వద్ద ముగియడం విశేషం. నిఫ్టీ బ్యాంక్ సూచీ 239 పాయింట్లు నష్టపోయి 43,449 మార్క్ వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఈ రోజు సానుకూల ఫలితాలను సాధిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 19850-19900 అడ్డంకిని అధికమిస్తే, మరింత ముందుకు వెళ్లే అవకాశముందని, నెగటివ్ ట్రెండ్ కొనసాగితే 19650 వద్ద సపోర్ట్ లభించే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. బ్యాంక్ నిఫ్టీలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుందని భావిస్తున్నారు.
ఈ స్టాక్స్ పై దృష్టి
మార్కెట్ నిపుణులు చాయిస్ బ్రోకింగ్ ఈడీ సుమీత్ బగాడియా, ఆనంద్ రాఠీలో సీనియర్ మేనేజర్ టెక్నికల్ రీసెర్చ్ గా ఉన్న గణేశ్ దోంగ్రె, బొనాంజా పోర్ట్ ఫోలియోలో రీసెర్చ్ అనలిస్ట్ గా ఉన్న కునాల్ కాంబ్లే అంచనాల ప్రకారం.. పవర్ గ్రిడ్, సెయిల్, టోరెంట్ ఫార్మా, హీరో మోటోకార్ప్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బీపీసీఎల్. ... స్టాక్స్ ఈ రోజు లాభాలను చవి చూసే అవకాశం ఉంది.
పవర్ గ్రిడ్: ప్రస్తుత ధర రూ. 211; టార్గెట్ ప్రైస్ రూ. 219; స్టాప్ లాస్ రూ. 206.
సెయిల్: ప్రస్తుత ధర రూ. 89; టార్గెట్ ప్రైస్ రూ. 95; స్టాప్ లాస్ రూ. 86.
బీపీసీఎల్: ప్రస్తుత ధర రూ. 402; టార్గెట్ ప్రైస్ రూ. 417; స్టాప్ లాస్ రూ. 391
టోరెంట్ ఫార్మా: ప్రస్తుత ధర రూ. 2114; టార్గెట్ ప్రైస్ రూ 2185; స్టాప్ లాస్ రూ.2085.
హీరో మోటోకార్ప్: ప్రస్తుత ధర రూ. 3409; టార్గెట్ ప్రైస్ రూ 3413; స్టాప్ లాస్ రూ.3363
హెచ్డీఎఫ్సీ లైఫ్: ప్రస్తుత ధర రూ. 668; టార్గెట్ ప్రైస్ రూ700; స్టాప్ లాస్ రూ.652
సూచన: ఇవి మార్కెట్ నిపుణుల అంచనాలు, అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు స్వీయ విచక్షణతో నిర్ణయం తీసుకోవడం సముచితం.
టాపిక్