Day trading guide for today: టైటన్, సన్ ఫార్మా తో ఈ రోజు లాభాలు పక్కా..
Day trading guide for today: ఎంఎఫ్ఎస్ఎల్, టైటన్ కంపెనీ, సన్ ఫార్మా, కమిన్స్ ఇండియా, ఎన్ హెచ్ పీ సీ.. స్టాక్స్ ఈ రోజు లాభాలను చవి చూసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Day trading guide for today: మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. ఎంఎఫ్ఎస్ఎల్, టైటన్ కంపెనీ, సన్ ఫార్మా, కమిన్స్ ఇండియా, ఎన్ హెచ్ పీ సీ.. స్టాక్స్ ఈ రోజు లాభాలను చవి చూసే అవకాశం ఉంది.
లాభాల్లో మార్కెట్లు
దేశీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు నిఫ్టీ 50, సెన్సెక్స్ మంగళవారం సెషన్‌లో మంచి లాభాలతో ముగిశాయి. మిశ్రమ అంతర్జాతీయ పరిణామాల మధ్య హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ICICI బ్యాంక్‌తో సహా పలు హెవీవెయిట్ స్టాక్స్ లాభాలు గడించాయి. నిఫ్టీ 50 89 పాయింట్లు లేదా 0.45 శాతం పెరిగి 19,783.40 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 276 పాయింట్లు లేదా 0.42 శాతం పెరిగి 65,930.77 వద్ద ముగిసింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లు కూడా స్వల్ప స్థాయిలో అయినా లాభాలను గడించాయి.
మార్కెట్ ఔట్ లుక్
నిఫ్టీ 19850 అడ్డంకిని అధిగమించాల్సిన అవసరం ఉందని, లేదంటే, ఇదే కన్సాలిడేషన్ ఫేజ్ కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, అమెరికా మార్కెట్లలో నెలకొన్న సానుకూలత ప్రభావం భారతీయ మార్కెట్లపై కూడా పడనుంది. కాగా, సుజుకి మోటార్ కార్ప్‌కు ప్రిఫరెన్షియల్ షేర్ల కేటాయింపును బోర్డు నవంబర్ 25న పరిశీలిస్తుందని మంగళవారం సాయంత్రం మారుతి సుజుకీ ప్రకటించిన, నేపథ్యంలో ఆ షేర్లు బుధవారం ఫోకస్ లో ఉండే అవకాశం ఉంది. మరోవైపు, మధ్యంతర డివిడెండ్ ప్రకటించడాన్ని నవంబర్ 29న బోర్డు సమావేశంలో పరిశీలిస్తామని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) ప్రకటించింది.
ఈ స్టాక్స్ పై దృష్టి
మార్కెట్ నిపుణులు చాయిస్ బ్రోకింగ్ ఈడీ సుమీత్ బగాడియా, ఆనంద్ రాఠీలో సీనియర్ మేనేజర్ టెక్నికల్ రీసెర్చ్ గా ఉన్న గణేశ్ దోంగ్రె, బొనాంజా పోర్ట్ ఫోలియోలో రీసెర్చ్ అనలిస్ట్ గా ఉన్న కునాల్ కాంబ్లే అంచనాల ప్రకారం.. ఎంఎఫ్ఎస్ఎల్, టైటన్ కంపెనీ, సన్ ఫార్మా, కమిన్స్ ఇండియా, ఎన్ హెచ్ పీ సీ. ... స్టాక్స్ ఈ రోజు లాభాలను చవి చూసే అవకాశం ఉంది.
ఎంఎఫ్ఎస్ఎల్: ప్రస్తుత ధర రూ. 981; టార్గెట్ ప్రైస్ రూ. 1040; స్టాప్ లాస్ రూ. 950.
టైటన్ కంపెనీ: ప్రస్తుత ధర రూ. 3394; టార్గెట్ ప్రైస్ రూ. 3350; స్టాప్ లాస్ రూ. 3478.
సన్ ఫార్మా: ప్రస్తుత ధర రూ. 1200; టార్గెట్ ప్రైస్ రూ. 1225; స్టాప్ లాస్ రూ. 1180
కమిన్స్ ఇండియా: ప్రస్తుత ధర రూ. 1872; టార్గెట్ ప్రైస్ రూ 1855; స్టాప్ లాస్ రూ.1910.
ఎన్ హెచ్ పీ సీ: ప్రస్తుత ధర రూ. 54.20; టార్గెట్ ప్రైస్ రూ 60; స్టాప్ లాస్ రూ.51.30
సూచన: ఇవి మార్కెట్ నిపుణుల అంచనాలు, అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు స్వీయ విచక్షణతో నిర్ణయం తీసుకోవడం సముచితం.