D Mart Q2FY24 results: ఆదాయం పెరిగింది.. కానీ లాభాలు తగ్గాయి: డీమార్ట్ క్యూ2 ఫలితాలు
D Mart Q2FY24 results: రాధాకిషన్ దామానీ యాజమాన్యం లోని డీ మార్ట్ సూపర్ మార్కెట్ చైన్ ను నిర్వహించే ఎవెన్యూ సూపర్ మార్ట్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.
D Mart Q2FY24 results: ఎవెన్యూ సూపర్ మార్ట్ లిమిటెడ్ (Avenue Supermart Ltd) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (Q2FY24) ఫలితాలను ప్రకటించింది. డీ మార్ట్ (D Mart) సూపర్ మార్కెట్ లు రాధాకిషన్ దామానీ కి చెందిన ఎవెన్యూ సూపర్ మార్ట్ లిమిటెడ్ సంస్థకు చెందినవే. ఈ క్యూ2 (Q2FY24) లో ఈ సంస్థ ఆదాయం గత సంవత్సరం క్యూ 2 తో పోలిస్తే 18.5% పెరిగింది.
రూ. 12 వేల కోట్లు..
Q2FY24 లో ఎవెన్యూ సూపర్ మార్ట్ లిమిటెడ్ మొత్తం రూ. 12,308 కోట్ల ఆదాయం సముపార్జించింది. గత సంవత్సరం క్యూ2 (Q2FY23) లో సంస్థ ఆదాయం రూ. 10,385 కోట్లుగా ఉంది. ఈ మూడు నెలలో దేశంలో కొత్తగా 9 స్టోర్స్ ను ప్రారంభించామని, వీటితో కలిపి మొత్తం డీ మార్ట్ (D Mart) స్టోర్స్ సంఖ్య 336 కి చేరిందని ఎవెన్యూ సూపర్ మార్ట్ లిమిటెడ్ వెల్లడించింది. అలాగే, ఈ క్యూ 2 లో సంస్థ ఈబీఐటీడీఏ రూ. 1002 కోట్లు కాగా, గత క్యూ2 లో అది రూ. 895 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్థ భాగం (H1FY24) లో సంస్థ ఆదాయం రూ. 23, 892 కోట్లుగా ఉంది. కాగా, గత ఆర్థిక సంవత్సరం తొలి అర్థ భాగం (H1FY23) లో సంస్థ ఆదాయం రూ. 20, 192 కోట్లుగా ఉంది.
లాభాలు తగ్గాయి..
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (Q2FY24) లో ఎవెన్యూ సూపర్ మార్ట్ లిమిటెడ్ నికర లాభాలు రూ. 659 కోట్లు. కాగా, గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (Q2FY23) లో సంస్థ రూ. 730 కోట్ల నికర లాభాలను ఆర్జించడం గమనార్హం. అంటే, సంస్థ ఆదాయం దాదాపు 18.5% పెరిగింది కానీ, నికర లాభాల్లో మాత్రం దాదాపు రూ. 60 కోట్ల క్షీణత నమోదైంది. అలాగే, ఎర్నింగ్స్ పర్ షేర్ (EPS) విషయానికి వస్తే, Q2FY24 లో అది రూ. 10.12 గా ఉండగా, Q2FY23 లో రూ. 11.28 గా ఉంది. డీ మార్ట్ తొలి స్టోర్ 2002 లో ముంబైలో ప్రారంభమైంది. ప్రస్తుతం మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, డామన్, కర్నాటక, తమిళనాడు, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీ, చత్తీస్ గఢ్, పంజాబ్ ల్లో 336 స్టోర్స్ ఉన్నాయి.
టాపిక్