D Mart Q4 results: Q4 లో 21 శాతం పెరిగిన డీ మార్ట్ ఆదాయం
D Mart Q4 results: రిటైల్ చైన్ స్టోర్ కంపెనీ డీ మార్ట్ Q4FY23 ఫలితాలను వెల్లడించింది. ఈ Q4 లో సంస్థ నికర లాభాలు 8.3% పెరిగి రూ. 505. 21 కోట్లకు చేరాయి.
D Mart Q4 results: డీ మార్ట్ (D Mart) స్టోర్స్ యాజమాన్య సంస్థ ఎవెన్యూ సూపర్ మార్ట్స్ (Avenue Supermarts) శనివారం Q4FY23 ఫలితాలను వెల్లడించింది. సంస్థ Q4FY23 లో రూ. 505.21 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక (Q4FY22) ఫలితాలతో పోలిస్తే, Q4FY23 లో డీ మార్ట్ (D Mart) 8. 3% అధిక లాభాలను ఆర్జించింది. Q4FY22 లో డీ మార్ట్ నికర లాభాలు రూ. 466.35 కోట్లు.
D Mart Q4 results: కొత్తగా 40 స్టోర్స్
రాధాకిషన్ దామానికి చెందిన ఎవెన్యూ సూపర్ మార్ట్స్ (Avenue Supermarts) సంస్థ Q4FY23 లో రూ. 10,337.12 ఆదాయం సముపార్జించింది. Q4FY22 తో పోలిస్తే సంస్థ ఆపరేషన్స్ ఆదాయం 21.11 % పెరిగింది. Q4FY23 లో డీ మార్ట్ (D Mart) సాధించిన ఆపరేషన్స్ ఆదాయం రూ. 8,606.09 కోట్లు. డిసెంబర్ 2022 నుంచి మార్చి 2023 మధ్య ఉన్న Q4FY23 లో ఎవెన్యూ సూపర్ మార్ట్స్ (Avenue Supermarts) కొత్తగా 18 డీ మార్ట్ (D Mart) స్టోర్స్ ను ఏర్పాటు చేసింది. వీటితో కలిపి మార్చి 31, 2023 నాటికి దేశవ్యాప్తంగా 324 డీ మార్ట్ స్టోర్స్ ఉన్నాయి. మొత్తంగా 2022 -23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 40 కొత్త డీ మార్ట్ (D Mart) స్టోర్స్ ను ఎవెన్యూ సూపర్ మార్ట్స్ (Avenue Supermarts) ఓపెన్ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం సంస్థ ఆదాయం రూ 30,976 కోట్లు. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరం కన్నా 38% అధికం. అలాగే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం సంస్థ నికర లాభాలు రూ. 2,379 కోట్లుగా ఉన్నాయి. FY22 లో అవి రూ. 1,493 కోట్లు. మే 12 శుక్రవారం డీ మార్ట్ (D Mart) షేర్ వాల్యూ 0.62% తగ్గి రూ. 3680.25 వద్ద ముగిసింది.