WhatsApp New Feature : ఇక ఫోన్ నెంబర్ లేకుండానే వాట్సాప్‌లో కనెక్ట్ అవ్వొచ్చు.. పేరు తెలిస్తే చాలు!-connect in whatsapp without phone number whatsapp advanced username feature with pin support check in details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp New Feature : ఇక ఫోన్ నెంబర్ లేకుండానే వాట్సాప్‌లో కనెక్ట్ అవ్వొచ్చు.. పేరు తెలిస్తే చాలు!

WhatsApp New Feature : ఇక ఫోన్ నెంబర్ లేకుండానే వాట్సాప్‌లో కనెక్ట్ అవ్వొచ్చు.. పేరు తెలిస్తే చాలు!

Anand Sai HT Telugu
Aug 20, 2024 09:00 AM IST

WhatsApp Without Phone Number : వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. అయితే ఇప్పటి వరకు ఫోన్ నెంబర్ ఉంటనే వాట్సాప్‌లో అవతలి వ్యక్తితో కనెక్ట్ అయ్యేవాళ్లం. కానీ ఇకపై అలాంటి అవసరం లేకుండా చేస్తుంది కంపెనీ. కేవలం పిన్ ఉంటే సరిపోతుంది.

ఫోన్ నెంబర్ లేకుండానే వాట్సాప్ చాటింగ్
ఫోన్ నెంబర్ లేకుండానే వాట్సాప్ చాటింగ్

అవతలివారికి వాట్సాప్‌లో మెసేజ్ చేయాలంటే వారి ఫోన్ నెంబర్ ఉండాలి. వారి నుంచి ఎలాంటి పర్మిషన్ లేకున్నా.. సందేశాన్ని పంపవచ్చు. కానీ ఇకపై ఫోన్ నెంబర్ లేకున్నా.. అవతలి వ్యక్తికి కనెక్ట్ అయ్యేలా వాట్సాప్ కొత్త ఫీచర్ మీద వర్క్ చేస్తుంది. పిన్ సపోర్ట్‌తో అడ్వాన్స్ యూజర్ నేమ్ ఫీచర్ వాట్సాప్ యూజర్ల కోసం అందుబాటులోకి రానుంది. ఇది ఒక అద్భుతమైన ఫీచర్. ఫోన్ నంబర్లను షేర్ చేయాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. వాట్సాప్ కొత్త ఫీచర్ స్క్రీన్ షాట్‌ను కూడా డబ్ల్యూఏబీటాఇన్ఫో షేర్ చేసింది.

కొన్ని రోజుల క్రితం వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై పనిచేస్తోందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ ఫీచర్ గురించి పెద్ద అప్డేట్ వచ్చింది. డబ్ల్యూఏబీటాఇన్ఫో నివేదిక ప్రకారం, వాట్సాప్ త్వరలో యూజర్ల కోసం పిన్ సపోర్ట్‌తో అడ్వాన్స్‌డ్ యూజర్ నేమ్ ఫీచర్‌ను తీసుకురాబోతోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఆండ్రాయిడ్ 2.24.18.2 కోసం వాట్సాప్ బీటాలో ఈ కొత్త ఫీచర్‌ను డబ్ల్యూఏబీటాఇన్ఫో చూసింది. వాట్సప్‌‌లోకి వస్తున్న ఈ ఫీచర్ల స్క్రీన్ షాట్లను డబ్ల్యూఏబీటాఇన్ఫో ఎక్స్ పోస్ట్‌లో షేర్ చేసింది.

ఫోన్ నెంబర్ అవసరం లేదు

ఫోన్ నంబర్ ప్రైవసీ కోసం షేర్ చేసిన స్క్రీన్ షాట్‌లో ఈ ఫీచర్‌ను చూడొచ్చు. ఈ స్క్రీన్ షాట్‌లో, ఫోన్ నంబర్ గోప్యత కోసం అధునాతన యూజర్ నేమ్ ఫీచర్‌ను తీసుకురావడానికి వాట్సాప్ సన్నాహాలు చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఈ ఫీచర్ అమల్లోకి వచ్చిన తర్వాత మీ యూజర్ నేమ్ ద్వారా వాట్సాప్‌లో ప్రజలు మీతో కనెక్ట్ కాగలరు. ఇది ఒక అద్భుతమైన ఫీచర్, ఇది ఫోన్ నంబర్లను షేర్ చేయాల్సిన అవసరాన్ని తీసేస్తుంది. వాట్సప్‌లో కొత్త వ్యక్తులతో చాటింగ్ చేయడానికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ ఫోన్ నంబర్ వారికి కూడా తెలియదు. యూజర్ నేమ్ మాత్రమే కనిపిస్తుంది. ఈ ఫీచర్ యాక్టివేట్ అయిన తర్వాత ఇప్పటికే మీ ఫోన్ నంబర్ ఉన్నవారు మీ నంబర్‌ను చూడగలుగుతారని గుర్తుంచుకోండి.

నెంబర్ చూడలేరు

యూజర్ల ప్రైవసీని మరింత మెరుగుపరిచేందుకు యూజర్ నేమ్ ఫీచర్ కోసం ఆప్షనల్ పిన్ కోడ్ ఫీచర్‌ను కూడా కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఈ PIN యూజర్ నేమ్‌కు అదనపు గోప్యతను ఇస్తుంది. తద్వారా కొత్త వ్యక్తులు మీ నెంబరును చూడరు. యూజర్ నేమ్‌ను నాలుగు అంకెల పిన్‌తో దాచుకోవచ్చు. మీరు మీ నెంబరును చూపించాలనుకునే వారితో ఈ పిన్ను పంచుకోగలుగుతారు. అయితే పిన్ చెప్పేటప్పుడు టూ స్టెప్ వెరిఫికేషన్ వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోరని గుర్తుంచుకోవాలి.

పిన్ యాక్సెప్ట్ చేయాలి

వాబీటాఇన్ఫో నివేదిక ప్రకారం, మీరు వాట్సాప్‌లో తెలియని నంబర్ల నుండి వచ్చే కొత్త సందేశాలను స్వీకరించలేరు. PIN ఫీచర్ యాక్టివేట్ అయిన తరువాత మీ యూజర్ నేమ్‌ని మొదటిసారి కాంటాక్ట్ చేయడానికి వచ్చే వ్యక్తికి PIN అవసరం అవుతుంది. మీరు మీ PINను పంపిన వ్యక్తితో పంచుకుంటారు, అప్పుడు మాత్రమే మీరు వారి సందేశాన్ని అందుకుంటారు. మీరు ఇప్పటికే మాట్లాడుతున్న కాంటాక్ట్‌లకు పిన్ ఫీచర్ పనిచేయదు. కంపెనీ ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. బీటా టెస్టింగ్ పూర్తయిన తర్వాత దీని స్థిరమైన వెర్షన్‌ను యూజర్ల కోసం విడుదల చేయనున్నారు.

Whats_app_banner