ChatGPT : చాట్​జీపీటీ సీఈఓ సామ్​ ఆల్ట్​మాన్​ ఉద్యోగం పోయింది!-chatgpt ceo sam altman fired board says it lost confidence ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Chatgpt : చాట్​జీపీటీ సీఈఓ సామ్​ ఆల్ట్​మాన్​ ఉద్యోగం పోయింది!

ChatGPT : చాట్​జీపీటీ సీఈఓ సామ్​ ఆల్ట్​మాన్​ ఉద్యోగం పోయింది!

Sharath Chitturi HT Telugu
Nov 18, 2023 07:10 AM IST

ChatGPT CEO Sam Altman : చాట్​జీపీటీ సీఈఓ బాధ్యతల నుంచి సామ్​ ఆల్ట్​మాన్​ని తొలగిస్తున్నట్టు ఓపెన్​ఏఐ సంస్థ ప్రకటించింది. ఈ వ్యవహారంపై సామ్​ కూడా స్పందించారు.

ఛాట్​జీపీటీ సీఈఓ సామ్​ ఆల్ట్​మాన్​ ఉద్యోగం పోయింది!
ఛాట్​జీపీటీ సీఈఓ సామ్​ ఆల్ట్​మాన్​ ఉద్యోగం పోయింది!

ChatGPT latest news : చాట్​జీపీటీ సీఈఓ సామ్​ ఆల్ట్​మాన్​ ఉద్యోగం పోయింది! సీఈఓ పదవి నుంచి ఆయన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.. చాట్​జీపీటీ మాతృసంస్థ ఓపెన్​ఏఐ. ఆయన పని, సామర్థ్యాలపై నమ్మకం కోల్పోయినట్టు బోర్డు వెల్లడించింది.

సామ్​ ఆల్ట్​మాన్​ తొలగింపు..

గతేడాది లాంచ్​ అయిన చాట్​జీపీటీ.. ప్రపంతవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆర్టిఫీషియెల్​ ఇంటెలిజెన్స్​ రంగంలో కొత్త ద్వారాలను తెరిచింది ఈ సంస్థ. అమెజాన్​, గూగుల్​, మెటా ఎంట్రీతో ఏఐ రేసు రసవత్తరంగా మారింది.

38ఏళ్ల సామ్​ ఆల్ట్​మాన్​.. సంస్థను ఇప్పటివరకు ముందుండి నడిపించారు. ఆయన కూడా ఒక సెన్సెషన్​ అయ్యారు. కానీ ఆయనకి, ఓపెన్​ఏఐ బోర్డుకు మధ్య విభేధాలు ఉన్నట్టు కనిపిస్తోంది.

Sam Altman news : "సమగ్ర రివ్యూ తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాము. చాట్​జీపీటీ సీఈఓ పదవి నుంచి సామ్​ ఆల్ట్​మాన్​ని తొలగిస్తున్నాము. బోర్డుకు సరైన సమాచారాలు ఇవ్వడంలో ఆయన విఫలం అయ్యాడు. ఫలితంగా బోర్డు తన బాధ్యతలు చేపట్టలేక పోయింది. బోర్డుకు ఇక ఏమాత్రం సామ్​ ఆల్ట్​మాన్​పై నమ్మకం లేదు," అని ఓపెన్​ఏఐ ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ చాట్​జీపీటీలో బిలియన్ల డాలర్లను ఇన్​వెస్ట్​ చేసింది మైక్రోసాఫ్ట్​. ఏఐ టెక్నాలజీని బింగ్​ సెర్చ్​ ఇంజిన్​తో పాటు మైక్రోసాఫ్ట్​లోని ఇతర ప్రాడక్ట్స్​కి కూడా తీసుకొస్తామని హామీనిచ్చింది.

Sam Altman fired : ఇక చాట్​జీపీటీ సీఈఓ పదవి నుంచి సామ్​ ఆల్ట్​మాన్​ని తొలగించిన ఓపెన్​ఏఐ బోర్డు.. ఆ స్థానంలో మీరా మారుతిని నియమించింది. ఆమె.. ఇప్పటివరకు అదే సంస్థలో సీటీఓ (చీఫ్​ టెక్నాలజీ ఆఫీసర్​)గా బాధ్యతలు నిర్వహించారు.

చాట్​జీపీటీలో నిన్న మొన్నటి వరకు కూడా కీలకంగా వ్యవహరించారు సామ్​ ఆల్ట్​మాన్​. సంస్థ తరఫున అనేక ప్రాడక్ట్స్​ని రివీల్​ చేశారు. ఇక ఇప్పుడు.. ఈ వ్యవహారంపై ఆయన స్పందించారు.

"ఓపెన్​ఏఐ టీమ్​ని నేను ప్రేమించాను. వ్యక్తిగతంగా చాలా వృద్ధి సాధించాను. ప్రపంచానికి కూడా కొంత మంచి చేశానని విశ్వసిస్తున్నాను. అద్భుత టాలెంట్​ ఉన్న వారితో పనిచేయడాన్ని ప్రేమించాను," అని ట్విట్టర్​ వేదికగా స్పందించారు సామ్​ ఆల్ట్​మాన్​.

ఇక సామ్​ ఆల్ట్​మాన్​ని ఫైర్​ చేయడంతో.. ఓపెన్​ఏఐ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రేగ్​ బ్రూక్​మాన్​కు తన పదవికి రాజీనామా చేశారు.

ChatGPT CEO Sam Altman fired : "8ఏళ్ల క్రితం ఓపెన్​ఏఐని నా అపార్ట్​మెంట్​లో ప్రారంభించాము. అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. చాలా కఠినమైన పరిస్థితులను, సంతోషకరమైన సందర్భాలను ఎదుర్కొన్నాము. చాలా సాధించాము. కానీ ఇవాళ వచ్చిన వార్తతో (సామ్​ ఆల్ట్​మాన్​ తొలగింపు).. నేను కూడా క్విట్​ చేస్తున్నాను," అని గ్రేగ్​ బ్రూక్​మాన్​ తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం