Mahila Samman Savings Certificate : రెండేళ్లకు రూ.32 వేల వడ్డీ-ఆడ పిల్లలు, మహిళలకు కేంద్రం అందిస్తున్న సూపర్ స్కీమ్-central govt mahila samman savings certificate scheme details application process eligibility ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mahila Samman Savings Certificate : రెండేళ్లకు రూ.32 వేల వడ్డీ-ఆడ పిల్లలు, మహిళలకు కేంద్రం అందిస్తున్న సూపర్ స్కీమ్

Mahila Samman Savings Certificate : రెండేళ్లకు రూ.32 వేల వడ్డీ-ఆడ పిల్లలు, మహిళలకు కేంద్రం అందిస్తున్న సూపర్ స్కీమ్

Bandaru Satyaprasad HT Telugu
Jul 31, 2024 01:50 PM IST

Mahila Samman Savings Certificate : బాలికలు, మహిళల ఆర్థిక భరోసాకు కేంద్రం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ స్కీమ్ ద్వారా 7.5 శాతం అత్యధిక వడ్డీతో రెండేళ్ల కాలపరిమితితో అమలు చేస్తు్న్నారు.

రెండేళ్లకు రూ.32 వేల వడ్డీ-ఆడ పిల్లలు, మహిళలకు కేంద్రం అందిస్తున్న సూపర్ స్కీమ్
రెండేళ్లకు రూ.32 వేల వడ్డీ-ఆడ పిల్లలు, మహిళలకు కేంద్రం అందిస్తున్న సూపర్ స్కీమ్

Mahila Samman Savings Certificate : ఆడ పిల్లలు, మహిళల ఆర్థిక భద్రతకు కేంద్ర ప్రభుత్వం "మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్" పథకం అమల్లోకి తెచ్చింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ జూన్ 27, 2023న ఈ పథకంపై ఈ-గెజిట్ జారీ చేసింది. ఈ పథకాన్ని పోస్టాఫీసుతో పాటు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, అర్హత కలిగిన ప్రైవేట్ రంగ బ్యాంకులలో అమలు చేస్తుంది. ఈ పథకం పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఏప్రిల్ 1, 2023 నుంచి అమలులో ఉంది. మార్చి 31, 2025 వరకు రెండేళ్ల కాలానికి ఈ సేవింగ్స్ సర్టిఫికేట్ చెల్లుబాటు అవుతుంది.

బాలికలు, మహిళలకు సురక్షితమైన పెట్టుబడి పథకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తుంది. ఈ పథకం మార్చి 31, 2025న లేదా అంతకంటే ముందు రెండు సంవత్సరాల పరిమితితో ఖాతాను తెరవవచ్చు. ఈ పథకంలో పెట్టుబడికి సంవత్సరానికి 7.5 శాతం చొప్పున వడ్డీ వస్తుంది. ప్రతి త్రైమాసికానికి కాంపాండ్ వడ్డీ లెక్కగడతారు. ఈ పథకంలో కనిష్టంగా రూ.1,000, గరిష్టంగా రూ.2,00,000 డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసిన నగదు మెచ్యూరిటీ ప్రారంభించిన తేదీ నుంచి రెండేళ్లు ఉంటుంది. అత్యవసర సమయంలో పాక్షికంగా నగదు విత్ డ్రాకు అవకాశం కల్పిస్తారు. స్కీమ్ ఖాతాలో అర్హతను బట్టి బ్యాలెన్స్‌లో గరిష్టంగా 40 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీమ్ లో రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే రెండేళ్ల తర్వాత రూ.32044 వడ్డీ అందుకోవచ్చు.

ఎమ్ఎస్ఎస్ఎస్ స్కీమ్ అర్హతలు

1. దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారతీయులై ఉండాలి.

2. ఈ పథకం మహిళలు, ఆడపిల్లలకు మాత్రమే.

3. వ్యక్తిగత మహిళ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు.

4. మైనర్ ఖాతాను తండ్రి లేదా సంరక్షకుడు తెరవవచ్చు.

5. గరిష్ట వయోపరిమితి లేదు, అన్ని వయసుల మహిళలు ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ(ఆఫ్‌లైన్)

Step 01: దరఖాస్తుదారు సమీపంలోని పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ లేదా షెడ్యూల్ బ్యాంకులో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

Step 02: దరఖాస్తుదారు ఫామ్‌ను అధికారిక వెబ్‌సైట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Step 03: దరఖాస్తు ఫామ్‌ను పూర్తి చేసి, అవసరమైన అన్ని పత్రాలను జత చేయాలి.

Step 04: డిక్లరేషన్, నామినేషన్ వివరాలను అందించాలి.

Step 05: ఎంత డిపాజిట్ చేస్తారో దరఖాస్తులో తెలియజేయాలి.

Step 06: ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్’ పథకంలో మీరు పెట్టుబడి పెట్టినట్లు రుజువుగా సర్టిఫికేట్‌ను పొందాలి.

ఈ స్కీమ్ దరఖాస్తుకు అవసరమైన పత్రాలు

1. పాస్‌పోర్ట్ సైజు ఫోటో

2. బర్త్ సర్టిఫికేట్

3. ఆధార్ కార్డ్

4. పాన్ కార్డ్

5. డిపాజిట్ మొత్తం లేదా చెక్‌తో పాటు పే-ఇన్-స్లిప్

6. గుర్తింపు, చిరునామా రుజువు పత్రాలు : పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ఐడీ, ప్రభుత్వ అధికారి సంతకంతో NREGA జాబ్ కార్డ్

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్
Whats_app_banner

సంబంధిత కథనం