Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ కొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..
Hero Splendor Plus : మీరు హీరో స్ప్లెండర్ ప్లస్ కొనాలని చూస్తున్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..
Hero Splendor Plus : 1997లో లాంచ్ అయినప్పటి నుంచి హీరో స్ప్లెండర్కు ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చౌకైన ధర, మంచి మైలేజ్, లో మెయిన్టేనెన్స్, రియలబులిటీ పరంగా ఈ బైక్‌కు మంచి గుర్తింపు ఉండటం ఇందుకు ఓ కారణం. స్ప్లెండర్కు ఇప్పటికే అనేక వర్షెన్లు తీసుకొచ్చింది హీరో మోటోకార్ప్. ఒరిజినల్ స్ప్లెండర్ ప్రస్తుతం సేల్‌లో లేకపోయినప్పటికీ.. హీరో స్ప్లెండర్ ప్లస్ ఇప్పటికీ దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో ఈ బైక్ విశేషాలు తెలుసుకుందాము..
హీరో స్ప్లెండర్ ప్లస్- ధర..
హీరో స్ప్లెండర్ ప్లస్‌కు సంబంధించి ప్రస్తుతం నాలుగు వేరియంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ఎక్స్‌షోరూం ధరలు రూ. 72,076- రూ. 74,396 మధ్యలో ఉన్నాయి.
Hero Splendor Plus on road price Hyderabad : ప్రస్తుతానికి సిల్వర్ నెక్సస్ బ్లూ, బ్లాక్ విత్ సిల్వర్, బ్లాక్ విత్ రెడ్, బ్లాక్ విత్ పర్పుల్, మాట్ షీల్డ్ గోల్డ్, హెవీ గ్రే గ్రీన్, ఫైర్‌ఫ్లై గోల్డెన్, బీటిల్ రెడ్, బంబుల్ బీ యెల్లో, రూబీ రెడ్, సన్‌షైన్ యెల్లో, బటర్‌ఫ్లై యెల్లో వంటి రంగుల్లో హీరో స్ప్లెండర్ ప్లస్ అందుబాటులో ఉంది.
ఇదీ చదవండి:- Honda Shine 100 vs Hero Splendor Plus: ఈ రెండు 100cc బడ్జెట్ బైక్‍ల్లో ఏది బెస్ట్? ధర, స్పెసిఫికేషన్లు
హీరో స్ప్లెండర్ ప్లస్- ఇంజిన్..
ఈ బైక్‌లో 97.2సీసీ ఎయిర్ కూల్డ్, 4 స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది.. 8000 ఆర్పీఎం వద్ద 7.91 బీహెచ్పీ పవర్‌ను, 6000 ఆర్పీఎం వద్ద 8.05ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 4 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఫ్యూయెల్ ఇంజెక్టర్ కూడా ఉంటుంది.
హీరో స్ప్లెండర్ ప్లస్- ఫీచర్స్..
Hero Splendor Plus features : హీరో స్ప్లెండర్ ప్లస్‌లో ట్యూబ్‌లెస్ టైర్స్‌తో కూడిన అలాయ్ వీల్స్, హాలోజెన్ లైటింగ్, ఎలక్ట్రిక్ స్టార్టర్ వంటివి లభిస్తున్నాయి. ఐ3ఎస్ టెక్నాలజీ కూడా ఉండటంతో క్లచ్ మూమెంట్ బట్టి ఇంజిన్ స్టార్ట్/ స్టాప్ అవుతూ ఉంటుంది.
Hero Splendor Plus on road price : ఇక స్ప్లెండర్ ప్లస్‌లో ట్యూబ్యులర్ డబుల్ క్రాడిల్ ఫ్రేమ్ ఉంటుంది. ఫ్రెంట్ వీల్‌కు టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ అబ్సార్బర్స్, రేర్ వీల్‌కు హైడ్రాలిక్ షాక్ అబ్సార్బర్స్ వస్తున్నాయి. ఫ్రెంట్తో పాటు రేర్‌లో 130ఎంఎం డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టెమ్ సైతం లభిస్తోంది.
సంబంధిత కథనం