Prime Ministers : చరిత్రలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు వీరే.. ఎందుకు తెలుసా?-budget 2024 prime ministers who presented the union budget in history ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Prime Ministers : చరిత్రలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు వీరే.. ఎందుకు తెలుసా?

Prime Ministers : చరిత్రలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు వీరే.. ఎందుకు తెలుసా?

Anand Sai HT Telugu
Jul 21, 2024 09:49 PM IST

Union Budget 2024 : బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే.. ఆర్థిక మంత్రి పేరే ఎక్కువగా వినిపిస్తుంది. అయితే భారతదేశ చరిత్రలో ప్రత్యేక పరిస్థితుల్లో ప్రధాన మంత్రులు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు. వారు ఎవరో? బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టారో తెలుసుకోండి.

జవహర్ లాలా నెహ్రూ
జవహర్ లాలా నెహ్రూ

భారతదేశంలో కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రులు సమర్పిస్తారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులు వస్తే.. ప్రధాన మంత్రులు సైతం ఆ బాధ్యతను తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చరిత్ర చెబుతోంది. సాధారణంగా ఆర్థిక మంత్రులు బడ్జెట్‌ను సమర్పిస్తారు. వివిధ కారణాల వల్ల ప్రధానులు కూడా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. జవహర్‌లాల్ నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 7వ సారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత ఫిబ్రవరిలో వరుసగా ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టి మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేసిన నిర్మలా సీతారామన్ ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. అయితే ప్రధాన మంత్రులు సైతం బడ్జెట్ ప్రవేశపెట్టిన చరిత్ర మనకు ఉంది. వారి వివరాలు తెలుసుకుందాం..

ముంద్రా కుంభకోణం ఆరోపణల తర్వాత 1958 ఫిబ్రవరి 22న అప్పటి ఆర్థిక మంత్రి డిడి కృష్ణమాచారి రాజీనామా చేశారు. ఆర్థిక మంత్రి రాజీనామా చేయడంతో అప్పటి ప్రధాని నెహ్రూ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పటికే విదేశీ వ్యవహారాలు, అణు ఇంధన శాఖలను నిర్వహించిన నెహ్రూ 1958 ఫిబ్రవరి 28న ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతతో బడ్జెట్‌ను సమర్పించారు.

నెహ్రూ తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యాక ప్రతి సంవత్సరం పూర్తి బడ్జెట్, 1967-68 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు.

ఆ తర్వాత 1970లో ప్రధానిగా ఉన్న నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. 1969లో మొరార్జీ దేశాయ్ రాజీనామా తర్వాత ఇందిరా గాంధీ బడ్జెట్‌ను సమర్పించారు. ఇందిరా గాంధీ తన హయాంలో రెండుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

1987-89లో ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1987లో ఆర్థిక మంత్రిగా వీపీ సింగ్‌ రాజీనామా చేసిన తర్వాత రాజీవ్‌గాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాజీవ్ గాంధీకి సన్నిహితులు పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో వి.పి. సింగ్ ఆ కేసుల దర్యాప్తులో రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీవ్ గాంధీ ఈ సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.

పీవీ నరసింహారావు హయాంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మన్మోహన్ సింగ్ 1991 నుండి 1996 వరకు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. 1991 నాటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి ప్రతిస్పందనగా బడ్జెట్ రూపొందించబడింది. మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని కొత్త బాట పట్టింది. భారతదేశ చరిత్రలో 1991 బడ్జెట్ కు చాలా ప్రాముఖ్యత ఉంది.

Whats_app_banner