Budget 2024 : రైతులకు కేంద్రం భారీ శుభవార్త- పీఎం కిసాన్​ నిధులు రూ. 8వేలకు పెంపు!-budget 2024 centre likely to raise pm kissan samman nidhi amount to 8000 reports say ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget 2024 : రైతులకు కేంద్రం భారీ శుభవార్త- పీఎం కిసాన్​ నిధులు రూ. 8వేలకు పెంపు!

Budget 2024 : రైతులకు కేంద్రం భారీ శుభవార్త- పీఎం కిసాన్​ నిధులు రూ. 8వేలకు పెంపు!

Sharath Chitturi HT Telugu
Jul 07, 2024 09:00 AM IST

మోదీ ప్రభుత్వం మూడోసారి పూర్తి స్థాయి బడ్జెట్​ను మరికొద్ది రోజుల్లో ప్రవేశపెట్టనుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని ఏమైనా పెంచాలా వద్దా అనే దానిపై ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.

pm kisan
pm kisan

జులై 23న కేంద్ర బడ్జెట్​ ఉండనుందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఆ రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. మోదీ ప్రభుత్వంలో మూడోసారి పూర్తి స్థాయి బడ్జెట్​ని ప్రవేశపెట్టనున్నారు. సామాన్యుల నుంచి బడా వ్యాపారుల వరకు అందరి దృష్టి ఈ బడ్జెట్​పైనే ఉంటుంది. అయితే ఈ దఫా బడ్జెట్​లో మోదీ ప్రభుత్వం రైతులకు భారీ కానుకలు ఇవ్వనుందని తెలుస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని కేంద్రం పెంచవచ్చని సమాచారం. ఇదే విషయంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ రంగాలకు చెందిన వ్యక్తులతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి డబ్బులు పెంపు..!

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రస్తుతం ప్రభుత్వం రూ.6000 ఇస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతులకు 3 విడతలుగా రూ.2-2 వేలు ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా 11 కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. అయితే ఈ నిధిని రూ. 6వేల నుంచి రూ.8000కు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు పలు నివేదికలు పేర్కొన్నాయి.

మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నరేంద్ర మోదీ ఈ ఫైలుపైనే మొదట సంతకం చేశారు. అంటే ఈ పథకానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ప్రధాని మోదీ వారణాసి నుంచి ప్రారంభించారు. ఈసారి మోదీ ప్రభుత్వం రూ.20 వేల కోట్లను నేరుగా అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేసింది.

అందుకే ఈ దఫా బడ్జెట్​ని రైతులు సైతం కీలకంగా పరిగణిస్తున్నారు. తమకు లబ్ధిచేకూరే విధంగా ఏవైనా నిర్ణయాలు ఉంటాయా అని చూస్తున్నారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వం తన మొదటి టర్మ్ చివరి నెలల్లో, అంటే 2019లో ఈ పథకాన్ని ప్రారంభించింది. 2019 ఫిబ్రవరి 24న ప్రధాని దీన్ని ఆవిష్కరించారు. అప్పటి నుంచి ఈ పథకం ద్వారా కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి రూ.3 లక్షల కోట్లకుపైగా నిధిలు బదిలీ చేశారు.

2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్​లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ శాఖ బడ్జెట్​ను ప్రభుత్వం పెంచింది. కేంద్ర ప్రభుత్వం రూ.1.27 లక్షల కోట్ల బడ్జెట్​ను నిర్దేశించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే ఎక్కువే.

జులై 23న బడ్జెట్​..

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఆ వివరాలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ లో వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల తేదీలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని వెల్లడించారు. జూలై 22 నుంచి ఆగస్ట్ 12 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయన్నారు. 2024-25 సంవత్సరానికి గానూ పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్​ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ నెల 23న ప్రవేశపెడ్తారు. ఎన్డీఏ కూటమి బలం పెరగడంతో ఈ బడ్జెట్​పై అందరి ఫోకస్​ పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం