BSA Gold Star 650 : ఆగస్ట్​ 15న.. ఇండియాలో బీఎస్​ఏ గోల్డ్​ స్టార్​ 650 లాంచ్​!-bsa gold star 650 to be launched on august 15 check details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bsa Gold Star 650 : ఆగస్ట్​ 15న.. ఇండియాలో బీఎస్​ఏ గోల్డ్​ స్టార్​ 650 లాంచ్​!

BSA Gold Star 650 : ఆగస్ట్​ 15న.. ఇండియాలో బీఎస్​ఏ గోల్డ్​ స్టార్​ 650 లాంచ్​!

Sharath Chitturi HT Telugu
Jun 25, 2024 12:45 PM IST

BSA Gold Star 650 India : ఇండియాలో బీఎస్​ఏ గోల్డ్​ స్టార్ 650 బైక్​ లాంచ్​కు రెడీ అవుతోంది. ఆగస్ట్​ 15న ఇది లాంచ్​ అవ్వొచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..

బీఎస్​ఏ గోల్డ్​ స్టార్​ 650
బీఎస్​ఏ గోల్డ్​ స్టార్​ 650

BSA Gold Star 650 price in India : బ్రిటన్​కు చెందిన బీఎస్​ఏ మోటార్​సైకిల్స్​ సంస్థ.. ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోండి. ఈ మేరకు ఆగస్ట్​ 15న ఓ బైక్​ని లాంచ్​ చేసేందుకు రెడీ అవుతోందని సమాచారం. దీని పేరు బీఎస్​ఏ గోల్డ్​ స్టార్ 650​. అంతర్జాతీయ మార్కెట్​లో.. ఈ బైక్​ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో.. ఈ మోడల్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

బీఎస్​ఏ గోల్డ్​ స్టార్​ 650..

మహీంద్రా గ్రూప్​ సబ్సిడరీ అయిన కాసిక్​ లెజెండ్స్​.. ఇండియాలో బీఎస్​ఏ గోల్డ్​ స్టార్​ 650 లాంచ్​ని పర్యవేక్షిస్తోంది. ఇక ఈ బైక్​లో కర్వ్​డ్​ ఫెండర్స్​, సైడ్​ ప్యానెల్స్​, క్రోమ్​ డీటైలింగ్​ వంటివి ఉంటాయి. ట్యూబ్యులర్​ స్టీల్​ డ్యూయెల్​ క్రాడిల్​ ఫ్రేమ్​, 41ఎంఎం టెలిస్కోపిక్​ ఫ్రెట్​ ఫోర్క్స్​, ట్విన్​ రేర్​ షాక్​ అబ్సార్బర్స్​ వంటివి వస్తాయి.

BSA Gold Star 650 India launch : రెట్రో​ లుక్​తో వచ్చే ఈ బీఎస్​ఏ గోల్డ్​ స్టార్​ 650లో 652 సీసీ, లిక్విడ్​ కూల్డ్​, సింగిల్​ సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది.. 6,500 ఆర్​పీఎం వద్ద 45 హెచ్​పీ పవర్​ని- 4,000 ఆర్​పీఎం వద్ద 55 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇంజిన్​కి.. 5 స్పీడ్​ గేర్​బాక్స్​ కనెక్ట్​ చేసి ఉంటుంది. ఇందులో స్లిప్పర్​ క్లచ్​ ఉంటుంది.

ఈ బైక్​లో వైర్​-స్పోక్​ వీల్స్​, రెండువైపులా సింగిల్​ డిస్క్​, ఏబీఎస్​ వంటి ఫీచర్స్​ ఉంటాయి. బ్రెంబో కాలిపర్స్​, ఇంజిన్​ ఇమ్మొబిలైజర్​, హ్యాండిల్​ బార్​ మౌటెడ్​ యూఎస్​బీ పోర్ట్​ వంటివి ఇతర ఫీచర్స్​గా ఉన్నాయి.

రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఇంటర్​సెప్టర్​ 650, రాయల్​ ఎన్​ఫీల్డ్​ మిటియర్​ 650కి గట్టి పోటీనిచ్చే విధంగా ఈ బీఎస్​ఏ గోల్డ్​ స్టార్​ 650 లాంచ్​ అవుతుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

BSA Gold Star 650 India : యూకేలో ఈ బీఎస్​ఏ గోల్డ్​ స్టార్​ 650 ధర 6,500- 7,500 పౌండ్లుగా ఉంది. రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఇంటర్​సెప్టర్​ ధర 6,400- 6,900 పౌండ్లుగా ఉంది.

అయితే.. ఈ బీఎస్​ఏ గోల్డ్​ స్టార్​ 650 బైక్​ని ఇండియాలోనే తయారు చేస్తున్నారు కాబట్టి.. ధర కాస్త తగ్గొచ్చు. మార్కెట్​ అంచనా ప్రకారం.. ఈ బైక్​ ఎక్స్​షోరూం ధర రూ. 3.5 లక్షలకు కాస్త అటు, ఇటుగా ఉండొచ్చు. అంటే.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఇంటర్​సెప్టర్​ 650 టాప్​ వేరియంట్​ కన్నా రూ. 20వేలు అధికం!

BSA Gold Star 650 : బీఎస్​ఏ గోల్డ్​ స్టార్​ 650 లాంచ్​ డేట్​ ప్రస్తుతం రూమర్స్​ స్టేజ్​లోనే ఉంది. లాంచ్​ డేట్​, ధరతో పాటు ఇతర వివరాలపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇంకో విషయం! ఇప్పుడు హెచ్​టీ తెలుగు వాట్సాప్​ ఛానెల్​లో అందుబాటులో ఉంది. ఆటోమొబైల్​ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ తెలుకునేందుకు.. హెచ్​టీ తెలుగు వాట్సాప్​ ఛానెల్​ని ఫాలో అవ్వండి!

WhatsApp channel

సంబంధిత కథనం