Best smartwatches under 5000 : రూ. 5వేల బడ్జెట్లోపు స్మార్ట్‌వాచ్ కొనాలా? ఇవి బెస్ట్!
Best smartwatches under ₹5000 : రూ. 5వేల బడ్జెట్లోపు మంచి స్మార్ట్‌వాచ్ కొనాలని చూస్తున్నారా? అయితే .. ది బెస్ట్ స్మార్ట్‌వాచ్ లిస్ట్‌ను మీకోసం తీసుకొచ్చాము. మీరూ ఓ లుక్కేయండి.
Best smartwatches under ₹5000 : ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్స్‌లో 'స్మార్ట్'వాచ్ ఒకటి. చాలా మంది సాధారణ వాచ్‌ల కన్నా ఇప్పుడు స్మార్ట్‌వాచ్‌లే ప్రిఫర్ చేస్తున్నారు. మీరు కూడా ఓ స్మార్ట్‌వాచ్ కొనాలని చూస్తున్నారా? అయితే ఇదే మంచి సమయం! మార్కెట్లో రూ. 5వేలకు అందుబాటులో ఉన్న ది బెస్ట్ స్మార్ట్‌వాచ్‌ల వివరాలు.. మీకోసం.
బోట్ ఎక్స్టెండ్..
BOAT Xtend smartwatch price : ఇందులో అలెక్సా ఫీచర్ బిల్ట్-ఇన్‌గా వస్తుంది. మీ హార్ట్, హార్ట్ రేట్‌ను ఇది ట్రాక్ చేస్తుంది. స్లీప్ సైకిల్స్, స్ట్రెస్ రేట్స్, ఎస్పీఓ2తో పాటు మరిన్నింటిని ట్రాక్ చేయగలదు ఈ బోట్ ఎక్స్టెండ్ స్మార్ట్‌వాచ్. మీ మూడ్‌కు తగ్గట్టుగా మీరు స్మార్ట్‌వాచ్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులో 1.69 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. దీని బ్యాటరీ లైఫ్ 7రోజులు. ఈ స్మార్ట్‌వాచ్ ధర రూ. 2,700.
ఫైర్- బోల్ట్ గ్లాడియేటర్..
Fire Boltt Gladiator smartwatch price : ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది. 1.96 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ దీని సొంతం. 123 రకాల స్పోర్ట్స్ మోడ్స్‌తో కూడిన ఈ గ్లాడియేటర్ ధర రూ. 2,499. ఇందులో అల్ట్రా-నారో ఫ్రేమ్ డిజైన్ ఉంది. 8 మెన్యూ స్టైల్స్ కూడా ఉన్నాయి.
నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా 2..
Noise ColorFit Ultra 2 price : ఇందులో 1.78 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. దీని బ్యాటీ లైఫ్ 7 రోజులు. మీ హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సీజన్ లెవల్, స్లీప్ సైకిల్ వంటివి ఇది మెజర్ చేస్తుంది. అల్వేస్ ఆన్ స్మార్ట్ నోటిఫికేషన్స్ ఆప్షన్ కూడా ఉంది. 60కిపైగా స్పోర్ట్స్ మోడ్స్, 100కిపైగా వాచ్ ఫేసెస్ దీని సొంతం. దీని ధర రూ. 3,999.
పెబుల్ కాస్మోస్ గ్రాండే..
Pebble Cosmos Grande : ఇందులో 2.1 ఇంచ్ స్క్రీన్‌తో పాటు 600 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి. డ్యూయెల్ కేసింగ్ కలర్స్, సిలికాన్ ఇంటర్ఛేంజెబుల్ స్ట్రాప్స్ వంటివి కంఫర్ట్‌ని ఇస్తాయి. ఈ స్మార్ట్‌వాచ్ ధర రూ. 3,700.
జూక్ డాష్..
Zook Dash smartwatch price : మీ రియల్-టైమ్ హార్ట్ రేట్‌ను ఈ జూక్ డాష్ స్మార్ట్‌వాచ్ ట్రాక్ చేస్తుంది. మీ రోజువారీ స్లీప్ స్టేషస్‌ను మానిటర్ చేస్తుంది. 'జిరోనెర్ హెల్త్ ప్రో' యాప్ ద్వారా మీ డైలీ, వీక్లీ డేటా తెలుసుకోవచ్చు. ఇందులో 1.69 ఇంచ్ ఫుల్ హెచ్డీ టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఇన్కమింగ్ కాల్ రిమైండర్, షెడ్యూల్ రిమైండర్, సెడెంటరీ రిమైండర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్ ధర రూ. 2,899.
సంబంధిత కథనం