boAt Wave Ultima Smartwatch: చవకగా బ్లూటూత్ కాలింగ్‍తో బోట్ నుంచి స్మార్ట్ వాచ్-boat wave ultima smartwatch launched in india with bluetooth calling for 2999 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Boat Wave Ultima Smartwatch Launched In India With Bluetooth Calling For 2999

boAt Wave Ultima Smartwatch: చవకగా బ్లూటూత్ కాలింగ్‍తో బోట్ నుంచి స్మార్ట్ వాచ్

HT Telugu Desk HT Telugu
Nov 08, 2022 08:09 PM IST

boAt Wave Ultima Smartwatch launched : బడ్జెట్ రేంజ్‍లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తో మరో స్మార్ట్ వాచ్‍ను బోట్ తీసుకొచ్చింది. ఆకర్షణీయమైన కర్వ్డ్ డిస్‍ప్లే కూడా దీనికి మరో సానుకూలతగా ఉంది. ఇప్పటికే ఈ స్మార్ట్ వాచ్ సేల్‍కు అందుబాటులో ఉంది.

బోట్ వేవ్ అల్టిమా స్మార్ట్ వాచ్
బోట్ వేవ్ అల్టిమా స్మార్ట్ వాచ్

boAt Wave Ultima Smartwatch launched : ప్రముఖ దేశీయ బ్రాండ్ బోట్ నుంచి ఆకర్షణీయమైన ఫీచర్లతో మరో స్మార్ట్ వాచ్ లాంచ్ అయింది. బ్లూటూత్ కాలింగ్ సదుపాయంతో బోట్ వేవ్ అల్టిమా స్మార్ట్ వాచ్ వచ్చేసింది. ఆల్‍వేస్ ఆన్ ఫీచర్ కలిగిన క్రాక్ రెసిస్టెంట్ కర్వ్ ఆర్క్ డిస్‍ప్లేతో ఈ వాచ్ వస్తోంది. బ్లూటూత్ కాలింగ్ కోసం ఈ వాచ్‍లో ఇన్‍బుల్ట్ గా స్పీకర్, మైక్రోఫోన్ ఉన్నాయి. ముఖ్యమైన హెల్త్ ఫీచర్లు, 100కు పైగా స్పోర్ట్స్ మోడ్‍లను ఈ నయా స్మార్ట్ వాచ్ కలిగి ఉంది. బోట్ వేవ్ అల్టిమా స్మార్ట్ వాచ్ పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

boAt Wave Ultima price : బోట్ వేవ్ అల్టిమా ధర

బోట్ వేవ్ అల్టిమా స్మార్ట్ వాచ్ ధర రూ.2,999గా ఉంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ (Flipkart), బోట్ (boat-lifestyle.com) అధికారిక వెబ్‍సైట్‍లో ఈ వాచ్‍ను కొనుగోలు చేయవచ్చు. రాగింగ్ రెడ్, యాక్టివ్ బ్లాక్, టీల్ గ్రీన్ కలర్ ఆప్షన్‍లలో ఈ వాచ్ లభిస్తోంది.

boAt Wave Ultima Specifications: బోట్ వేవ్ అల్టిమా స్పెసిఫికేషన్లు

1.8 ఇంచుల కర్వ్డ్ డిస్‍ప్లేతో బోట్ వేవ్ అల్టిమా స్మార్ట్ వాచ్ వస్తోంది. 500 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, ఎడ్జ్ టూ ఎడ్జ్ ఆల్‍వేస్ ఆన్ ఫీచర్ ఉంటుంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.3 వెర్షన్‍ను ఈ వాచ్ కలిగి ఉంది. బ్లూటూత్ కాలింగ్ కోసం ఈ వాచ్‍లో స్పీకర్, మైక్రోఫోన్ ఉన్నాయి. దీంతో నేరుగా వాచ్ నుంచి కాల్స్ మాట్లాడవచ్చు. కాల్స్ చేసుకోవచ్చు. కొన్ని కాంటాక్ట్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు.

boAt Wave Ultima battery life: 10 రోజుల బ్యాటరీ లైఫ్

boAt Wave Ultima Smartwatchలో హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ మానిటరింగ్, స్టెస్ ట్రాకర్ హెల్త్ ఫీచర్లు ఉన్నాయి. వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, యోగాతో పాటు మొత్తంగా 100కుపైగా స్పోర్ట్స్ మోడ్‍లకు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. ఫుల్ చార్జ్ పై boAt Wave Ultima స్మార్ట్ వాచ్ 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. బ్లూటూత్ కాలింగ్‍తో వినియోగిస్తే 3 రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుంది. వాటర్, డస్ట్ నుంచి రక్షణ కోసం ఐపీ68 రేటింగ్‍ను ఈ వాచ్ కలిగి ఉంది.

WhatsApp channel