Middle Class Scooters : మిడిల్ క్లాస్‌కు బెటర్ ఆప్షన్ ఈ స్కూటీలు.. ధర రూ.80000లోపే.. మంచి మైలేజీ కూడా!-best scooters to middle class people under 80000 rupees honda activa 6g to yamaha fascino 125 check list ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Middle Class Scooters : మిడిల్ క్లాస్‌కు బెటర్ ఆప్షన్ ఈ స్కూటీలు.. ధర రూ.80000లోపే.. మంచి మైలేజీ కూడా!

Middle Class Scooters : మిడిల్ క్లాస్‌కు బెటర్ ఆప్షన్ ఈ స్కూటీలు.. ధర రూ.80000లోపే.. మంచి మైలేజీ కూడా!

Anand Sai HT Telugu
Nov 05, 2024 06:00 PM IST

Middle Class Range Scooters : స్కూటీల మీద తిరిగితే వచ్చే కిక్కు వేరు. చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. మిడిల్ క్లాస్ వాళ్లు కూడా ఎక్కువగా వీటిపైనే ఆసక్తి చూపిస్తున్నారు. బడ్జెట్ ధరలో టాప్ స్కూటీలు ఏమున్నాయో చూద్దాం..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

నగరాల్లోనే కాదు.. పల్లెటూర్లలోనూ స్కూటీల వాడకం పెరుగుతుంది. ఇవి స్టైలిష్ లుక్‌తోనే కాదు.. ధరతోనూ జనాలను ఆకట్టుకుంటున్నాయి. మిడిల్ క్లాస్ బడ్జెట్‌కు సరిపోయేలా ఉంటున్నాయి. డైలీ వాడకం కోసం స్కూటీల కోసం చూస్తుంటే.. మార్కెట్‌లో మంచి స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్‌లు రూ.80,000 వరకు ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఆ స్కూటర్లు ఏంటో చూద్దాం..

హోండా యాక్టివా 6జీ కనిష్ట ధర రూ.79,624గా ఉంది. గరిష్ట ధర రూ.84,624(ఎక్స్-షోరూమ్)తో అమ్ముతున్నారు. ఇది 7.79 పీఎస్ హార్స్‌పవర్, 8.84 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 109 సీసీ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది 59.5 కేఎంపీఎల్ మైలేజీని కూడా అందిస్తుంది. యాక్టివా 6జీ స్కూటర్ ఏసీజీ స్టార్టర్, ఇంజిన్ కిల్ స్విచ్, ఇంటిగ్రేటెడ్ పాస్ స్విచ్, ఎల్ఈడీ హెడ్‌లైట్, సెమీ-డిజిటల్ క్లస్టర్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఇది స్టాండర్డ్ డీఎల్ఎక్స్, హెచ్ స్మార్ట్ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. సేఫ్టీ కోసం డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది.

సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ధర రూ.79,899 నుండి రూ.90,500 (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. 124 సీసీ పెట్రోల్ ఇంజన్, 45 కేఎంపీఎల్ మైలేజీని అందిస్తుంది. ఎల్ఈడీ హెడ్‌లైట్, సెమీ-డిజిటల్ ఇన్ఫర్మేషన్ ప్యానెల్‌తో సహా వివిధ ఫీచర్లను పొందుతుంది.

టీవీఎస్ జూపిటర్ 110 కూడా మంచి స్కూటర్. దీని కనిష్ట ధర రూ.77,400 కాగా గరిష్ట ధర రూ.90,150 ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇది 113 సీసీ పెట్రోల్ ఇంజన్, 47 కిలో మీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇంటెలిజెంట్ స్టార్ట్/స్టాప్‌తో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి.

హీరో ప్లెజర్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.72,163 నుండి రూ.83,918గా ఉంది. ఇది 50 కేఎంపీఎల్ మైలేజీని అందించే 110.9 సీసీ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంది. ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్, ఎల్‌సీడీ స్క్రీన్‌తో సహా వివిధ ఫీచర్లతో వస్తుంది.

యమహా ఫాసినో 125 రూ.79,150 నుండి రూ.94,530 ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 8.2 పీఎస్ హార్స్ పవర్, 10.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని విడుదల చేసే 125 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 68.75 కీలో మీటర్ల మైలేజీని అందిస్తుంది. పూర్తి ఎల్‌సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, హాలోజన్ హెడ్‌లైట్లు ఉన్నాయి. ఈ స్కూటర్ బరువు 99 కిలోలు, సేఫ్టీ కోసం డ్రమ్ అండ్ డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది.

Whats_app_banner