Hero Pleasure Plus Xtec Sports: హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్ టెక్ స్పోర్ట్స్ వేరియంట్ లాంచ్, ధర రూ.79,738
Hero Pleasure Plus Xtec Sports: హీరో ప్లెజర్ ఎక్స్ టెక్ స్పోర్ట్స్ మోడల్ ను హీరో మోటో కార్ప్ సంస్థ మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఈ మోడల్ ఎక్స్ టెక్ స్టాండర్డ్, ఎక్స్ టెక్ స్పోర్ట్స్ కనెక్టెడ్ వేరియంట్ల మధ్యలో ఉంటుంది. స్పోర్టీ డిజైన్ లో, వైబ్రంట్ కలర్స్ తో యువతకు నచ్చేలా ఈ మోడల్ ను తీర్చిదిద్దారు.
హీరో మోటోకార్ప్ ప్లెజర్ ప్లస్ స్కూటర్ కొత్త స్పోర్టియర్ వేరియంట్ ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. కొత్త హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్ టెక్ స్పోర్ట్స్ (Hero Pleasure Plus Xtec Sports) ధర రూ .79,738 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించారు.ఇది ఎక్స్ టెక్ స్టాండర్డ్, ఎక్స్ టెక్ కనెక్టెడ్ వేరియంట్ల మధ్య ఉంటుంది. ఈ కొత్త స్పోర్ట్స్ వేరియంట్ కొత్త పెయింట్ స్కీమ్, కొత్త బాడీ గ్రాఫిక్స్ తో వస్తుంది. ఇది ఇప్పటికే పాపులర్ అయిన హీరో ప్లెజర్ ప్లస్ మోడల్ కు రిఫ్రెషింగ్ లుక్ ను తీసుకువస్తుంది.
లేటెస్ట్ కలర్ స్కీమ్స్ తో..
కొత్త హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్ టెక్ స్పోర్ట్స్ ప్రత్యేకంగా విభిన్నమైన పెయింట్ స్కీమ్ ను పొందుతుంది. యువతను ఆకట్టుకునే వైబ్రంట్ కలర్స్ తో ఈ స్కూటర్ మార్కెట్లోకి వస్తోంది. ముఖ్యంగా అబ్రాక్స్ ఆరెంజ్ బ్లూ కలర్ ఆకర్షణీయంగా ఉంది. దీనికి ఫ్రంట్ ఆప్రాన్, ఫెండర్, సైడ్ ప్యానెల్స్ పై 18 స్టిక్కర్లు ఉండగా, చక్రాలకు ఆరెంజ్ పిన్ స్ట్రిప్స్ ఉన్నాయి. ఈ మోడల్ తో స్టాండర్డ్ మోడల్ కంటే అదనంగా బాడీ కలర్ గ్రాబ్ రైల్స్, రియర్ వ్యూ మిర్రర్లు కూడా పొందవచ్చు.
మెకానికల్ చేంజెస్ లేవు..
అయితే, హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్ టెక్ స్పోర్ట్స్ (Hero Pleasure Plus Xtec Sports) లో ఎలాంటి మెకానికల్ మార్పులు చేయలేదు. ఈ స్కూటర్ 110.9 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో వస్తుంది. ఇది 8 బీహెచ్పీ పవర్ ను, 8.7 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ సీవీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో ఉంటుంది. ప్లెజర్ ప్లస్ ఎక్స్ టెక్ స్పోర్ట్స్ బరువు 106 కిలోలు, ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 4.8 లీటర్లు.
హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్ టెక్ స్పోర్ట్స్ స్పెసిఫికేషన్స్
హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్ టెక్ స్పోర్ట్స్ (Hero Pleasure Plus Xtec Sports) లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక భాగంలో సింగిల్ షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. ఈ స్కూటర్ కు కాంబి బ్రేకింగ్ తో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ఎల్ సీడీ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ తో బ్లూటూత్ కనెక్టివిటీ, ప్రొజెక్టర్ ఎల్ ఈడీ హెడ్ ల్యాంప్ తదితర అడ్వాన్స్డ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ కొత్త స్పోర్ట్స్ వేరియంట్ ధర టాప్-ఎండ్ మోడల్ అయిన ఎక్స్ టెక్ కనెక్టెడ్ వేరియంట్ కంటే సుమారు రూ .3,000 చౌకగా లభిస్తుంది. హోండా యాక్టివా 6జీ, టివిఎస్ జూపిటర్ వంటి వాటికి ఈ స్కూటర్ గట్టి పోటీ ఇస్తుంది.