Bank holidays in January 2023 : జనవరిలో బ్యాంక్​లకు 11 రోజుల పాటు సెలవులు-bank holidays in january 2023 check full list and details here in telugu ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bank Holidays In January 2023 : జనవరిలో బ్యాంక్​లకు 11 రోజుల పాటు సెలవులు

Bank holidays in January 2023 : జనవరిలో బ్యాంక్​లకు 11 రోజుల పాటు సెలవులు

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 26, 2022 10:35 AM IST

Bank holidays in January 2023 : 2023 జనవరికి సంబంధించిన బ్యాంక్​ సెలవుల లిస్ట్​ బయటకొచ్చింది. వచ్చే నెలలో బ్యాంక్​లకు 11 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి.

జనవరిలో బ్యాంక్​ సెలవుల లిస్ట్​ ఇదే..
జనవరిలో బ్యాంక్​ సెలవుల లిస్ట్​ ఇదే..

List of Bank holidays in January 2023 : జనవరి​​ నెల మొదలవ్వడానికి ఇంకా కొన్ని రోజుల సమయం మత్రమే ఉంది. ఈ నేపథ్యంలో 2023 మొదటి​​ నెలకు సంబంధించిన బ్యాంక్​ సెలవుల లిస్ట్​ను ఆర్​బీఐ(రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా) ప్రకటించింది. వచ్చే నెలలో బ్యాంక్​ పనుల కోసం తిరిగేవాళ్లు.. ఈ లిస్ట్​ను కచ్చితంగా చూడాలి, గుర్తుపెట్టుకోవాలి. సెలవు లేని రోజు చూసుకుని బ్యాంక్​కు వెళ్లాల్సి ఉంటుంది.

yearly horoscope entry point

ఇక జనవరి నెలలో 11 రోజుల పాటు బ్యాంక్​ సెలవులు ఉండనున్నాయి. వీటిల్లో కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. ఆ వివరాలు..

2023 జనవరి బ్యాంక్​ సెలవులు..

January 2023 Bank holidays : జనవరి 2- సోమవారం, న్యూ ఇయర్​ వేడుకలు (ఐజ్వాల్​లోని బ్యాంక్​లకు సెలవు)

జనవరి 3- మంగళవారం, ఇమోను ఇరాప్ట (ఇంపాల్​లోని బ్యాంక్​లకు సెలవు)

జనవరి 4- బుధవారం, గాన్​- ఎన్​గై (ఇంపాల్​లోని బ్యాంక్​లకు సెలవు​)

జనవరి 26- గురువారం, రిపబ్లిక్​ డే (దేశవ్యాప్తంగా అన్ని బ్యాంక్​లకు సెలవు)

సాధారణ సెలవులు..

2023 Bank holidays list : జనవరి 1- ఆదివారం

జనవరి 8- ఆదివారం

జనవరి 14- రెండో శనివారం, భోగి

జనవరి 15- ఆదివారం సంక్రాంతి

జనవరి 22- ఆదివారం

జనవరి 28- నాలుగో శనివారం

పైన చెప్పిన తేదీల్లో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంక్​లకు సెలవులు ఉంటాయి.

ఈ ఏడాది ఆగస్టు నుంచి..

ఇక డిసెంబర్​​లో బ్యాంక్​లకు 14 రోజుల పాటు సెలవులు లభించాయి. నవంబర్​లో బ్యాంక్​లకు 10 రోజుల సెలవుల లభించింది. దేశంలో ఆగస్టులో మొదలైన పండుగ సీజన్​ అక్టోబర్​ నెలాఖరుతో ముగిసింది. ఫలితంగా ఆగస్టు, సెప్టెంబర్​, అక్టోబర్​లతో పోల్చుకుంటే.. నవంబర్​, డిసెంబర్​లో బ్యాంక్​ సెలవులు తగ్గాయి. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో అక్టోబర్​లో బ్యాంక్​లకు మొత్తం మీద 21 రోజుల పాటు సెలవులు లభించాయి. ఇక సెప్టెంబర్​లో బ్యాంక్​లు 13 రోజులు మూతపడ్డాయి. ఇక ఆగస్టులో కూడా బ్యాంక్​లకు 13 రోజుల పాటు సెలవులు లభించాయి.

బ్యాంక్​లకు సంబంధించిన సెలవులను ప్రతి నెల చివర్లో.. ఆర్​బీఐ విడుదల చేస్తుంది. వీటిని రెగ్యురల్​గా చెక్​ చేసుకుని కస్టమర్లు బ్యాంక్​లకు వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయన్ని విషయాన్ని మర్చిపోకూడదు.

Whats_app_banner

సంబంధిత కథనం