Apple WWDC 2024 : ఐఓఎస్ 18 వచ్చేస్తోంది.. కొత్త ఆపరేటింగ్ సిస్టెమ్ హైలైట్స్ ఇవే!
Apple WWDC 2024 live : ఐఓఎస్ 18పై కీలక అప్డేట్స్ ఇచ్చింది యాపిల్ సంస్థ. మెయిల్, మెసేజెస్, ఫోటోలు సహా మరెన్నో ఫీచర్స్ దీని సొంతం. పూర్తి వివరాల్లోకి వెళితే..
iOS 18 features : యాపిల్, ఐఫోన్ లవర్స్‌కి క్రేజీ న్యూస్! యాపిల్ ఐఓఎస్ 18 వచ్చేస్తోంది! ఈ మేరకు.. సోమవారం జరిగిన యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (యాపిల్ డబ్ల్యూడబ్ల్యూడీసీ) అత్యంత ఆసక్తిగా సాగింది. ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టెమ్ ఐఓఎస్ 18 గురించి అనేక కొత్త ప్రకటనలు ఈ ఈవెంట్ కనిపించాయి. రాబోయే ఐఓఎస్ 18 అప్డేట్లో ఐఓఎస్ యాప్స్‌లో మెసేజెస్, ఫోటోలు, మెయిల్, మ్యాప్స్ వంటి అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఇది రోజువారీ వినియోగాన్ని వేగంగా, సులభతరం చేస్తుంది. డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్లో యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఐఓఎస్ 18తో మీ ఐఫోన్ అనుభవాలు ఎలా మారుతాయో తెలుసుకోండి..
ఐఫోన్లకు వస్తున్న ఐఓఎస్ 18 ఫీచర్లు..
హోమ్ స్క్రీన్ కస్టమైజేషన్: వినియోగదారులు తమకు కావాల్సిన చోట యాప్ ఐకాన్ల స్థానాన్ని మార్చుకునేలా యాపిల్ హోమ్ స్క్రీన్కు పలు కస్టమైజెబుల్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా యూజర్లు తమ వాల్ పేపర్ లేదా కలర్ కాంట్రాస్ట్కు సరిపోయేలా యాప్ ఐకాన్ కలర్‌ను కూడా మార్చుకోవచ్చు.
iOS 18 release date in India : కంట్రోల్ సెంటర్ కస్టమైజేషన్: ఐఓఎస్ 18తో ఐఫోన్ యూజర్లు తమ సౌలభ్యం, వినియోగం ఆధారంగా కొత్త కంట్రోల్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. అదనంగా, వినియోగదారులు మల్టిపుల్ పేజీలను కంట్రోల్ చేసేందుకు స్వైప్ ఫీచర్ వస్తోంది.
ప్రైవసీ ఫీచర్లు: యాపిల్ యాప్ లాక్ వంటి అధునాతన ప్రైవసీ కంట్రోల్స్‌ని ప్రవేశపెట్టింది సంస్థ. ఇది యూజర్ ఫేస్ ఐడి లేదా పాస్వర్డ్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయగలదు. ఇప్పుడు, వినియోగదారులు తమ సున్నితమైన యాప్స్ హైడ్ చేయవచ్చు లేదా వారి యాప్స్, ఇతర బ్లూటూత్-కనెక్టెడ్ పరికరాలకు సమాచార యాక్సెస్‌ని కంట్రోల్ నిర్వహించవచ్చు.
మెసేజెస్ యాప్: వినియోగదారులకు ఇంటరాక్టివ్ అనుభవాన్ని అందించడానికి మెసేజెస్ యాప్ అనేక కొత్త ఫీచర్లను అందుకుంది. ఈ యాప్‌లో ఇప్పుడు 'ట్యాప్ బ్యాక్' ఫీచర్ ఉంది. దీనిలో వినియోగదారులు నిర్దిష్ట టెక్స్ట్ సందేశాలకు ప్రతిస్పందించవచ్చు. సందేశాలను షెడ్యూల్ చేయవచ్చు. టెక్స్ట్ ఫార్మాటింగ్ చేయవచ్చు. టెక్స్ట్ ఎఫెక్ట్ లను జోడించవచ్చు. చివరగా శాటిలైట్ కనెక్షన్ ద్వారా సందేశాలను పంపవచ్చు. ఇది యాపిల్ ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఫీచర్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది.
Apple WWDC 2024 iOS 18 : మెయిల్ యాప్: ఐఓఎస్ 18తో, మెయిల్ యాప్ మరింత వ్యవస్థీకృతమైంది. ప్రైమరీ ఈ-మెయిల్స్ వంటి కొత్త విభాగాలతో వర్గీకరించడం జరిగింది. లావాదేవీ సంబంధిత ఈ-మెయిల్స్, ప్రమోషన్లు, సోషల్/న్యూస్ అప్డేట్ ఈ-మెయిల్స్ మరెన్నో హైలైట్స ఉన్నాయి.
ఫోటోస్ అప్లికేషన్: వినియోగదారులు తమ ఫోటోలు, వీడియోలను సమర్థవంతంగా మేనేజ్ చేసేందుకు వీలు కల్పించే ఫోటోస్ అప్లికేషన్‌పై యాపిల్ ఫోకస్ చేసింది. కొత్త ఇంటర్ఫేస్ యాప్ నుంచి ఒక నిర్దిష్ట ఫోటోను కనుగొనే ఇబ్బందిని తగ్గిస్తుంది. ఇష్టమైన వాటిని ప్రత్యేక ప్రదేశంలో ఉంచడానికి యూజర్లు ఫోటోను కూడా పిన్ చేయవచ్చు.
iOS 18 release date and time : యాపిల్ వాలెట్: ఇప్పుడు, కొత్త ఎయిర్ డ్రాప్ ఫంక్షనాలిటీ మాదిరిగా పనిచేసే కొత్త ట్యాప్-టు-క్యాష్ ఫీచర్‌తో యూజర్‌కు డబ్బు పంపడం సులభం అవుతుంది.
సంబంధిత కథనం