Macbook Air : 15- ఇంచ్ మాక్‌బుక్.. లాంచ్‌కు సిద్ధం! విశేషాలివే..
New MacBook Air : సరికొత్త మాక్‌బుక్ ఎయిర్ త్వరలోనే లాంచ్ అవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇందులో 15- ఇంచ్ స్క్రీన్ ఉంటుందని సమాచారం. పూర్తి వివరాలు..
New MacBook Air : జూన్ 5న ప్రారంభంకానున్న 2023 డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్లో కొత్త డివైజ్‌లను లాంచ్ చేసేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటోంది దిగ్గజ టెక్ సంస్థ యాపిల్. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వార్త బయటకొచ్చింది. ఎం2 తరహా చిప్‌తో కూడిన 15 ఇంచ్ మాక్‌బుక్‌ను యాపిల్ సిద్ధం చేస్తున్నట్టు.. ఇది డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్ లాంచ్ అవ్వనున్నట్టు సమాచారం. ఈ మాక్‌బుక్ ఎయిర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నట్టు తెలుస్తోంది.
15-ఇంచ్ మాక్‌బుక్ ఎయిర్..
సరికొత్త మాక్‌బుక్ ఎయిర్‌లో అల్యుమీనియం ఛాసిస్, బ్యాక్లిట్ కీబోర్డ్, ఫోర్స్ టచ్ ట్రాక్‌ప్యాడ్, టచ్ ఐడీతో కూడిన మ్యాజిక్ కీబోర్డ్ ఉండే అవకాశం ఉంది. పాత మోడల్లోనూ ఇవి ఉన్నాయి. అయితే.. ఇందులో 15.3 ఇంచ్ లిక్విడ్ రెటీనా స్క్రీన్ విత్ ట్రూ టోన్ టెక్నాలజీ లభించొచ్చు. పాత మోడల్లో 13.6 ఇంచ్ డిస్ప్లే ఉంది.
15 inch MacBook Air launch : 14 ఇంచ్ మాక్‌బుక్ ప్రోలో ఉన్నట్టుగానే ఈ కొత్త మాక్‌బుక్ ఎయిర్లోనూ 1964X3024 పిక్సెల్స్ రిసొల్యూషన్ ఉండే అవకాశం ఉంది. కానీ షార్ప్‌నెస్ తక్కువగా ఉండొచ్చు.
ఇదీ చదవండి :- Tim Cook - Apple Store: ముంబైలో అడుగుపెట్టిన యాపిల్ సీఈవో.. పావ్‍బాజీ టేస్ట్ చేసిన కుక్.. యాపిల్ తొలి స్టోర్ రెడీ
15-ఇంచ్ మాక్‌బుక్ ఎయిర్.. కాన్ఫిగరేషన్..
15 ఇంచ్ మాక్‌బుక్ ఎయిర్‌లో 8 కోర్ సీపీయూ, 10 కోర్ జీపీయూ ఉండొచ్చు. ఎం2 చీప్‌కు తగ్గట్టుగానే ఇవి ఉన్నాయి. ఇక ఈ ల్యాప్‌టాప్‌లో 8జీబీ బేస్ కాన్ఫిగరేషన్ ఉండనుంది. మాక్ఓఎస్14పై ఇది పనిచేసే సూచనలు కనిపిస్తున్నాయి. డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్లోనే ఇది కూడా లాంచ్కానుంది!
New MacBook Air launch date : ఈ కొత్త మాక్‌బుక్ రిలీజ్ డేట్ వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే సంబంధిత ఈవెంట్లో లాంచ్ అవుతుందని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. దీనిపై యాపిల్ స్పష్టతనివ్వాల్సి ఉంది.
ఐఫోన్ 14 ప్రోకు యాపిల్ గుడ్ బై..?
Apple iPhone 15 launch date : ఈ ఏడాది రెండో భాగంలో యాపిల్ ఐఫోన్ 15 లాంచ్కానుంది. కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌పై ఐఫోన్ ప్రియుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ మోడల్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇప్పుడు.. తాజాగా ఓ వార్త బయటకొచ్చింది. ఐఫోన్ 15 లాంచ్‌తో కొన్ని మోడల్స్‌ను డిస్కంటిన్యూ చేయాలని యాపిల్ సంస్థ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీటిల్లో.. గతేడాది లాంచ్ అయిన ఐఫోన్ 14 ప్రో కూడా ఉంటుందని సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం