iPhone 15 : ఐఫోన్ 14 ప్రోకు గుడ్ బై చెప్పనున్న యాపిల్! కారణం ఇదేనా?
iPhone 15 launch : ఐఫోన్ 14 ప్రోకు యాపిల్ సంస్థ గుడ్ బై చెప్పనుందా? ఐఫోన్15 లాంచ్ తర్వాత ఈ మోడల్ డిస్కంటిన్యూ కానుందా?
Apple iPhone 15 launch : ఈ ఏడాది రెండో భాగంలో యాపిల్ ఐఫోన్ 15 లాంచ్కానుంది. కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌పై ఐఫోన్ ప్రియుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ మోడల్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇప్పుడు.. తాజాగా ఓ వార్త బయటకొచ్చింది. ఐఫోన్ 15 లాంచ్‌తో కొన్ని మోడల్స్‌ను డిస్కంటిన్యూ చేయాలని యాపిల్ సంస్థ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీటిల్లో.. గతేడాది లాంచ్ అయిన ఐఫోన్ 14 ప్రో కూడా ఉంటుందని సమాచారం.
ఐఫోన్ 14 ప్రో.. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌కు గుడ్ బై..!
కొత్త లాంచ్‌లు చేస్తూనే.. పాత సిరీస్‌లకు గుడ్ బై చెప్పడం యాపిల్ సంస్థకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. ఈ క్రమంలో ఐఫోన్ 15 లాంచ్ తర్వాత ఐఫోన్ 12 డిస్కంటిన్యూ అవుతుందని ఇప్పటికే మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే.. ఇటీవలే బయటకొచ్చిన ఓ రిపోర్టు ప్రకారం.. ఐఫోన్ 12తో పాటు ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ కూడా డిస్కంటిన్యూ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
iPhone 14 pro discontinue : టామ్స్ గైడ్ రిపోర్టు ప్రకారం.. యాపిల్ ఐఫోన్ 12ను ఐఫోన్ 13 రిప్లేస్ చేస్తుంది. ఇక కొత్త మోడల్స్ లాంచైన తర్వాత, అంతకుముందు ఏడాది లాంచ్ అయిన ప్రో మోడల్స్‌ను పక్కనపెట్టడం యాపిల్ సంస్థకు ఉన్న అలవాటు. ఇదే జరిగితే.. ఈసారి ఐఫోన్ 15 సిరీస్ లాంచ్‌తో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లను యాపిల్ సంస్థ డిస్కంటిన్యూ చేస్తుంది! ఐఫోన్ 12తో పాటు ఐఫోన్ 13 మినీని కూడా యాపిల్ సంస్థ పక్కనపెట్టేసే అవకాశం ఉందని రిపోర్టు చెబుతోంది.
అయితే యాపిల్ ఐఫోన్ 14 మార్కెట్లో కొనసాగొచ్చు. ఐఫోన్ 15 లాంచ్‌తో దీని ధర కూడా భారీగానే తగొచ్చు. ప్రతియేటా ఇదే జరుగుతుంది కూడా! ఐఫోన్ 14 ప్లస్ పరిస్థితే ఇంకా తెలియడం లేదు. ఈ మోడల్ని కంటిన్యూ చేయాలా? వద్దా? అని సంస్థ ఇంకా నిర్ణయం తీసుకున్నట్టు లేదు. పైగా.. ఇది యాపిల్‌కు మొదటి ప్లస్ మోడల్. ఫలితంగా ఈ మోడల్‌ను ఇంత తొందరగా డిస్కంటిన్యూ చేయదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఐఫోన్ 15లో నాలుగు మోడల్స్..?
iphone 15 launch date : మరోవైపు ఐఫోన్ 15 సిరీస్‌లో ఐఫోన్ 15తో పాటు ఐఫోన్15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లు ఉంటాయని తెలుస్తోంది. మొదటి రెండింట్లో ఏ16 బయోనిక్ చిప్సెట్.. చివరి రెండింట్లో ఏ17 ప్రాసెసర్ ఉంటుందని తెలుస్తోంది.
సంబంధిత కథనం