Apple iPhone 15 Pro first look: ఐఫోన్ 15 ప్రో ఎలా ఉండనుందంటే!-apple iphone 15 pro first look renders leaked ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Apple Iphone 15 Pro First Look: ఐఫోన్ 15 ప్రో ఎలా ఉండనుందంటే!

Apple iPhone 15 Pro first look: ఐఫోన్ 15 ప్రో ఎలా ఉండనుందంటే!

Apr 10, 2023, 02:49 PM IST Chatakonda Krishna Prakash
Apr 10, 2023, 02:49 PM , IST

  • Apple iPhone 15 Pro first look: యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ మరికొన్ని నెలల్లో లాంచ్ కానుంది. ఈ నేపథ్యంలో చాలా లీక్స్, ఫొటోలు బయటికి వస్తున్నారు. ఈ క్రమంలోనే ఐఫోన్ 15 ప్రోకు చెందిన క్యాడ్ (CAD) రెండర్ ఫొటోలను 9టు5మ్యాక్ (9to5Mac) షేర్ చేసింది. ఐఫోన్ 15 ప్రో ఫస్ట్ లుక్ ఇదేనంటూ రివీల్ చేసింది. 

యాపిల్ ఐఫోన్ 15 ప్రో టైటానియమ్ ఫ్రేమ్, రౌండెడ్ కార్నర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 

(1 / 9)

సరికొత్తగా డీప్ రెడ్ కలర్ వేరియంట్‍లోనూ ఐఫోన్ 15 ప్రో అందుబాటులోకి వస్తుందని 9to5Mac రిపోర్టు పేర్కొంది. 

(2 / 9)

డీప్ పర్పుల్ కలర్‌ను ఈ డీప్ రెడ్ కలర్ భర్తీ చేస్తుందని తెలుస్తోంది. స్పేస్ బ్లాక్, గోల్డ్, వైట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. 

(3 / 9)

ఐఫోన్ 15 ప్రో కెమెరా సైజ్‍ను యాపిల్ పెంచినట్టు ఈ రెండర్స్ ద్వారా తెలుస్తోంది.

(4 / 9)

లీకైన క్యాడ్ ఇమేజ్‍లను బట్టి చూస్తే, ఐఫోన్ 15 ప్రో కెమెరా సెటప్‍ లెన్స్ బంప్ చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. 

(5 / 9)

ఐఫోన్ 15 ప్రో డిస్‍ప్లే చుట్టూ అంచులు, నాచ్ సైజ్ తక్కువగా ఉండనుందని 9to5Mac రిపోర్టు వెల్లడించింది.

(6 / 9)

ఐఫోన్ 15 ప్రో డిస్‍ప్లే చుట్టూ అంచులు, నాచ్ సైజ్ తక్కువగా ఉండనుందని 9to5Mac రిపోర్టు వెల్లడించింది.(9to5Mac)

ఐఫోన్ 14 ప్రో కంటే తదుపరి రానున్న ఐఫోన్ 15 ప్రో సైజ్ తక్కువగా ఉంటుందని లీకైన ఫొటోల ద్వారా తెలుస్తోంది.

(7 / 9)

లైట్నింగ్ పోర్టుతో కాకుండా యూఎస్‍బీ టైప్-సీ పోర్టుతో ఐఫోన్ 15 ప్రో వస్తుందని ఈ లీకుల ద్వారా వెల్లడైంది. ఇదే జరిగితే ఐఫోన్‍లలో ఇది భారీ మార్పుగా ఉండనుంది. 

(8 / 9)

ప్రస్తుత పవర్, వాల్యూమ్ బటన్‍లను హ్యాప్టిక్ మ్యూట్, వాల్యూమ్‍ బటన్‍లతో యాపిల్ భర్తీ చేస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. 

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు