Amazon Sale 2024: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో ఈ స్మార్ట్ ఫోన్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్స్-amazon great freedom festival sale 2024 samsung oneplus and other feature loaded smartphones to buy under rs 20000 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Sale 2024: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో ఈ స్మార్ట్ ఫోన్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్స్

Amazon Sale 2024: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో ఈ స్మార్ట్ ఫోన్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్స్

HT Telugu Desk HT Telugu
Aug 06, 2024 03:31 PM IST

Amazon Great Freedom Festival Sale 2024: ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్ లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024 ప్రారంభమైంది. ఈ సేల్ లో బెస్ట్ డీల్స్ తో రూ.20,000 లోపు ధరలో లభించే స్మార్ట్ ఫోన్లపై ఓ లుక్కేయండి.

అమెజాన్ సేల్ లో ఈ స్మార్ట్ ఫోన్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్
అమెజాన్ సేల్ లో ఈ స్మార్ట్ ఫోన్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్

Amazon Great Freedom Festival Sale 2024: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. ఇప్పుడు ఈ సేల్ లో ప్రైమ్ సభ్యులే కాకుండా, అంతా డిస్కౌంట్ ఆఫర్స్ తో పాటు ఇతర ప్రయోజనాలు పొందవచ్చు. రూ.20,000 లోపు ధర కలిగిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్లపై స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఈ సెగ్మెంట్ లో ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ ఫోన్ మోడల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. అమెజాన్ సేల్ లో రూ.20,000 లోపు మంచి ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే, అమెజాన్ (Amazon) లో డిస్కౌంట్ లో లభించే ఈ కింది షార్ట్ లిస్ట్ చేసిన స్మార్ట్ ఫోన్స్ ను పరిశీలించండి.

శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ

శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ (Samsung Galaxy M35 5G) లో 1080×2340 పిక్సెల్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.6 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ ప్లే ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇందులో 25వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఎక్సినోస్ 1380 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ చిప్ సెట్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో జత చేయబడింది. డే బ్రేక్ బ్లూ, థండర్ గ్రే, మూన్ లైట్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఫ్లాట్ 18 శాతం డిస్కౌంట్తో రూ.19,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది.

వన్ ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ 5జీ

వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ప్లే ఉంది. వెనకవైపు 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్ వై టీ 600 ప్రైమరీ కెమెరాను అందించారు. 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, వీవోసీ 80వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. ఇది ఆక్సిజన్ ఓఎస్ తో పనిచేస్తుంది. ఇందులో 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుంది. ఇది మెగా బ్లూ, సూపర్ సిల్వర్, అల్ట్రా ఆరెంజ్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. 5% డిస్కౌంట్ తో అమెజాన్ సేల్ లో రూ.19,999 లకు OnePlus Nord CE4 Lite 5G లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించి ధరను మరింత తగ్గించుకోవచ్చు.

రియల్ మి నార్జో 70 ప్రో 5జీ

రియల్ మి నార్జో 70 ప్రో 5జీ లో 2412×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 890 నైట్ విజన్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 67వాట్ ఫ్లాష్ చార్జ్ సపోర్ట్తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో వస్తోంది. గ్రీన్, గోల్డ్ రంగుల్లో లభించే ఈ Realme NARZO 70 Pro 5G ఫోన్ 30 శాతం డిస్కౌంట్ అనంతరం రూ.18,999లకు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించి ధరను మరింత తగ్గించుకోవచ్చు.

ఒప్పో ఏ3 ప్రో 5జీ

ఒప్పో ఏ3 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్లో 6.67 అంగుళాల డిస్ప్లే ఉంది. దీనికి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 45వాట్ సూపర్ వూక్ ఛార్జింగ్ తో 5100 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో కూడిన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ OPPO A3 Pro 5G ఫోన్ పనిచేయనుంది. 13 శాతం డిస్కౌంట్ అనంతరం రూ.19,999లకు లభిస్తుంది.

రెడ్ మీ నోట్ 13 5జీ

రెడ్ మీ నోట్ 13 5జీ స్మార్ట్ ఫోన్ లో , 1080×2400 పిక్సెల్స్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో 6.67 అంగుళాల డిస్ ప్లే ఉంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో 108 మెగాపిక్సెల్ 3ఎక్స్ సెన్సార్ జూమ్ ఏఐ ట్రిపుల్ కెమెరాను ఇది కలిగి ఉంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఇందులో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. ఆర్కిటిక్ వైట్, క్రోమాటిక్ పర్పుల్, స్టెల్త్ బ్లాక్, ప్రిజం గోల్డ్ కలర్ వేరియంట్లలో లభించే ఈ Redmi Note 13 5G ఫోన్ 19% డిస్కౌంట్ అనంతరం రూ.16,999 లకు లభిస్తుంది.