వన్ ప్లస్‌ ఫోన్‌పై రూ.7000 డిస్కౌంట్.. మెుబైల్ కొనాలనుకునేవారికి బెటర్ ఆప్షన్-7000 rupees discount on oneplus 12 phone better option for those who want to buy a mobile know the specifications here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  వన్ ప్లస్‌ ఫోన్‌పై రూ.7000 డిస్కౌంట్.. మెుబైల్ కొనాలనుకునేవారికి బెటర్ ఆప్షన్

వన్ ప్లస్‌ ఫోన్‌పై రూ.7000 డిస్కౌంట్.. మెుబైల్ కొనాలనుకునేవారికి బెటర్ ఆప్షన్

Anand Sai HT Telugu
Jul 14, 2024 09:49 PM IST

OnePlus 12 Discount : వన్ ప్లస్‌ స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఈ ఫోన్లపై మంచి బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది. వన్ ప్లస్ ఫోన్ మీద కస్టమర్లు రూ.7,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్
వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్

వన్ ప్లస్‌ 12 స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్ మంచి ఆఫర్లను అందిస్తున్నాయి. మీకు ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు ఉంటే తక్కువ ధరకే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.7,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ సమయంలో వన్ ప్లస్‌ 12... 12 జీబీ ర్యామ్ వేరియంట్ అమెజాన్‌లో అసలు ధర రూ .64,999 కు విక్రయిస్తున్నారు. పైన పేర్కొన్న బ్యాంక్ ఆఫర్లతో వినియోగదారులు వన్ ప్లస్‌ ఫోన్‌ను రూ .57,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు.

yearly horoscope entry point

ఆఫర్ అక్కడితో ముగిసిపోలేదు. ఎక్స్చేంజ్ చేసుకోవడానికి పాత ఫోన్ ఉంటే ఫోన్ ధరను మరింత తగ్గించుకోవచ్చు. అమెజాన్ ఈ ఫోన్‌పై రూ.53,950 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందిస్తోంది. కానీ ఎక్స్ఛేంజ్ బోనస్ విలువ మీ పాత ఫోన్ కండిషన్, మోడల్, బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. మరి ఈ వన్ ప్లస్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం...

వన్ ప్లస్‌ 12లో 6.82 అంగుళాల క్యూహెచ్డీ+ 2కే ఓఎల్ఈడీ ఎల్టీపీఓ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. ఇది స్క్రీన్ మీద ఉన్న కంటెంట్ ఆధారంగా ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతుంది. స్క్రీన్ 4500 నిట్స్ పీక్ బ్ర్టైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో వస్తుంది. డాల్బీ విజన్, 10బిట్ కలర్ డెప్త్, ప్రోఎక్స్డీఆర్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. కంపెనీ వివిధ రంగుల్లో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఫ్లో ఎమరాల్డ్, గ్లేసియల్ వైట్, సిల్కీ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.

వన్ ప్లస్‌ 12 స్మార్ట్ ఫోన్‌లో క్వాల్కమ్ కొత్త స్నాప్డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంది. LPDDR5X ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఇందులో అందించారు. తమ కొత్త వన్ ప్లస్‌ 12 స్మార్ట్ ఫోన్ డ్యూయల్ క్రయో-వెలాసిటీ కూలింగ్ సిస్టమ్ ఉందని, ఇది మెరుగైన గేమింగ్ అనుభవం కోసం ఉంటుందని కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 14.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఇందులో ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ కెమెరా వ్యవస్థ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 64 మెగాపిక్సెల్ ఓవీ64బీ సెన్సార్, 3ఎక్స్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా ఉన్నాయి. కెమెరా సెటప్ వన్ ప్లస్ ఓపెన్ స్మార్ట్ ఫోన్ పోలి ఉంటుంది. సెల్ఫీల కోసం ఈ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 615 కెమెరా సెన్సార్ ఉంది. 100వాట్ సూపర్ వూక్ వైర్డ్, 50వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5400 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

Whats_app_banner