Replacing smart phone: మీ స్మార్ట్ ఫోన్ ను ఎప్పుడు రీప్లేస్ చేయాలంటే?.. మీ ఫోన్ ఇచ్చే సిగ్నల్స్ ఇవే..
Replacing phone: మీరు స్మార్ట్ ఫోన్ ను కొని చాలా సంవత్సరాలు అయిందా? మీ ఫోన్ చాలా స్లో అయిందా? యాప్స్ ఓపెన్ కావడం లేదా? ఫోన్ ల్యాగ్ అవుతోందా? మీ స్మార్ట్ ఫోన్ బాగా వేడెక్కుతోందా? బ్యాటరీ తొందరగా అయిపోతోందా?.. అయితే, మీ ఫోన్ ను మార్చాల్సిన సమయం వచ్చిందన్న మాటే..
Replacing phone: టెక్నాలజీ వేగంగా ముందుకు సాగుతోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్స్ (smart phone) మార్కెట్లోకి వస్తున్నాయి. కొత్త ఫోన్ కొనాలని ఉన్నా.. ఏళ్ల క్రితం కొన్న స్మార్ట్ ఫోన్ బాగానే నడుస్తుంది కదా అన్న ఆలోచనలో ఉంటాం. అయితే, మీరు స్మార్ట్ ఫోన్ ను ఎప్పుడు రీప్లేస్ చేయాలో.. మీ ఫోనే చెబుతుంది. మీ ఫోన్ ఇచ్చే సంకేతాలను గుర్తించాలి అంతే..
మీ ఫోన్ ఇచ్చే సిగ్నల్స్ ఇవే..
1. స్లో పెర్ఫార్మెన్స్
మీ ఫోన్ (smart phone) స్లోగా మారుతున్నట్లయితే, అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన సమయం వచ్చిందని అర్థం. కొత్త అప్ డేట్స్ ను, కొత్త ఫీచర్స్ ను ఉపయోగించలేకపోతున్నట్లయితే, కొత్త ఫోన్ కు మారడం బెటర్. యాప్స్ ఓపెన్ చేయడం లేట్ అవుతున్నా, ఫోన్ ల్యాగ్ అవుతున్నా.. ఫోన్ ను మార్చాల్సిందే. అంతేకాదు, అదే పాత ఫోన్ (smart phone) వాడుతున్నట్లయితే, సెక్యూరిటీ పరంగా కూడా ఇబ్బందులు రావచ్చు.
2. బలహీనమైన బ్యాటరీ లైఫ్
స్మార్ట్ ఫోన్ (smart phone) లలో బ్యాటరీల జీవితకాలం తక్కువగానే ఉంటుంది. మీ స్మార్ట్ ఫోన్ లో బ్యాటరీ తొందరగా డ్రెయిన్ అవుతున్నా, ఫుల్ చార్జ్ కావడానికి ఎక్కువ సమయం పడుతున్నా.. మీ బ్యాటరీ లైఫ్ అయిపోయిందని అర్థం. అప్పుడు వీలైతే బ్యాటరీని మార్చడమో, లేక కొత్త ఫోన్ కు మారడమో చేయాల్సిందే.
3. తరచూ క్రాష్ లు మరియు ఫ్రీజ్ లు
మీ యాప్స్ (apps) తరచుగా క్రాష్ అవుతుంటే, లేదా మీ స్క్రీన్ తరచూ ఫ్రీజ్ అవుతూ ఉంటే, మీ ఫోన్ హార్డ్ వేర్ లేదా సాఫ్ట్ వేర్ లో ఏదైనా లోపం ఉండవచ్చు. పాత ఫోన్లు కొత్త యాప్స్ లేదా అప్డేట్లను మునుపటిలా హ్యాండిల్ చేయలేకపోవచ్చు.
4. కాలం చెల్లిన సాఫ్ట్ వేర్, అప్ డేట్స్
పాత మోడల్ స్మార్ట్ ఫోన్స్ కు సాఫ్ట్ వేర్ (software) అప్ డేట్స్ ఇవ్వడం నిలిపేస్తారు. దీనివల్ల మీ ఫోన్ సెక్యూరిటీ ప్రమాదంలో పడుతుంది. బ్యాంకింగ్ యాప్స్ ను వాడడంలో భద్రత సమస్య తలెత్తుతుందది. మీ ఫోన్ కు కొంతకాలంగా సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ రాకపోతే, కొత్త ఫోన్ కు మారడానికి సమయం వచ్చిందని అర్థం.
5. ఫిజికల్ డ్యామేజ్ మరియు అరుగుదల
స్క్రాచ్ లు మరియు పగుళ్లు మీ ఫోన్ (smart phone) ఎలా పనిచేస్తుందో ప్రభావితం చేయకపోవచ్చు, కానీ అవి కాలక్రమేణా పెరుగుతాయి. మీ ఫోన్ కు తీవ్రమైన డ్యామేజ్ ఉంటే, దాన్ని సరిచేయడం కంటే కొత్తది పొందడం చౌక కావచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, మీ పాత ఫోన్ కు గుడ్ బై చెప్పి, కొత్త ఫోన్ కు హాయ్ చెప్పే సమయం వచ్చిందని తెలిపే ఈ సంకేతాలను గమనించండి.