Suzuki Ertiga Cruise Hybrid : సుజుకీ ఎర్టిగా క్రూజ్​ హైబ్రీడ్​.. ఇదిగో!-2024 suzuki ertiga cruise hybrid launched in indonesia with new mild hybrid tech ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Suzuki Ertiga Cruise Hybrid : సుజుకీ ఎర్టిగా క్రూజ్​ హైబ్రీడ్​.. ఇదిగో!

Suzuki Ertiga Cruise Hybrid : సుజుకీ ఎర్టిగా క్రూజ్​ హైబ్రీడ్​.. ఇదిగో!

Sharath Chitturi HT Telugu
Feb 20, 2024 01:45 PM IST

Suzuki Ertiga Cruise Hybrid price : ఇండోనేషియాలో జరిగిన ఓ ఈవెంట్​లో.. ఎర్టిగా క్రూజ్​ హైబ్రీడ్​ని రివీల్​ చేసింది సుజుకీ సంస్థ. కొత్త వెహికిల్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సుజుకీ ఎర్టిగా క్రూజ్​ హైబ్రీడ్​.. ఇదిగో!
సుజుకీ ఎర్టిగా క్రూజ్​ హైబ్రీడ్​.. ఇదిగో!

2024 Suzuki Ertiga Cruise Hybrid : 2024 ఇండోనేషియా ఇంటర్నేషనల్​ మోటార్​ షో వేదికగా.. ఎర్టిగా క్రూజ్​ హైబ్రీడ్​ని రివీల్​ చేసింది సుజుకీ. ఇండోనేషియాలో ఇప్పటికే అందుబాటులో ఉన్న స్టాండర్డ్​ ఎర్టిగా సరసన.. ఈ కొత్త వెహికిల్​ని కూడా విక్రయిస్తుంది సుజుకీ. ఈ నేపథ్యంలో.. ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

సుజుకీ ఎర్టిగా క్రూజ్​ హైబ్రీడ్​ విశేషాలు..

2024 ఎర్టిగా క్రూజ్​ హైబ్రీడ్​లో స్టైలిష్​ ఫ్రెంట్​- రేర్​ బంపర్, సైడ్​ బాడీ డికాలస్​, షార్ట్​ యాంటీనా, 15 ఇంచ్​ డ్యూయెల్​ టోన్​ అలాయ్​ వీల్స్​ వంటివి వస్తున్నాయి. ఎక్స్​టీరియర్​కి డ్యూయెల్​ టోన్​ పెయింట్​ స్కీమ్​ లభిస్తోంది. బ్లాక్​ రూఫ్​, రూఫ్​ రెయిల్​, ఫ్రెంట్​- రేర్​ బంపర్​ స్కర్టింగ్స్​, ప్రాజెక్టర్​ హెడ్​ల్యాంప్స్​, బంపర్​ మౌంటెడ్​ ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​ వంటివి ఇందులో ఉన్నాయి.

రెండు కొత్త కలర్స్​లో ఈ వెహికిల్​ అందుబాటులో ఉంటుంది. అవి.. కూల్​ బ్లాక్​, పర్ల్​ వైట్​ వింత్​ కూల్​ బ్లాక్​.

ఎర్టిగా క్రూజ్​ హైబ్రీడ్​ ఎంపీవీలో 1.5 లీటర్​ కే15బీ స్మార్ట్​ హైబ్రీడ్​ ఇంజిన్​ ఉంటుంది. ఇక ఈ ఇంజిన్​.. 101.5 హెచ్​పీ పవర్​ని, 138 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. 10ఏ బ్యాటరీ ప్యాక్​ దీనికి కనెక్ట్​ చేసి ఉంటుంది. ఫ్యూయెల్​ ఎఫీషియెన్సీ పెరుగుతుందని సంస్థ చెప్పింది. ఇప్పటికే.. ఈ ఎంపీవీ.. 20 కేఎంపీఎల్​ మైలేజ్​ ఇస్తోంది.

Suzuki Ertiga Cruise Hybrid : ఎర్టిగా క్రూజ్​ హైబ్రీడ్​ ఇంటీరియర్​లో సెమీ డ్యూయెల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, వెంటిలేటెడ్​ కప్​హోల్డర్స్​, ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, 8.0 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ వంటివి వస్తున్నాయి.

డ్యూయెల్​ ఫ్రెంట్​ ఎయిర్​బ్యాగ్స్​, ఏబీఎస్​ విత్​ ఈబీడీ, ఈఎస్​పీ, ఐఎస్​ఓఎఫ్​ఐఎక్స్​ యాంకర్​ సీట్స్​, క్రూజ్​ కంట్రోల్​, హిల్​ హోల్డ్​ కంట్రోల్​, రివర్స్​ కెమెరా విత్​ పార్కింగ్​ సెన్సార్స్​ వంటివి ఈ సుజుకీ వెహికిల్​లో సేఫ్టీ ఫీచర్స్​గా ఉన్నాయి.

సుజుకీ ఎర్టిగా క్రూజ్​ హైబ్రీడ్​- ధర ఎంతంటే..

Suzuki Ertiga Cruise Hybrid launch : సరికొత్త ఎర్టిగా క్రూజ్​ హైబ్రీడ్​ మేన్యువల్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర 288 మిలియన్​ ఐడీఆర్​గా ఉంది. ఇండియన్​ కరెన్సీలో అది సుమారు రూ. 15.3 లక్షలు. ఇక ఆటోమెటిక్​ వేరియంట్​ ధర 301 మిలియన్​ ఐడీఆర్​గా ఉంది. అంటే సుమారు రూ. 16 లక్షలు.

అంతేకాకుండా.. ఈ వెహికిల్​పై 8 ఏళ్లు లేద 1,60,000 కి.మీల బ్యాటరీ వారెంటీ కూడా ఇస్తోంది సుజుకీ.

Whats_app_banner

సంబంధిత కథనం