2024 Mahindra XUV400 Pro: 3 వేరియంట్లలో మహింద్ర 2024 ఎక్స్ యూ వీ 400 ప్రొ ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ; ధరల వివరాలు..
2024 Mahindra XUV400 Pro: మహింద్ర అండ్ మహింద్ర ఎక్స్ యూ వీ 400 ప్రొ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ ని భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ 2024 మోడల్ ఎక్స్ యూ వీ 400 ప్రొ ఎక్స్ షో రూమ్ ధర రూ. 15.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
2024 Mahindra XUV400 Pro: 2024 ఎక్స్ యూ వీ 400 ప్రో ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ ని బుధవారం మహింద్ర ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కార్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ .15.49 లక్షల నుంచి రూ .17.49 లక్షల వరకు ఉంటుంది.
2024 ఎక్స్ యూ వీ 400 ప్రో వివరాలు..
మహీంద్రా రిఫ్రెష్డ్ 2024 ఎక్స్ యూ వీ 400 ప్రో (2024 Mahindra XUV400 Pro) ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. మూడు వేరియంట్లలో లభించే ఈ ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ ఎక్స్-షోరూమ్ ధర రూ.15.49 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. ఈ ధర మే 31, 2024 వరకు చేసే డెలివరీలకు వర్తిస్తుంది. అలాగే, ఈ 2024 మోడల్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కోసం బుకింగ్స్ జనవరి 12వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. మహింద్ర డీలర్ షిప్ ల వద్ద రూ. 21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
వేరియంట్స్, ధరలు
2024 ఎక్స్ యూ వీ 400 ప్రో లో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 34.5 కిలోవాట్ల బ్యాటరీ, 3.3 కిలోవాట్ల ఏసీ ఛార్జర్ తో ఏసీ ప్రో మోడల్, 34.5 కిలోవాట్ల బ్యాటరీ, 7.2 కిలోవాట్ల ఎసి ఛార్జర్ తో ఇఎల్ ప్రో మోడల్, 39.4 కిలోవాట్ల బ్యాటరీ మరియు 7.2 కిలోవాట్ల ఎసి ఛార్జర్ తో ఇఎల్ ప్రో మోడల్. ఈ వేరియంట్లలో ఏసీ ప్రో మోడల్ ధర రూ .15.49 లక్షలు, ఇఎల్ ప్రో మోడల్ ధర రూ .16.74 లక్షలు, ఇఎల్ ప్రో (39.4 కిలోవాట్ల) మోడల్ ధర రూ .17.49 లక్షలుగా నిర్ణయించారు. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.
ఆకర్షణీయమైన ఇంటీరియర్
గతంలో వచ్చిన ఎక్స్ యూవీ 400 విషయంలో చాలామంది కారు ఇంటీరియర్ పై విమర్శలు చేశారు. కాలం చెల్లిన ఇంటీరియర్ ను వాడారని విమర్శించారు. దాంతో, లేటెస్ట్ ఎక్స్ యూ వీ 400 ప్రొ (2024 Mahindra XUV 400 Pro) లో బ్రాండ్ డాష్ బోర్డ్ ను ఆధునీకరించారు. కొత్త టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లను ప్రవేశపెట్టింది. ఇవి రెండూ కూడా 26.04 సెం.మీ పరిమాణంలో ఉన్నాయి. అదనంగా, మహీంద్రా తన అడ్రినోఎక్స్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీని ఈ ఎక్స్ యూ వీ 400 ప్రో లో చేర్చింది. ఇది 50 కి పైగా కనెక్టెడ్ ఫీచర్లను అందిస్తుంది.
అదనపు ఫీచర్స్
ఎక్స్ యూవీ 400 ప్రో మోడళ్లలో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఎసి వెంట్స్, వైర్లెస్ ఛార్జర్, మొబైల్ డివైజ్ ఛార్జింగ్ కోసం రియర్ యుఎస్బి పోర్ట్ తదితర అదనపు ఫీచర్స్ ఉన్నాయి. వైర్లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలతో ఇందులోని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పని చేస్తుంది. అదనంగా, అలెక్సా సపోర్ట్ కూడా ఉంది.
నెబ్యులా బ్లూ..
నెబ్యులా బ్లూ అనే కొత్త కలర్ వేరియంట్ ను ఈ ఎక్స్ యూ వీ 400 ప్రో మోడల్స్ లో ప్రవేశపెట్టారు, దీనితో పాటు షార్క్-ఫిన్ యాంటెనాను జోడించారు. లోపల, క్యాబిన్ లేత బూడిద మరియు నలుపు రంగులలో డ్యూయల్-టోన్ థీమ్ ను కలిగి ఉంది.
టాపిక్