2024 Kia Carnival: 12 స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్ తో పాటు మరిన్ని మార్పులతో 2024 కియా కార్నివాల్ లాంచ్
2024 కార్నివాల్ ను కియా లాంచ్ చేసింది. ఈ 2024 మోడల్ కియా కార్నివాల్ లో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే తో కూడిన 12.3-అంగుళాల టచ్ స్క్రీన్, మ్యాచింగ్ 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 12-స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్, 11-అంగుళాల హెడ్-అప్ డిస్ప్లే ఉన్నాయి.
కియా ఇండియా తన ఫ్లాగ్ షిప్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) మోడల్ కార్నివాల్ ను భారతదేశంలో విడుదల చేసింది. కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU) గా భారత మార్కెట్లోకి రానున్న 2024 కియా కార్నివాల్ లిమోసిన్ ప్లస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ .63.90 లక్షలు. కియా కార్నివాల్ కు మూడు సంవత్సరాల వారంటీతో పాటు మూడు సంవత్సరాల ఉచిత రోడ్ సైడ్ అసిస్టెన్స్, మూడు సంవత్సరాల ఉచిత మెయింటెనెన్స్ లభిస్తుంది.
మళ్లీ షో రూమ్ ల్లోకి..
కియా కార్నివాల్ 2020-2023 మధ్య కాలంలో 14,542 యూనిట్లకు పైగా అమ్మకాలు జరిగాయి. 2023లో వీటి సేల్స్ నిలిపివేశారు. ప్రస్తుత మోడల్ కోసం ఇప్పటివరకు 2,796 బుకింగ్స్ వచ్చాయని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త కార్నివాల్ లగ్జరీ ఎంపీవీతో పాటు, కంపెనీ కియా ఈవీ 9 ఎలక్ట్రిక్ ఎస్ యూవీని కూడా విడుదల చేసింది.
2024 కియా కార్నివాల్: ఎక్ట్సీరియర్
2024 కియా కార్నివాల్ లో చాలా మార్పులు చేశారు. దాని మునుపటి డిజైన్ నుండి బోల్డ్, ఎస్యూవీ స్టైల్ ను స్వీకరించింది. ముందు భాగంలో, విశాలమైన, మరింత డామినెంట్ గ్రిల్ ఈ మోడల్ లోనూ కొనసాగుతుంది. దాని చుట్టూ నిలువుగా అమర్చిన ఎల్ఈడి హెడ్ లైట్లు, ఎల్-ఆకారంలోని డే టైమ్ రన్నింగ్ లైట్లు (DRL) ఉంటాయి. కియా కార్నివాల్ కు కొత్త 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ను అమర్చారు.
ఎల్ఈడీ టెయిల్ లైట్లు
సైడ్ బాడీ క్లాడింగ్, వ్యాన్ లాంటి ప్రొఫైల్ కియా కార్నివాల్ కు మరింత డైనమిజంను తీసుకువచ్చింది. వెనుక భాగంలో, కియా సిగ్నేచర్ స్టైల్ లో కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు ఉంటాయి. ఇది కొంతవరకు కియా సెల్టోస్, సోనెట్ కొత్త మోడళ్లలో కనిపించే తాజా డిజైన్ ను గుర్తు చేస్తుంది. ఈ అప్ డేట్స్ తో కియా కార్నివాల్ ఎంపీవీ మరింత అప్పీలింగ్ గా కనిపిస్తుంది.
2024 కియా కార్నివాల్: ఇంటీరియర్
2024 కియా (kia) కార్నివాల్ లో మొత్తం సాంకేతిక. నాణ్యమైన మెటీరియల్స్ తో నిండిన ఆధునిక క్యాబిన్ ఉంటుంది. క్యాబిన్ బ్రౌన్ అండ్ బ్లాక్ థీమ్ తో, ఏడు సీట్ల లేఅవుట్ తో వస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే, 2024 కార్నివాల్ డ్యూయల్ పనోరమిక్ కర్వ్డ్ డిస్ప్లేలతో వస్తుంది. ఇందులో వైర్లెస్ ఆండ్రాయిడ్ (Android) ఆటో, ఆపిల్ కార్ప్లేతో కూడిన 12.3-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్, మ్యాచింగ్ 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 12-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, 11-అంగుళాల హెడ్-అప్ డిస్ప్లే ఉన్నాయి. మొదటి, రెండవ వరుసలలో పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ సీట్లు, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కారు ఫంక్షనాలిటీతో పాటు ఎలక్ట్రికల్ గా ఆపరేటెడ్ చేయగల స్లైడింగ్ డోర్లు ఉన్నాయి.
2024 కియా కార్నివాల్ సెక్యూరిటీ ఫీచర్స్
భద్రతా పరంగా, 2024 కియా కార్నివాల్ (2024 kia carnival) లో ఎనిమిది ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ముందు, వెనుక భాగాల్లో పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. 360 డిగ్రీల సరౌండ్ కెమెరా సిస్టమ్, లెవల్-2 ఏడీఏఎస్ సూట్, ఫార్వర్డ్ కొలిషన్ అవాయిడెన్స్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ తదితర 23 సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
2024 కియా కార్నివాల్ స్పెసిఫికేషన్లు
2024 కియా కార్నివాల్ లో 190 బిహెచ్ పి పవర్, 441ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 2.2-లీటర్ డీజల్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో జతచేయబడి ఫ్రంట్-వీల్ డ్రైవ్ సెటప్ పై పనిచేస్తుంది. ఇదే ఇంజిన్ అవుట్ గోయింగ్ మోడల్ లో కూడా కనిపించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భారతదేశంలో డీజిల్ ఇంజన్ ఆప్షన్ మాత్రమే లభిస్తుంది.