Electric scooter : మిడిల్ క్లాస్ వారికి ఎంతో ఇష్టమైన ఎలక్ట్రిక్ స్కూటర్- ఇప్పుడు సరికొత్తగా..
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వెర్షన్ లాంచ్‌కి రెడీ అవుతోంది. లాంచ్ డేట్‌తో పాటు ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌లో బజాజ్ చేతక్ ఒకటి. సేల్స్ పరంగా అతి తక్కువ సమయంలో ఈ ఈ-స్కూటర్ టాప్-3 స్థానంలో నిలిచింది. ఇక ఇప్పుడు బజాజ్ ఆటో.. చేతక్ నెక్ట్స్ జనరేషన్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. డిసెంబర్ 20, 2024 న కొత్త చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ని విడుదల చేసేందుకు బజాజ్ ఆటో, మీడియా ఆహ్వానాన్ని పంచుకుంది.
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్..
2020 లో బజాజ్ చేతక్ ఈవీ మొదటిసారి వచ్చినప్పటి నుంచి దృశ్యపరంగా చాలావరకు అదే విధంగా ఉంది. అయినప్పటికీ కంపెనీ ఈ సంవత్సరం ప్రారంభంలో కొత్త స్క్రీన్, ఎక్కువ కనెక్టివిటీ ఆప్షన్స్, మెరుగైన హార్డ్‌వేర్ కలిగి ఉన్న దాని ఫీచర్ల జాబితాకు విస్తృతమైన అప్‌గ్రేడ్స్ చేసింది. తదుపరి తరం వెర్షన్ ఈ పారామీటర్లలో ప్రతిదానిపై అప్డేట్స్ పొందుతుందని అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుత చేతక్ సుమారు 21 లీటర్ల అండర్-సీట్ స్టోరేజీని అందిస్తుంది. ఇది సెగ్మెంట్లోనే అతి తక్కువ! కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌పై సమాచారం లిమిటెడ్‌గా ఉన్నప్పటికీ, తదుపరి తరం బజాజ్ చేతక్‌ని కొత్తగా అభివృద్ధి చేసిన ఛాసిస్‌పై అమర్చాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది గణనీయమైన మెరుగుదలలను తీసుకువస్తుంది. పెద్ద అండర్-సీట్ స్టోరేజ్‌ను అందించే అవకాశం ఉంది. ఏథర్ రిజ్టా, టీవీఎస్ ఐక్యూబ్ తరహాలో ఈ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఫ్లోర్ బోర్డు కింద బ్యాటరీని పెట్టొచ్చు.
బ్యాటరీ ప్యాక్‌ని రీడిజైన్ చేసే అవకాశం కూడా ఉంది. ఇది అందుబాటులో ఉన్న ఆప్షన్లకు సమానమైన సామర్థ్యాన్ని ప్యాక్ చేసేటప్పుడు ఎక్కువ రేంజ్‌ని అందించగలదు. ప్రస్తుత బజాజ్ చేతక్ వేరియంట్‌ను బట్టి 123 కిలోమీటర్ల నుంచి 137 కిలోమీటర్ల వరకు రేంజ్‌ని ఇస్తోంది.
గుడ్ లుక్స్‌తో పాటు గుడ్ పర్ఫార్మెన్స్ ఇస్తోంది కాబట్టే, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి మంచి ఆదరణ లభిస్తోంది. కొత వెర్షన్లో కూడా ఇదే కొనసాగుతుందని అంచనాలు ఉన్నాయి. కొత్త తరం బజాజ్ చేతక్ ధరలు ప్రస్తుత మోడల్ కంటే స్వల్పంగా పెరగొచ్చు. ప్రస్తుతం ఈ-స్కూటర్ ధర రూ.96,000 నుంచి రూ.1.29 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది.
లాంచ్ సమయానికి ఈ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాటిని మేము మీకు అప్డేట్ చేస్తాను.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. ఆటోమొబైల్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి..
సంబంధిత కథనం