2023 Hero XPulse 200 4V: హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ బైక్‍కు అప్‍డేటెడ్ వెర్షన్ లాంచ్: ధర, స్పెసిఫికేషన్ల వివరాలు-2023 hero xpluse 200 4v launched in india price specifications features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2023 Hero Xpulse 200 4v: హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ బైక్‍కు అప్‍డేటెడ్ వెర్షన్ లాంచ్: ధర, స్పెసిఫికేషన్ల వివరాలు

2023 Hero XPulse 200 4V: హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ బైక్‍కు అప్‍డేటెడ్ వెర్షన్ లాంచ్: ధర, స్పెసిఫికేషన్ల వివరాలు

Chatakonda Krishna Prakash HT Telugu
May 17, 2023 02:28 PM IST

2023 Hero XPulse 200 4V: 2023 హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ బైక్ లాంచ్ అయింది. గత మోడల్‍తో పోలిస్తే కొన్ని అప్‍గ్రేడ్‍లతో వచ్చింది.

2023 Hero XPulse 200 4V: హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ బైక్‍కు అప్‍డేటెడ్ వెర్షన్ లాంచ్ (Photo: Hero)
2023 Hero XPulse 200 4V: హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ బైక్‍కు అప్‍డేటెడ్ వెర్షన్ లాంచ్ (Photo: Hero)

2023 Hero XPulse 200 4V: హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ బైక్‍కు అప్‍డేటెడ్ ఎడిషన్‍ను హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) తీసుకొచ్చింది. 2023 హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ బైక్ భారత మార్కెట్‍లో లాంచ్ అయింది. అలాగే ఈ లైనప్‍లో కొత్తగా ఎక్స్‌పల్స్ 200 4వీ ప్రో వేరియంట్ కూడా అడుగుపెట్టింది. గత మోడల్‍తో పోలిస్తే ఈ ఎక్స్‌పల్స్ 200 4వీ 2023 ఎడిషన్.. డిజైన్ సహా మరికొన్ని అప్‍గ్రేడ్‍లతో వచ్చింది. వివరాలివే.

2023 Hero XPulse 200 4V: ఇంజిన్

ఓబీడీ-2, ఈ20కు అనుకూలంగా ఉండేలా 2023 హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ ఇంజిన్ అప్‍డేట్ అయింది. 200cc ఫోర్ వాల్వ్ ఆయిల్ కూల్డ్ బీఎస్-6 ఇంజిన్‍ను ఈ బైక్ కలిగి ఉంది. OBD2, E20 కంపియంట్‍గా ఉంటుంది. 8,000 rpm వద్ద 19 hp పవర్, 6,500 rpm వద్ద 17.35 Nm టార్క్యూను ఈ ఇంజిన్ జనరేట్ చేస్తుంది.

2023 Hero XPulse 200 4V: డిజైన్ ఏం మారిందంటే..

కిందటి మోడల్‍తో పోలిస్తే ఈ 2023 ఎడిషన్ కొన్ని డిజైన్ మార్పులతో వచ్చింది. 2023 హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ బైక్‍కు 60mm పొడవైన ర్యాలీ స్టైల్ విండ్ షీల్డ్ ఉంటుంది. ఎల్ఈడీ డీఆర్ఎల్‍లతో సరికొత్త క్లాస్-డీ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‍ల్యాంప్ ఉంటుంది. రైడర్ ఫుట్ రెడ్ పొజిషన్ 35mm కిందికి ఉంటుంది.అలాగే ఈ బైక్‍కు యూఎస్‍బీ చార్జింగ్ పోర్టు కూడా ఉంది.

2023 Hero XPulse 200 4V: ఏబీఎస్ మోడ్స్

కొత్త ఎక్స్‌పల్స్ 200 4వీ 2023 ఎడిషన్ బైక్‍కు మూడు ఏబీఎస్ మోడ్‍లను హీరో మోటోకార్ప్ యాడ్ చేసింది. రోడ్, ఆఫ్-రోడ్, ర్యాలీ మోడ్స్ ఉంటాయి.

Hero XPulse 200 4V Pro: ప్రో వేరియంట్

2023 స్టాండర్డ్ వెర్షన్‍తో పోలిస్తే హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ ప్రో వేరియంట్ మరింత హార్డ్ కోర్ వెర్షన్‍గా ఉంది. 250mm ఫుల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సస్పెన్షన్, 220mm రేర్ స్పెన్షన్‍ను ఈ ప్రో బైక్ కలిగి ఉంది. సీట్ హైట్ 850mm, గ్రౌండ్ క్లియరెన్స్ 270mmగా ఉంటుంది. హ్యాండిల్ బార్ కాస్త ఎత్తుగా ఉంది. మిగిలిన విషయాల్లో 2023 స్టాండర్డ్ ఎక్స్‌పల్స్ 200 4వీ వెర్షన్‍నే ఈ ప్రో మోడల్ పోలి ఉంది.

2023 Hero XPulse 200 4V: ధరలు

2023 హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ బైక్ ధర రూ.1,43,516గా ఉంది. హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ ప్రో వేరియంట్ ధర రూ.1,50,891గా ఉంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు.

Whats_app_banner