2023 Hero Glamour : అప్డేటెడ్ ఫీచర్స్‌తో హీరో గ్లామర్ లాంచ్.. ధర ఎంతంటే!
2023 Hero Glamour launch : 2023 హీరో గ్లామర్ లాంచ్ అయ్యింది. సరికొత్త ఫీచర్స్‌తో ఈ మోడల్ అందుబాటులోకి వచ్చింది. ఆ వివరాలు..
2023 Hero Glamour launch : 2023 హీరో గ్లామర్‌ను తాజాగా లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హీరో మోటోకార్ప్. రెండు వేరియంట్లలో ఇది అందుబాటులో ఉండనుంది. అవి డ్రమ్, డిస్క్. ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
అప్డేటెడ్ గ్లామర్ ఎలా ఉంది..?
ఈ 2023 హీరో గ్లామర్‌లో 125 సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 10.68 బీహెచ్పీ పవర్‌ను, 10.6 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ బైక్‌కు హీరో ఐ3ఎస్ ఐడిల్ స్టాప్- స్టార్ట్ సిస్టెమ్ లభిస్తోంది. ఈ20 ఫ్యూయెల్పైనా ఇది నడుస్తుంది. ఈ మోడల్.. 63కేఎంపీఎల్ మైలేజ్ ఇస్తుందని సంస్థ చెబుతోంది.
హీరో గ్లామర్ అప్డేటెట్ వర్షెన్‌లో కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తోంది. ఇందులో రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, లో ఫ్యూయెల్ ఇండికేటర్ వంటివి కనిపిస్తాయి. వీటితో పాటు బైక్‌కు యూఎస్బీ ఛార్జర్ సైతం లభిస్తోంది.
2023 Hero Glamour features : ఇక ఈ 2 వీలర్ డైమెన్షన్స్ కూడా స్వల్పంగా మారాయి. రైడర్, పిలియన్ సీట్ల హైట్‌ను 8ఎంఎం, 17ఎంఎం మేర తగ్గించింది హీరో మోటోకార్ప్ సంస్థ.
"గ్లామర్‌కు ప్రత్యేక ఫ్యాన్‌బేస్ ఉంది. యువతలో ఈ మోడల్‌కు మంచి డిమాండ్ ఉంది. స్టైల్, కంఫర్ట్ కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది. ఇక కొత్త గ్లామర్ లాంచ్‌తో.. 125సీసీ సెగ్మెంట్లో పోటీ మరింత పెరుగుతుందని భావిస్తున్నాము. కొత్త అవతారంలో వస్తున్న హీరో గ్లామర్‌కు డిమాండ్ లభిస్తుందని ఆశిస్తున్నాము. మా 2 వీలర్ పోర్ట్‌ఫోలియో మరింత బలపడింది," అని హీరో మోటోకార్ప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రంజీవ్‌జిత్ సింగ్ తెలిపారు.
ఈ బైక్ ధర ఎంతంటే..
Hero Glamour on road price Hyderabad : 2023 హీరో గ్లామర్ డ్రమ్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 82,348గా ఉంది. ఇక డిస్క్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 86,348గా ఉంది. క్యాండీ బ్లేజింగ్ రెడ్, టెక్నో బ్లూ-బ్లాక్, స్పోర్ట్స్ రెడ్-బ్లాక్ వంటి కొత్త రంగుల్లో ఈ మోడల్ అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్.. టీవీఎస్ రైడర్ 125, బజాజ్ పల్సర్ 125, హోండా షైన్ వంటి మోడల్స్‌కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
హీరో కరిష్మా.. సరికొత్త అవతారంలో..!
కరిష్మా మోడల్‌తో హీరో మోటోకార్ప్ సంస్థ గతంలో పెద్ద హిట్ కొట్టింది. తక్కువ సమయంలోనే ఈ మోడల్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. చాలా కాలం తర్వాత సేల్స్‌లో డ్రాప్ కనిపించడంతో, ఈ మోడల్‌ను 2020లో డిస్కంటిన్యూ చేసింది హీరో సంస్థ. ఇక ఇప్పుడు ఈ బైక్‌ను మళ్లీ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. కరిష్మా ఎక్స్ఎంఆర్ 210 పేరుతో మార్కెట్లో ఈ నెల 29న ఈ బైక్ లాంచ్ అవుతుందని సమచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం