Train Accident Helpline No's : విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం, బాధితుల సమాచారం కోసం హెల్ప్ లైన్ నంబర్లు ఇవే!-vizianagaram passenger train accident railway department helpline number ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Train Accident Helpline No's : విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం, బాధితుల సమాచారం కోసం హెల్ప్ లైన్ నంబర్లు ఇవే!

Train Accident Helpline No's : విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం, బాధితుల సమాచారం కోసం హెల్ప్ లైన్ నంబర్లు ఇవే!

Bandaru Satyaprasad HT Telugu
Oct 29, 2023 10:05 PM IST

Train Accident Helpline No's : విజయనగరం జిల్లాలో రెండు ప్యాసింజర్ ట్రైన్స్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బాధితుల సహాయం, సమాచారం కోసం స్థానిక అధికారులు, రైల్వే సిబ్బంది హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు.

విజయనగరం రైలు ప్రమాదం
విజయనగరం రైలు ప్రమాదం

Train Accident Helpline No's :విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బాధితుల సమాచారం కోసం రైల్వే అధికారులు హెల్ప్‌ లైన్‌ నంబర్లు ఏర్పాటు చేశారు. 0891 2746330, 0891 2744619, 81060 53051, 81060 53052, 85000 41670, 85000 41677, 83003 83004, 85005 85006 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

yearly horoscope entry point

విజయనగరం చినరావుపల్లి వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటనలో బాధితుల సహాయం, సమాచారం కోసం విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. బాధితుల సహాయ సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయంలో 9493589157 హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశారు. రైల్వే హెల్ప్ లైన్ నంబర్ 8978080006 కు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి తెలిపారు.

  • భువనేశ్వర్ - 0674-2301625, 2301525, 2303069
  • వాల్తేరు డివిజన్ - 0891- 2885914
  • ఏలూరు-08812232267
  • సమల్కోట్-08842327010
  • రాజమండ్రి -08832420541
  • తుని- 08854-252172

హెల్ప్ లైన్ నంబర్లు
హెల్ప్ లైన్ నంబర్లు

రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైతుల ప్రమాద దుర్ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్‌ రైలుకు ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందని, ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్టుగా సమాచారం అందుతోందని సీఎంవో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లినుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, మంచి వైద్య అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటన సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు

రైలు ప్రమాదంపై లోకేశ్ దిగ్భ్రాంతి

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద జరిగిన విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు ప్రమాదంపై నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరారు. సమీపంలోని టీడీపీ నేతలు తక్షణమే ప్రమాద స్థలానికి వెళ్లి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రాయగడ ప్యాసింజర్ రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. గాయపడిన, మృతిచెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం పెద్దమనసుతో ఆదుకోవాల్సిందిగా కోరారు.

Whats_app_banner