Tirumala Darshan : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్-క్యూలైన్ లో నేరుగా దర్శనానికి అనుమతి-tirumala rush reduced devotees allowed to directly srivari darshan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Darshan : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్-క్యూలైన్ లో నేరుగా దర్శనానికి అనుమతి

Tirumala Darshan : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్-క్యూలైన్ లో నేరుగా దర్శనానికి అనుమతి

Bandaru Satyaprasad HT Telugu
Mar 20, 2024 06:17 PM IST

Tirumala Darshan : ఎలక్షన్ కోడ్ తో సిఫార్సు లేఖలకు అనుమతి లేకపోవడం, తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు పరీక్షలు...ఈ కారణాలతో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. భక్తులను నేరుగా క్యూలైన్లలో దర్శనానికి అనుమతిస్తున్నారు.

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్

Tirumala Darshan : తిరుమల శ్రీవారిని (Tirumala Srivari Darshan)దర్శించుకోవాలనుకునే భక్తులు ఇదే సరైన టైమ్. క్షణకాల శ్రీవారి దర్శనం కోసం వందల, వేల కిలోమీటర్ల దూరం నుంచి భక్తులు వస్తుంటారు. రద్దీ కారణంగా శ్రీవారిని దర్శనం అలా క్షణకాలం మాత్రమే ఉంటుంది. మరొకసారి దర్శించుకోవాలంటే చాలా వ్యయప్రయాసలు చేయాల్సి ఉంటుంది. అయితే చాలా రోజుల తర్వాత తిరుమలలో అనూహ్యంగా రద్దీ తగ్గింది. కంపార్ట్మెంట్ లలో వేచి ఉండకుండానే నేరుగా క్యూ లైన్ లో వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునే అవకాశం వచ్చింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పదోతరగతి సహా, పిల్లలకు పరీక్షలు(Exams) జరుగుతున్నాయి. దీంతో సోమవారం నుంచి తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. ఈ కారణంతో కంపార్ట్మెంట్స్ లోకి కాకుండా భక్తులను నేరుగా క్యూలైన్ లోకి అనుమతిస్తున్నారు.

సిఫార్సు లేఖల దర్శనానికి అనుమతి రద్దు

మంగళవారం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి 63,251 మంది దర్శించుకున్నారు. వీరిలో 23,107మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 4.14 కోట్లు వచ్చిందని టీటీడీ ప్రకటించింది. ఎన్నికల కోడ్ (Election Code)నేపథ్యంలో తిరుమలలో సిఫార్సు లేఖల దర్శనానికి అనుమతి రద్దు చేయటం కూడా రద్దీ తగ్గడానికి ఒక కారణమని అంటున్నారు.

నేటి నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు (Salakatla Teppotsavam)వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకుగానూ టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 20 నుంచి 24వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. తెప్పోత్సవాల కోసం శ్రీవారి పుష్కరిణిలో తెప్పను సిద్ధం చేశారు. శ్రీవారు ఇందులో విహరించనున్నారు. తెప్పోత్సవం మొదటి రోజైన మార్చి 20న సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా రామచంద్రమూర్తి పుష్కరిణిలో(Srivari Pushkarini) మూడు ప్రదక్షిణలు చేసి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మార్చి 21న రుక్మిణి సమేతంగా కృష్ణస్వామి మూడుసార్లు పుష్కరిణిలో తెప్పపై విహరించనున్నారు.

ఆర్జిత సేవలు రద్దు

మార్చి 22న మూడో రోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి పుష్కరిణిలో మూడుసార్లు వివరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మార్చి 23న ఐదుసార్లు, మార్చి 24న చివరి రోజు ఏడుసార్లు తిరుమల శ్రీవారు పుష్కరిణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల కారణంగా పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ(TTD). మార్చి 20, 21వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 22, 23, 24వ తేదీల్లో ఆర్జిత(Arjitha Seva) బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం