Rains In AP: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు-imd predicts rains in andhra pradesh for three days ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rains In Ap: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

Rains In AP: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

HT Telugu Desk HT Telugu
Jul 11, 2023 09:55 AM IST

Rains In AP: ఆంధ్రప్రదేశ్‌ రాగల మూడు రోజుల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి బంగాళాఖాతంపై ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.

ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు
ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు

Rains In AP: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి బంగాళాఖాతంపై ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో వానతలు పడతాయని ప్రకటించింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం ఆవరించి ఉందని దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు, రైతులు, కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండవద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

మంగళవారం వానలు కురిసే జిల్లాలు…

మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్‌ఆర్, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

బుధవారం ఎక్కడ కురుస్తాయంటే..

బుధవారం పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్‌ఆర్, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉంది.

గురువారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏఎస్‌ఆర్, కాకినాడ, తూర్పు గోదావరి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 9.3, విజయనగరం జిల్లా బొబ్బిలిలో 8.2, అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేటలో 8.2, శ్రీకాకుళం జిల్లా పలాసలో 3.4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడంతో పాటు వాటి గమనం నెమ్మదిగా ఉండటంతో రాష్ట్రంలో వర్షపాతం తక్కువగానే ఉంది.

Whats_app_banner