AP Weather Updates: ఆంధ్రప్రదేశ్‌లో వేసవి ఉష్ణోగ్రతలు Temparatures అంతకంతకు పెరుగుతున్నాయి. బుధవారం నంద్యాల జిల్లా పెద్ద దేవళాపురంలో 44.9°C ఉష్ణోగ్రత నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ, వైయస్సార్ జిల్లా సింహాద్రిపురంలో 44.3° డిగ్రీల సెల్సియస్, అనకాపల్లి జిల్లా రావికవతం, విజయనగరం జిల్లా రామభద్రాపురం & తుమ్మికపల్లి, ప్రకాశం జిల్లా దొనకొండ, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 44.1°డిగ్రీలు నమోదయ్యాయి.
కర్నూలు జిల్లా వగరూరు 43.9°డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ శాఖ SDMA అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 43°డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు 16 జిల్లాల్లో నమోదైనట్లు తెలిపారు. 67 మండలాల్లో తీవ్రవడగాల్పులు,125 మండలాల్లో వడగాల్పులు వీచాయి
గురువారంరాష్ట్ర వ్యాప్తంగా 76 మండలాల్లో తీవ్ర వడ గాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శుక్రవారం 47 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 229 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
శ్రీకాకుళం 12 , విజయనగరం 22, పార్వతీపురంమన్యం 13, అల్లూరిసీతారామరాజు 4, అనకాపల్లి 11, కాకినాడ 3, తూర్పుగోదావరి 2, ఎన్టీఆర్ 2, పల్నాడు 7 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 76 మండలాల్లో తీవ్ర వడగాల్పులకు Severe Heat Waves అవకాశం ఉంది.
గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం 14 , విజయనగరం 5, పార్వతీపురంమన్యం 1, అల్లూరిసీతారామరాజు 11, విశాఖపట్నం 3 , అనకాపల్లి 6, కాకినాడ 12, కోనసీమ 7, తూర్పుగోదావరి 17, పశ్చిమగోదావరి 3, ఏలూరు 19, కృష్ణా 13, ఎన్టీఆర్ 14, గుంటూరు 17, పల్నాడు 16, బాపట్ల 12, ప్రకాశం 24, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు 11, నంద్యాల 1, వైఎస్సార్ 1, తిరుపతి 7 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరించారు.
వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.
తెలంగాణలో బుధవారం ఎండలు మండిపోయాయి.. బుధవారం ఖమ్మం భానుడు చెలరేగాడు. మంగళ, బుధవారాల్లో ఖమ్మం జిల్లాలో ఎండ వేడికి జనం అల్లాడి పోయారు. బుధవారం సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఏకంగా ఆరు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నల్గొండ జిల్లా నిడమానూరులో తెలంగాణలో అత్యధికంగా 44.8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురు, శుక్రవారాల్లో కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
నిర్మల్ జిల్లా ఖానా పూర్ మండలం సింగాపూర్ తండాలో బుధవారం సాయంత్రం రామెల లక్ష్మీ అనే మహిళ పిడుగుపాటుకు మృతి చెందారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో గేదెలు మేపేందుకు వెళ్లిన మేకల రవి అనే యుకువుడు వడదెబ్బకు గురై మృతి చెందాడు.
సంబంధిత కథనం