AP DSC 2024 Syllabus: మెగా డిఎస్సీ 2024 అభ్యర్థులకు గుడ్ న్యూస్, సబ్జెక్టుల వారీగా సిలబస్ వచ్చేసింది…
AP DSC 2024 Syllabus: ఏపీ మెగా డిఎస్సీ 2024 సిలబస్ విడుదలైంది. డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడటానికి మరికొంత సమయం ఉండటంతో విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు వీలుగా సిలబస్‌ను మంత్రి నారా లోకేష్ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.
AP DSC 2024 Syllabus: ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్టేట్ ఇచ్చింది. నోటిఫికేషన్ వెలువరించడానికి మరికొన్ని నెలల సమయం ఉండటంతో అభ్యర్థుల పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుగా సిలబస్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఏపీ మెగా డిఎస్సీ 2024 సిలబస్ విడుదలైంది. డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడటానికి మరికొంత సమయం ఉండటంతో విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు వీలుగా సిలబస్‌ను మంత్రి నారా లోకేష్ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.
- మెగా డిఎస్సీ 2024 సిలబస్‌లో సెకండరీ గ్రేడ్ టీచర్ల కోసం ఎస్జీటీ, ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్‌లకు సిలబస్‌ను పేర్కొన్నారు.
- స్కూల్ అసిస్టెంట్ విభాగంలో ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, తమిళ, కన్నడ, ఒడియా, హిందీ, సంస్కృతం, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ, సోషల్ సబ్జెక్టుల సిలబస్ ఉంది.
- టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో తెలుగు, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ సబ్జెక్టులు ఉన్నాయి.
- టీజీటీలో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సంస్కృతం, టీజీటీ పేపర్ 1 ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీ, మ్యాథ్స్, జనరల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ, సోషల్ సబ్జెక్టుల సిలబస్ ఉంది.
- పీజీటీ విభాగంలో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సంస్కృతం, పీజీటీ పేపర్ 1 ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీ, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ, బోటనీ, జువాలజీ, సోషల్ స్టడీస్, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టులు ఉన్నాయి.
- ప్రిన్సిపల్స్ విభాగంలో పేపర్1 ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీ, ప్రిన్సిపల్ పేపర్ 2 ఉన్నాయి.
- ఫిజికల్ ఎడ్యుకేషన్ పీఈటీ, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, పీడీ సబ్జెక్టులు ఉన్నాయి.
ఏపీ డిఎస్సీ 2024 సిలబస్ కోసం ఈ లింకును అనుసరించండి.
https://apdsc2024.apcfss.in/Documents/MEGA_DSC_2024_Suggestive_Syllabus-27-11-2024.pdf
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేయాలని సంకల్పించింది . త్వరలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థుల సౌలభ్యం కోసం నోటిఫికేషన్ విడుదలయ్యే లోగా పరీక్షలకు సిద్ధం మయ్యేందుకు వీలుకల్పిస్తూ మెగా డిఎస్సీ సిలబస్ నవంబర్ 27వ తేదీ 4 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
ఏపీ డిఎస్సీ వెబ్సైట్‌లో సిలబస్‌ను అందుబాటులో ఉంచుతున్నట్లు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు తెలిపారు. అభ్యర్థులు మెగా డిఎస్సి సిలబస్ ను https://apdsc2024.apcfss.in/ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
రిజర్వేషన్ల వివాదంతో ఆలస్యం..
ఆంధ్రప్రదేశ్ డిఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి నారా లోకేష్ ఇటీవల ఏపీ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోగా డిఎస్సీ నియామకాలు పూర్తి చేేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సభలో ప్రకటించారు. ఉపాధ్యాయుల సమస్యలు, నియమకాలు, టీచర్ల విధులపై సభలో పలువురు ప్రశ్నలు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానమిచ్చారు.
గత ప్రభుత్వంలో డిఎస్సీ 2024 నోటిఫికేషన్ 2024 ఫిబ్రవరి 12న నిరుద్యోగుల్ని మభ్య పెట్టడానికి ఎన్నికలకు ముందు 6100పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో డిఎస్సీ ద్వారా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. టీడపీ, జనసేన, బీజేపీ కలిసి గెలిచిన వెంటనే మెగా డిఎస్సీకి సంతకం చేశారని దానికి కట్టుబడి ఉన్నామన్నారు.
ఉపాధ్యాయ నియామకాల్లో వయో పరిమితి పెంపు డిమాండ్‌ను పరిగణలోకి తీసుకున్నామని దీనిపై అన్ని శాఖల మధ్య ఫైల్ సర్క్యూలేషన్‌లో ఉందని, ఎంత వయోపరిమితి పెంచుతామనేది స్పష్టత రాగానే ప్రకటిస్తామన్నారు.
సంబంధిత కథనం