CM Jagan Davos Tour | పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ దావోస్ పర్యటన-cm jagan meet with adani group s chairment gautam adani in davos tour ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan Davos Tour | పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ దావోస్ పర్యటన

CM Jagan Davos Tour | పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ దావోస్ పర్యటన

HT Telugu Desk HT Telugu
May 22, 2022 09:14 PM IST

పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్... దావోస్ పర్యటన సాగుతోంది. సమావేశం తొలిరోజున ప్రముఖులతో సీఎం జగన్ భేటీ అయ్యారు.

<p>దావోస్ పర్యటనలో బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హాన్స్‌ పాల్ బక్నర్‌తో సీఎం జగన్ భేటీ</p>
దావోస్ పర్యటనలో బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హాన్స్‌ పాల్ బక్నర్‌తో సీఎం జగన్ భేటీ

సీఎం జగన్‌.. దావోస్ పర్యటనలో ఉన్నారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకి హాజరయ్యారు. ముఖ్యమంత్రితోపాటుగా.. మంత్రులు కూడా ఉన్నారు. మెుదటి రోజున.. డబ్ల‍్యూఈఎఫ్‌ హెల్త్‌ విభాగాధిపతి శ్యాం బిషేన్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు ఆరోగ్య రంగంపై చర్చించారు.

డబ్ల్యూఈఎఫ్ మొబిలిటీ, సస్టైనబలిటీ విభాగాధిపతి పెట్రో గొమేజ్‌తోనూ జగన్‌ భేటీ అయ్యారు. డబ్ల్యూఈఎఫ్ లో ప్లాట్‌ఫాం పార్టనర్‌షిప్‌పై ఒప్పందం కుదిరింది. అనంతరం బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హాన్స్‌ పాల్‌ బక్నర్‌తో భేటీ అయ్యారు. అక్కడే సీఎం జగన్‌ను మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే కలిశారు. ఆ తర్వాత.. సీఎం జగన్‌తో అదానీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ గౌతం అదానీ సమావేశమై.. పలు అంశాలపై చర్చించారు. మెుదటి రోజు పలువురు ముఖ్యులతో సీఎం మాట్లాడారు. అంతకుముందు.. దావోస్‌లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌ని సీఎం జగన్‌ ప్రారంభించారు.

Whats_app_banner