BJP Big Strategy : బీజేపీ దీర్ఘ కాలిక వ్యూహం…. ఆ సామాజిక వర్గమే టార్గెట్….-bjp strategically plans to attract one community leaders to the party in telugu states ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bjp Big Strategy : బీజేపీ దీర్ఘ కాలిక వ్యూహం…. ఆ సామాజిక వర్గమే టార్గెట్….

BJP Big Strategy : బీజేపీ దీర్ఘ కాలిక వ్యూహం…. ఆ సామాజిక వర్గమే టార్గెట్….

B.S.Chandra HT Telugu
Sep 05, 2022 08:58 AM IST

రెండు తెలుగు రాష్ట్రాల్లో బలపడేందుకు బీజేపీ గట్టి వ్యూహమే రచిస్తోంది. దక్షిణాదిన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడంలో ఇప్పటికే బాగా ఆలశ్యమైందని భావిస్తున్న బీజేపీ వీలైనంత త్వరగా తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడానికి BJP Big Strategy కొత్త దారులు వెదుకుతోంది.

ఏపీలో దూకుడు పెంచిన బీజేపీ
ఏపీలో దూకుడు పెంచిన బీజేపీ (twitter)

BJP Big Strategy బీజేపీ ఆవిర్భవించిన నాలుగు నాలుగుదశాబ్దల్లో దేశమంతటా తన ప్రభావాన్ని చూపగలిగిన దక్షిణాదిన ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో విస్తరించలేకపోయింది. ఏపీ, తెలంగాణలలో బీజేపీ విస్తరించకపోవడానికి, ఆశించిన స్థాయిలో ఆ పార్టీ అభివృద్ధి చెందకపోవడానికి కారణాలను అన్వేషించిన పార్టీ ఇప్పటికే సంస్థాగత లోపాలను పూర్తి స్థాయిలో గుర్తించింది.

బీజేపీ ఆవిర్భవించినప్పటి నుంచి మిత్రపక్షాలతో కలిసి సాగడమేప్రధాన లోపంగా గుర్తించిన ఆ పార్టీ ఇకపై పొత్తుల కంటే స్వీయ అస్తిత్వానికే ప్రాధాన్యమివ్వాలని BJP Big Strategyనిర్ణయానికి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుదలకు అడ్డంకిగా మారిన పొత్తుల భారాన్ని వదుల్చుకోవాలని ఇప్పటికే ఆ పార్టీ అగ్ర నాయకత్వం పార్టీ రాష్ట్ర నాయకత్వానికి స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది.

భారతీయ జనతా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎదగడానికి అనువైన వాతావరణం ఉన్నా దానిని సద్వినియోగం చేసుకోకపోవడానికి కారణాలను ఇప్పటికే బీజేపీ గుర్తించింది. తొలి నాళ్లలో పార్టీ ఎదిగే క్రమంలో కుదుర్చుకున్న పొత్తులు తర్వాతి కాలంలో పార్టీకి గుదిబండగా మారిన సంగతి ప్రస్తుత నాయకత్వం గుర్తించింది. అందుకే బీజేపీ నాయకత్వం ఇటీవలి కాలంలో ఎవరితో పొత్తులు ఉండవని బహిరంగంగా చెబుతోంది. తెలంగాణలో బీజేపీకి కాస్తోకూస్తో బలమున్నా ఏపీలో పునాదుల నుంచి పార్టీని నిర్మించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీనికోసం ఆ పార్టీ గట్టి వ్యూహమే BJP Big Strategy రచిస్తోంది.

బీజేని బలోపేతం చేయాలంటే ముందు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎదగాల్సి ఉంటుంది. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని పక్కకు నెట్టేయడం ద్వారా తెలంగాణలో పట్టు నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇటీవల కేంద్ర మంత్రులు దూకుడు, టిఆర్‌ఎస్‌ మీద విమర్శలు ఇందులో భాగమేనని భావిస్తున్నారు. మరోవైపు ఆంధ్రాలో ఎదిగేందుకు ఆ పార్టీ సినీ గ్లామర్‌ను వాడుకోవాలని యోచిస్తోంది. దీంతో పాటు బలమైన రెడ్డి సామాజిక వర్గం వైఎస్సార్సీపీకి ఓటు బ్యాంకుగా ఉండటం, తెలుగుదేశం పార్టీకి కమ్మ సామాజిక వర్గం అండగా ఉండటంతో కాపులకు దగ్గర కావాలని బీజేపీ BJP Big Strategy భావించింది. అందులో భాగంగా రాష్ట్ర అధ్యక్ష పదవిని కొన్నేళ్లుగా కాపులకు కేటాయిస్తోంది. జనసేన పవన్ కళ్యాణ్‌తో స్నేహం కొనసాగిస్తోంది.

ఇటీవలి కాలంలో బీజేపీ BJP Big Strategyరూటు మార్చి కమ్మ సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే బీజేపీ అగ్రనేత అమిత్ షా ఈనాడు పత్రికాధిపతి రామోజీతో భేటీ అయినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆ తర్వాత సినీ నటుడు ఎన్టీఆర్‌తో చర్చలు, రాజమౌళి తండ్రికి ఎంపీ పదవిని ఇవ్వడం వంటివన్ని బలమైన వర్గాన్ని తమకు దగ్గరకు చేర్చుకునే ప్రయత్నాల్లో భాగంగనే జరుగుతున్నాయని చెబుతున్నారు.

ఎన్డీఏ కూటమికి తెలుగు దేశం పార్టీ దగ్గరవుతుందని విస్తృత ప్రచారం జరిగిన సమయంలో కూడా బీజేపీ రాష్ట్ర స్థాయి బాధ్యులు ఆ వార్తల్ని తోసిపుచ్చారు. తెలుగుదేశం పార్టీకి బీజేపీకి దగ్గరవ్వడం కంటే తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న వర్గాలను తమవైపు తిప్పుకోవడం ద్వారా బీజేపీBJP Big Strategy లాభం ఎక్కువగా ఉంటుందని ఆ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయినా నాలుగ దశాబ్దాలుగా చేయలేకపోయిన పనిని పూర్తి చేయాలని టార్గెట్ విధించినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ధికంగా,సామాజికంగా బలమైన పునాదులున్న వర్గాన్ని తమ పార్టీ వైపు ఆకర్షించడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి బలపడాలనేది బీజేపీ వ్యూహంగా ఉంది. ఇతర రాజకీయ పార్టీలతో పొత్తుల వల్ల నాలుగైదు స్థానాల్లో గెలవడం తప్ప రాజకీయంగా స్వతంత్రంగా ఎదిగే అవకాశాలు ఉండవని బీజేపీ భావిస్తోంది. అదే సమయంలో ఇతర పార్టీల నాయకుల్ని తమ వైపు ఆకర్షిస్తే తమకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని బీజేపీ అంచనా వేస్తోంది.

పార్టీ వ్యూహమదే…..

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్‌ను ఎక్కడ అవసరమైతే అక్కడ వాడుకుంటామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ వచ్చి సమావేశం పెడితే జనం ఎక్కువగా ఎక్కడకు వస్తారని, ఆంధ్రాలోనా, తెలంగాణలోనా అనే విషయంలో మీడియా దగ్గరే క్లారిటీ ఉందని సోము వీర్రాజు చెప్పారు. కుటుంబ పార్టీలకు బీజేపీ వ్యతిరేకమని, తెలుగుదేశం కలిసి వెళ్తామని తాము ఎప్పుడు చెప్పలేదని, ఎవరికి వారు రాసుకున్నారని తేల్చి చెప్పేశారు.BJP Big Strategy ఏమిటో చెప్పకనే తేల్చి చెప్పేశారు.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలన దారుణంగా మారిందని, పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని సోము వీర్రాజు ఆరోపించారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ప్రభుత్వానికి తాబేదార్లు మారిపోయారని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయని, ఈ పరిణామాలను సాదాసీదాగా తీసుకోడానికి వీల్లేదంటున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వీధి సభల ద్వారా ప్రజల్లోకి తీసుకు వెళ్తామన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో వరుసగా ఫ్యామిలీ పార్టీలను వ్యతిరేకిస్తూ, ఓడిస్తూ వస్తున్నామని చెప్పారు.

IPL_Entry_Point

టాపిక్