AP Govt: అమరావతి ఉద్యోగులకు షాక్… ఉచిత వసతి రద్దు
ap govt orders on free accommodation: ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఉచిత గృహ వసతి సౌకర్యాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయం వెనక్కి తగ్గుతూ ప్రభుత్వం మరో ఉత్తర్వు ఇచ్చింది.
amaravati secretariat employees accommodation: అమరావతి ఉద్యోగుల విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత గృహవసతి సౌకర్యాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. గురువారంలోగా ప్రస్తుతం ఉద్యోగులు ఉంటున్న ఫ్లాట్లను ఖాళీ చేసి ఇవ్వాలని సాధారణ పరిపాలనాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఖాళీ చేసిన ఫ్లాట్లను మంచి స్థితిలో అప్పగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏమైనా నష్టం జరిగితే సంబంధిత ఉద్యోగులదే బాధ్యతని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి ఉచిత వసతి కల్పిస్తున్న విషయం తెలిసిందే.
మళ్లీ ఉత్తర్వులు…
ఉద్యోగులు వసతి గృహాలను ఖాళీ చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఉద్యోగులకు 2 నెలల పాటు సమయం ఇచ్చింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
GPF Money Missing: మరోవైపు ఏపీలోని ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు విత్‌డ్రా కావడం చర్చనీయాంశమైంది. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు ఆర్థిక శాఖ అధికారులను కలిసినా స్పష్టత రాకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. ఇవాళ ఉదయం సచివాలయంలో ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రావత్, సత్యనారాయణను ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలు కలిసి సమస్యను వివరించారు. జీపీఎఫ్ ఖాతా నుంచి ఉద్యోగుల అనుమతి లేకుండా నగదు విత్‌డ్రా ఎలా జరిగిందని ప్రశ్నించారు. ఎలా జరిగిందో తమకు కూడా తెలియడం లేదని, విచారణ జరిపి స్పష్టత ఇస్తామని ఆర్థికశాఖ అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. పొరపాటు ఎక్కడ జరిగిందో విచారిస్తామని, క్రింది స్థాయి అధికారులు నుంచి నివేదిక తెప్పించుకుని సమస్యను పరిష్కరిస్తామని ఆర్థికశాఖ అధికారులు హామీ ఇచ్చారని జేఏసీ నేతలు వెల్లడించారు. సాయంత్రంలోగా అన్ని విషయాలపై స్పష్టత ఇస్తామని చెప్పారని తెలిపారు. జీపీఎఫ్ ఖాతాల్లో నగదు వేయడం, తీయడంపై సీఎఫ్‌ఎంఎస్‌లో సాంకేతికలోపం కూడా కారణం కావచ్చని ఆర్థిక శాఖ అధికారులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతా నుంచి ప్రభుత్వం డబ్బులు తీసుకోలేదని ఆర్థిక శాఖ అధికారులు తెలిపినట్లు ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు వెల్లడించారు.
టాపిక్