Teachers Day Jagan: ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి పిలుపు
Teachers Day Jagan ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడుకోడానికి ఉపాధ్యాయులంతా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. విద్యా రంగ అభివృద్ధి, సంక్షేమం గురించి ఏ మాత్రం పట్టించుకోని పార్టీలు ఉపాధ్యాయుల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విజయవాడలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో సిఎం పాల్గొన్నారు. విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు విజయవంతం అవ్వాలంటే అంతా పెద్దమనసు చేసుకుని సహకరించాలని సిఎం కోరారు. విద్యా రంగంలో సంస్కరణల కోసం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, విద్యా విధానంలో నూతన సంస్కరణలు, శిక్షణలు ఇస్తున్నామని చెప్పారు. మూడేళ్లలో విద్యారంగ కార్యక్రమాల కోసం రూ.53వేల కోట్ల రుపాయలను ఖర్చు చేసినట్లు చెప్పారు.
Teachers Day Jagan రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన టీచర్స్ డే కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయుల్ని ముఖ్యమంత్రి సన్మానించారు. “జన్మనిచ్చిన తండ్రికి, జన్మకు సార్ధకతనిచ్చిన ఉపాధ్యాయులకు రుణపడి ఉంటానని చెప్పిన అలెగ్జాండర్ ది గ్రేట్ మాటల్ని” జగన్ గుర్తు చేశారు. సాన పట్టక ముందు వజ్రమైనా రాయిలాగే ఉంటుందని, అద్భుతమైన శిల్పి చేతిలో పడితే రాయి కూడా మంచి శిల్పమవుతుందన్నారు.
Teachers Day Jaganమంచి ఉపాధ్యాయుడు విద్యార్ధుల జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకురాగలుగుతారని, మంచి ఉపాధ్యాయుడు కన్నబిడ్డల శ్రేయస్సుకు ఎలా తపిస్తారో, తరగతిలో పిల్లలందరి మంచి కోసం అలాగే కష్టపడతారన్నారు. ఆత్మ విశ్వాసం, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడంలో ఉపాధ్యాయులు కృషి చేస్తారని, తమ వద్ద చదువుకున్న పిల్లలు తమ కంటే గొప్ప వారు కావాలని ఆరాటపడతారన్నారు. ప్రపంచంలో పిల్లలు ఎలా బతకగలుగుతున్నారనే కాకుండా నిరంతరం మారిపోతున్న ప్రపంచంలో పెద్ద వారైన తర్వాత ఎలా బతకగలుగుతారన్నది కూడా మంచి ఉపాధ్యాయులు ఆలోచిస్తారనన్నారు. ఏ దేశమైనా, మంచి సమాజమైనా, ప్రభుత్వమైనా ఉపాధ్యాయుల్ని గౌరవిస్తుందని, ఉపాధ్యాయుల విషయంలో తమ ప్రభుత్వానికి సంపూర్ణ గౌరవం ఉందన్నారు.
మూడేళ్లలో విప్లవాత్మక మార్పులు….
మూడేళ్లలో విద్యా రంగంలో ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చామని, విద్యాశాఖపై చేసినన్ని సమీక్షలు మరే శాఖపై చేయలేదని సిఎం చెప్పారు. చదువు మాత్రమే విద్యార్ధుల తల రాతలు మారుస్తుందన్నారు. విద్యా విధానం, విద్యా వ్యవస్థ పిల్లలకు అసెట్‌గా ఉందా, లయబిలిటీగా ఉందా అనేది నిరంతరం ఆలోచిస్తున్నామన్నారు. అందుకే నిరంతరం విద్యార్ధులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.
కొన్ని సామాజిక వర్గాలు వేల సంవత్సరాలు చదువుకు దూరంగా ఉండిపోయాయయని, ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీలో స్వాతంత్య్రం తర్వాత కూడా చదువులకు దూరంగా ఉండిపోయి, తమ మీద బలవంతంగా రుద్దిన విధానాలతో నెగ్గుకొచ్చాయన్నారు. వాటిని మార్చేందుకు మూడేళ్లుగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. పేదలకు నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని Teachers Day సందర్భంగా Jagan పునరుద్ఘాటించారు.
ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెట్టే నిర్ణయాలు, విధానాలు తీసుకు రావట్లేదని, అవి ఉపాధ్యాయుల చేతిలో శిల్పాలుగా మారే పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చేసిన మార్పులు మాత్రమేనన్నారు. అట్టడుగున ఉన్న పేద ప్రజల చరిత్రను మార్చే ప్రయత్నాల్లోభాగంగానే అర్ధవంతమైన, భవిష్యత్తుకు ఉపయోగపడే చదువుల కోసమే సంస్కరణలు తెచ్చామని చెప్పారు.
Teachers Day Jaganతమవి కార్పొరేట్‌కు విద్యా వ్యవస్థను అమ్మేసే చర్యలు కాదని, పేదరికం పెద్ద చదువులకు, మంచి చదువులకు ఏ మాత్రం అడ్డంకి కాకూడదని ఉద్దేశంతోనే మార్పులు తీసుకువచ్చినట్లు సిఎం చెప్పారు.
కార్పొరేట్ విద్యా సంస్థలతో కుమ్మక్కై ఇంగ్లీష్ మీడియం, నాణ్యమైన విద్యను పేదలకు దూరం చేసే చర్యలు తాము చేయలేదన్నారు. ప్రభుత్వ టీచర్లను, బడుల్ని నిర్వీర్యం చేసే చర్యలు తాను చేయలేదని, ప్రభుత్వ రంగంలో మన విద్యా వ్యవస్థను మిగిలిన రాష్ట్రాలకంటే మెరుగ్గా ఉండేలా తీర్చిదిద్దామని చెప్పారు.
ప్రభుత్వ బడికి గుర్తింపు, ఘన వైభవం తీసుకువచ్చే లక్ష్యంతో చేపట్టిన మార్పులని స్వాగతించాలని సిఎం ఉపాధ్యాయుల్ని కోరారు. మరో దారి లేక ప్రభుత్వ బళ్లో చదువుకుంటున్న పిల్లల కోసం తీసుకువచ్చిన మార్పులని చెప్పారు. పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు సైతం తమ పిల్లల్ని అదే బళ్లో చదివించేలా తీసుకు వస్తున్న మార్పులని గుర్తించాలన్నారు. నాణ్యమైన విద్యను అందించడం, అక్షరాస్యత పెంచడం, పిల్లలు పోటీని తట్టుకుని జీవితంలో ఎదగడం కోసమే మార్పులు చేపట్టామన్నారు.
మూడేళ్లలో 53వేల కోట్ల ఖర్చు….
Teachers Day Jagan విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు విజయవంతం అవ్వాలంటే అంతా పెద్దమనసు చేసుకుని సహకరించాలని సిఎం కోరారు. విద్యా రంగంలో సంస్కరణల కోసం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, విద్యా విధానంలో నూతన సంస్కరణలు, శిక్షణలు ఇస్తున్నామని చెప్పారు. మూడేళ్లలో విద్యారంగ కార్యక్రమాల కోసం రూ.53వేల కోట్ల రుపాయలను ఖర్చు చేసినట్లు చెప్పారు. విద్యను విద్యార్ధులకు ఉపయోగపడేలా నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయుల సహకరం ముఖ్యమని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ రంగ విద్యా విధానం మీద సానుభూతి ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉందని, గతంలో ప్రభుత్వ ఆస్పత్రులు, విద్యా సంస్థలు, ఆర్టీసిని కూడా నిర్వీర్యం చేసే వరకు వెళ్లాయని, చివరకు వాటిలో ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితి ఉంటుందన్నారు. ఉద్యోగాల కల్పన విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాలు ప్రభుత్వ బాధ్యతలని భావిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ రంగాలను కాపాడుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఎవరు అడగకపోయినా 62ఏళ్లకు రిటైర్మెంట్ వయసు పెంచామని, ఎస్జీటిలను స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లను ప్రధానోపాధ్యాయులుగా, ఎంఈఓలుగా పదోన్నతి కల్పిస్తున్నట్లు చెప్పారు.
రెండు దశాబ్దాలుగా ఎవరు పట్టించుకోని పెన్షన్ అంశం మీద పూర్తి చిత్తశుద్ధితో పరిష్కారం కోసం పనిచేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగుల పెన్షన్ అంశం మీద పూర్తి చిత్తశుద్ధితో పరిష్కారం కోసం కసరత్తు చేస్తున్నట్లు సిఎం జగన్ చెప్పారు. ఉద్యోగుల సమస్యల కోసం ఏ మాత్రం కృషి చేయని చంద్రబాబు ఇప్పుడు ఉపాధ్యాయులు, ఉద్యోగుల్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఉద్యోగుల సమస్యల మీద ఒక్క వార్త కూడా పత్రికలు, టీవీల్లో వచ్చేవి కాదని, ఇప్పుడు వారిని రెచ్చగొట్టేలా కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు, విద్యార్ధులకు మేలు చేసే మార్పులకు కట్టుబడి ఉంటానని సిఎం ప్రకటించారు.
టాపిక్