Kodali Nani On Chandrababu : చంద్రబాబుపై దోమలు పగబట్టాయ్, లోకేశ్ పేరు చిత్తు కాగితాల్లో కూడా రాయం- కొడాలి నాని
Kodali Nani On Chandrababu : చంద్రబాబును జైలులో దోమలు కుట్టక.. రంభ, ఊర్వశి, మేనకలు కన్ను కొడతారా అని కొడాలి నాని సెటైర్లు వేశారు.
Kodali Nani On Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ పై మాజీ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో సెటైర్లు వేశారు. జైల్లో ఉంటే దోమలు కుట్టక.. రంభ, ఊర్వశి, మేనకలు కన్ను కొడతారా అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. జైలుకి వెళ్లిన ప్రతి ఒక్కరికీ బెయిల్ వస్తుందన్న ఆయన.. చంద్రబాబు ఏమన్నా ప్రియా పచ్చళ్ల కంపెనీలో ముక్కలు కొట్టడానికి వెళ్లాడా జైలుకి కాకుండా అని ఎద్దేవా చేశారు. జైలుకు వెళ్లిన ప్రతీ ఒక్కరికీ బెయిల్ వస్తుందని, బెయిల్ రానీవాళ్లు ఒక్కరు కూడా లేరన్నారు. లోకేశ్ మా పేర్లు రెడ్‌బుక్‌లో రాస్తున్నారని, మేము లోకేశ్ పేరు చిత్తు కాగితాల్లో కూడా రాయమన్నారు. ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవి వస్తుందన్న లోకేశ్.. ఇప్పుడు చంద్రబాబు జైలుకెళ్తే ఎందుకు ఏడుస్తున్నాడని ఎద్దేవా చేశారు. అయితే చంద్రబాబుకు పెత్త పదవి వద్దా అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు అరెస్ట్‌తో లోకేశ్ జాతరలో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు చూస్తున్నారన్నారు. జైలులో పెట్టండి అన్న లోకేశ్ ఇప్పుడు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు.
యాత్రలు చేసేది మా వాళ్లే
వైసీపీ ఉన్నంత కాలం చంద్రబాబు రాజకీయాల్లో ఉండాలని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు రాజకీయాల్లో ఉంటే వైసీపీకి బ్రహ్మాండంగా ఉంటుందన్నారు. చంద్రబాబుపై మాకేం వ్యక్తిగత కక్షలేదన్నారు. చంద్రబాబుకు బెయిల్ వస్తుందని భజన చేస్తున్నారని, జైలుకు వెళ్లిన ప్రతీవాళ్లకు బెయిల్ వచ్చిందన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యారు, దానిపై ఏదోటి మాట్లాడమని ఇతర రాష్ట్రాల నేతలను టీడీపీ వాళ్లు బతిమాలితే.. కొంతమంది స్పందిస్తున్నారన్నారు. చంద్రబాబు కోసం యాత్రలు చేసేది కమ్మ వాళ్లు మాత్రమే అన్నారు. మా వాళ్లకే ఎక్కువగా కార్లు ఉన్నాయన్నారు. బీసీలు, ఎస్సీలు ఎవరైనా నిరసనలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎప్పుడూ నామినేటెడ్ పదవులు ఇవ్వలేదన్నారు.
దోమలు పగబట్టాయి
"చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కోర్టు వాళ్లకు కొన్ని మినహాయింపులు ఇస్తుంది. కోర్టు ఏదైతే ఇస్తుంటే వాటిని కల్పిస్తారు. భువనేశ్వరి ఏం చెప్తున్నారు. చంద్రబాబుకు వేడినీళ్లు ఇవ్వడంలేదంటున్నారు. కోర్టు వేడినీళ్లు ఇవ్వమని చెప్తుందా? ఓ కత్తి పట్టుకుని, దోమలపై చంద్రబాబు దండయాత్ర చేశారు కదా? అందుకే అవన్నీ పగబట్టినట్టున్నాయ్. హెరిటేజ్ లో రెండు శాతం షేర్లు అమ్మితే కోట్లు వస్తాయని భువనేశ్వరి అంటున్నారు. హెరిటేజ్ షేర్లు అమ్మి ప్రజలకు డబ్బులు పంచుతారా? వేడినీళ్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు,కూలర్లు ఉండటానికి అది ఇల్లు కాదు జైలు. జైల్లో ఏమైనా వసతులు కావాలంటే కోర్టును అభ్యర్థించాలి" -కొడాలి నాని