తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mahindra Scorpio Motorhome । స్కార్పియో వాహనాన్ని ఇల్లుగా మార్చేశాడు-వీడియో!

Mahindra Scorpio Motorhome । స్కార్పియో వాహనాన్ని ఇల్లుగా మార్చేశాడు-వీడియో!

15 September 2022, 20:31 IST

సినిమా హీరోలు ఔట్ డోర్ షూటింగ్‌లకు వెళ్లిపుడు, ఆ ప్రాంతంలో సరైన వసతి లేకపోతే ప్రత్యేకంగా రూపొందించిన కారవాన్ వాహనాలను ఉపయోగించడం మనకు తెలిసిందే. నేతల పర్యటనల్లో కూడా ఇలాంటి వాహనాలను మనం చూస్తుంటాం. అయితే ఇదే తరహాలో నెదర్లాండ్‌కు చెందిన డానీ హేబెరర్‌ అనే టూరిస్ట్, ఒక మహీంద్రా స్కార్పియో వాహనాన్ని కొనుగోలు చేసి దానినే తన ఇంటిగా మార్చుకున్నాడు. అందులోనే పడుకునేందుకు ఒక బెడ్, వంట చేసుకునేందుకు గ్యాస్ స్టవ్ సహా ఇతర ప్రాథమిక సౌకర్యాలు సమకూర్చుకున్నాడు. తన స్కార్పియో మోటార్‌హోమ్‌లోనే భారతదేశాన్ని చుట్టేస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయపూర్‌లో పర్యటిస్తుండగా HT ఆటోమొబైల్ విభాగం అతణ్ని పలకరించింది. ఆ విశేషాలను ఈ వీడియోలో చూడండి.