తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Eating Time । రాత్రి భోజనంతో డిప్రెషన్ పెరుగుతుందట.. ఈ వీడియో చూడండి!

Eating Time । రాత్రి భోజనంతో డిప్రెషన్ పెరుగుతుందట.. ఈ వీడియో చూడండి!

19 September 2022, 14:32 IST

  • ప్రతిరోజూ సరైన ఆహారం తీసుకోవటం మాత్రమే కాదు, సమయానికి తినడమూ ముఖ్యమే. ఆహారం తినే సమయం వ్యక్తుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనలు రుజువు చేశాయి. పగటిపూట తినే వారితో పోలిస్తే, రాత్రి పూట ఎక్కువగా తినే వారిలో డిప్రెషన్ స్థాయిలు 26 శాతం పెరిగాయని, అలాగే ఆందోళన స్థాయిలు 16 శాతం పెరిగాయని పరిశోధక బృందం గుర్తించింది. పగటిపూట తినే వారిలో మానసిక గందరగోళం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. జర్మనీలోని కొలోన్ విశ్వవిద్యాలయం, న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలోని పరిశోధక బృందం ఈ అధ్యయనం చేపట్టింది. డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి రుగ్మతలను ఎదుర్కొంటున్న వ్యక్తులకు భోజన సమయాలలో మార్పులు సహాయపడతాయో లేదో తెలుసుకోవడానికి ఈ అధ్యయనం చేశారు. భోజన సమయం మించిపోతే అది వ్యక్తుల్లో మూడ్ ను బలహీనపరుస్తుందని పరిశోధకులు అంటున్నారు. వీరి అధ్యయనం ఫలితాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్‌లో ప్రచురితమయ్యాయి.