No Night Meal | రాత్రికి తినడం మానేయండి.. ఎందుకంటే ఇందుకే!
రాత్రివేళ ఆహారం తినకూడదని తాజా అధ్యయనాలు పేర్కొన్నాయి. ఎందుకు.. ఏమిటి.. ఎలా? అనే విషయాలు ఇక్కడ తెలుసుకోండి..
రాత్రికి తినడం మానేయండి. అవును ఇక్కడ చెప్పేది పూర్తిగా నిజం. చాలామంది ఎంత రాత్రైనా కూడా ఏదో ఒకటి వరుసగా తింటూ ఉంటారు. బాగా భోజనం చేసిన తర్వాత కూడా పండ్లు, బిస్కెట్లు, ముర్కులు, ఐస్ క్రీంలు, జ్యూసులు, పాలు అంటూ ఇలా ఒకటేమిటి? ఒకదాని తర్వాత ఒకటి ఏదిపడితే అది వారి కడుపులోకి వేసేస్తుంటారు. దీంతో వారి కడుపులోని జీర్ణవ్యవస్థ రాత్రంతా పిండి గిర్ని తిరిగినట్లే పనిచేస్తుంది.
ట్రెండింగ్ వార్తలు
రాత్రిపూట ఎక్కువగా తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో బరువు కూడా పెరుగుతారు. మొత్తంగా మీ ఆరోగ్యం దెబ్బతింటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
మన శరీరంలోని వ్యవస్థలు వేరువేరు సమయాల్లో వేరువేరు విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తాయి. ఆ వ్యవస్థలకు కూడా ఎలాంటి సమయంలో ఎలా విధులు ఇవ్వాలి అనేది మన చేతుల్లో ఉంటుంది. సాధారణంగా జీర్ణవ్యవస్థ పనితీరు సాయంత్రం దాటిన తర్వాత మందగిస్తుంది. అంటే రోజంతా పనిచేసి విశ్రాంతి తీసుకుంటుందని అర్థం చేసుకోవాలి. అలాంటి సమయంలో కూడా దానికి అరిగించే పనిచెప్తే దానిపై భారం ఎక్కువగా పడి పనితీరు దెబ్బతింటుంది.
రోజూ ఉదయం అల్పాహారం చేయాలి. ఇలా ఉదయాన్నే అల్పాహారం తీసుకునే వ్యక్తుల్లో రక్తంలో చక్కెరస్థాయిలు నియంత్రణలో ఉంటాయి. తద్వారా వారిలో టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.
అలాగే పగటిపూట కాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవచ్చు. దీని ద్వారా శరీరానికి అవసరం అయ్యే శక్తి లభిస్తుంది. ఇలా మధ్యాహ్నం ఎక్కువ కాలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం వలన, సాయంత్రం డిన్నర్ చేసే సమయానికి అంతగా ఆకలి ఉండదు. కాబట్టి ఎంత ఆకలి ఉంటుందో అంతే తినగలుగుతాం. రాత్రి వేళలో తినేది సాధారణ ఆహారం అయి ఉండాలి. తేలికగా జీర్ణమయ్యేలా ఉండాలి. అప్పుడే వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయి. ఇదే ఆరోగ్యకరమైన విధానం కూడా
అతిగా తినడం వలన కూడా రాత్రి సరిగ్గా నిద్రపట్టదు. వీలైనంత వరకు త్వరగా నిద్రపోవాలి, త్వరగా లేవాలి అని చెప్పడంలో మర్మం తినే తిండితో ముడిపడి ఉంది. త్వరగా నిద్రపోతే రాత్రి తినటం తగ్గిస్తాం. నిద్రకు తగినంత సమయం ఉంటుంది. తర్వాత లేచిన వెంటనే త్వరగా అల్పాహారం తినగలుగుతాం. ఈ రకంగా చేయడం వలన ఎలాంటి బరువుపెరగదు, పొట్ట ముందుకు రాదు. ఆరోగ్యం బాగుంటుంది. ఆకలి ఎక్కువగా ఉంటే ప్రోటీన్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.
సంబంధిత కథనం
Good Night Sleep | త్వరగా నిద్రపట్టాలంటే ఇవి తినండి!
March 10 2022
Tips For Better Sleep | అంజీర్ మిల్క్ ఉపయోగాలు తెలిస్తే అసలు మానరు..
February 24 2022