తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad To Island : రూ.1650 ఖర్చుతో హైదరాబాద్ నుంచి వెళ్లి ఐల్యాండ్ చూడొచ్చు

Hyderabad To Island : రూ.1650 ఖర్చుతో హైదరాబాద్ నుంచి వెళ్లి ఐల్యాండ్ చూడొచ్చు

Anand Sai HT Telugu

09 August 2022, 14:32 IST

    • ఐల్యాండ్ చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. చుట్టూ సముద్రం.. మధ్యలో భూమి. ఊహించుకోవడానికే ఎంత అందగా ఉంది. అలాంటి అందాలను హైదరాబాద్ నుంచి వెళ్ళి చూడొచ్చు. అది కూడా అతి తక్కువ ధరలోనే.. నమ్మట్లేదా.. ఈ స్టోరీ పూర్తిగా చదివితే మీకే ఈజీగా అర్థమవుతుంది.
సెయింట్ మేరీస్ ఐల్యాండ్
సెయింట్ మేరీస్ ఐల్యాండ్

సెయింట్ మేరీస్ ఐల్యాండ్

అదేదో సినిమాలో.. హైదరాబాద్ కు సముద్రం తీసుకొస్తా అని చెబుతాడు హీరో. కానీ అది సాధ్యం కాదు కదా. ఇక మనకున్నది ఓన్లీ ట్యాంక్ బండ్. అదే భాగ్యనగరానికి చిన్నపాటి సముద్రం అనుకుని.. అక్కడకు వెళ్లి ఎంజాయ్ చేస్తారు. కానీ ఐల్యాండ్ వెళ్లాలి అంటే మాత్రం చాలా ఖర్చుతో కూడుకున్న పని. కేవలం రూ.1650తో ఐల్యాండ్ చూసేయోచ్చు. కొన్ని గంటలు అక్కడే ఉండి ఎంజాయ్ చేయోచ్చు. సముద్రంలో కాళ్లు పెట్టి.. మీ ప్రియురాలికి కవితలు చెప్పొచ్చు. కుటుంబంతో కలిసి వెళ్లి మనసారా మాట్లాడుకోవచ్చు. ఇంతకి ఆ ఐల్యాండ్ ఎక్కడా అనుకుంటున్నారా? మన పక్కనే ఉన్న కర్ణాటకలోని ఉడుపిలో.

ట్రెండింగ్ వార్తలు

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!

Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

కర్ణాటకలోని మంగళూరు, ఉడుపి సముద్ర తీరాలు. మనం మంగళూరు వెళ్లాలంటే ముందుగా ఉడుపి దాటాలి. ఉడుపి దగ్గరలో మాల్పే బీచ్ ఉంటుంది. అక్కడ నుంచి ఈజీగా ఐల్యాండ్ వెళ్లొచ్చు. దానిపేరే సెయింట్ మేరీస్ ఐల్యాండ్. మాల్పే బీచ్ వెళ్తే.. ఇసుక దుప్పటి, అలల శబ్దం, చేపలు పట్టే వలలు, ఎదురుగా ఎన్నో రహస్యాలను దాచుకున్న సముద్రం కనిపిస్తుంది.

మాల్పే బీచ్ వెళ్లి.. మీరు సెయింట్ మేరీస్ దీవులకు వెళ్లకుంటే మీ పర్యటన వృథా. మల్పే బీచ్ నుంచి కేవలం ఒకరికి రూ.250తో మీరు ఐల్యాండ్ వెళ్లొచ్చు. ఓ పడవలో తీసుకెళ్తారు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే.. సముద్రం మధ్యలో మీరు వేరే బోటులోకి మారాలి. ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా. అయితే ఈ ఐల్యాండ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. సాయంత్రంలోపు తిరిగి తీసుకొచ్చేస్తారు. ముఖ్యగమనిక ఏంటంటే.. వర్షాకాలంలో ఇక్కడకు అనుమతి లేదు. సో.. మీరు ఇప్పుడు ప్లాన్ చేసుకుని శీతాకాలంలో వెళ్లొచ్చు.

హైదరాబాద్ నుంచి కేఎస్ఆర్టీసీ అంబరీ బస్సులో వెెళ్తే తక్కువ ధరలో వెళ్లొచ్చు. ఇతర ప్రైవేటు బస్సులో కూడా చాలానే ఉంటాయి. అంబరి బస్ అయితే ఎంజీబీఎస్ లో బొర్డింగ్ పాయింట్ ఉంటుంది. ప్రైవేటు బస్సులు ఇతర ప్రదేశాల్లో ఉంటాయి. ముందుగానే టిటెక్ బుక్ చేసుకోవాలి. అంబరిలో రూ.1400 టికెట్ తో ఉడుపి చేరుకుంటారు. మళ్లీ తిరిగే వచ్చేప్పుడు అంతే డబ్బులతో టికెట్ బుక్ చేసుకుని రావొచ్చు.

ఉడుపి మల్పే బీచ్ వెళ్లాక.. సెయింట్ మేరీస్ ఐల్యాండ్ టికెట్ తీసుకోవాలి. దాని ధర రూ.250 మాత్రమే. అలా మీరు ఐల్యాండ్ చూడొచ్చు. సాయంత్రం తిరిగి వచ్చాక వేరే టూర్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి కొన్ని గంటల ప్రయాణం చేస్తే.. మంగళూరు వస్తుంది. అక్కడ కూడా విశాలమైన సముద్రం తీరం ఉంటుంది. బస్సులో ప్రయాణిస్తుంటే ఏదో తెలియని అనుభూతికి లోనవుతారు. వెళ్తుంటే కొబ్బరి చెట్లు, సముద్రపు బ్యాక్ వాటర్ తో ఎంతో కొత్తగా అనిపిస్తుంది.

సెయింట్ మేరీస్ ఐల్యాండ్ కు గొప్ప చరిత్ర ఉంది. 1498లో వాస్కోడి గామా పోర్చుగల్ రాజ్యం నుంచి తన ప్రయాణంలో సెయింట్ మేరీస్ దీవులలో అడుగుపెట్టాడు. ఆ ద్వీపంలో ఒక శిలువను అమర్చాడు అని చెబుతారు. నాలుగు చిన్న దీవులు కలిసి సెయింట్ మేరీస్ దీవులుగా ఏర్పడ్డాయి. ఈ ద్వీపాలలో ప్రతి ఒక్కటి ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ప్రత్యేకతను కలిగి ఉంటాయి. కొబ్బరి ద్వీపం, ఉత్తర ద్వీపం, దర్యా బహదూర్‌గర్ ద్వీపం, సౌత్ ఐలాండ్ సెయింట్ మేరీస్ దీవులు అవి.

శాస్త్రీయ రికార్డుల ప్రకారం సెయింట్ మేరీస్ ద్వీపంలో కనుగొన్న రాతి నిర్మాణాలు ఆఫ్రికాలోని మడగాస్కర్‌లోని రాతి నిర్మాణాలకు సరిపోతాయి. స్తంభాల బసాల్టిక్ (అగ్నిపర్వత) రాతి నిర్మాణాలు సెయింట్ మేరీస్ దీవులలోని ప్రముఖ ఆకర్షణలు. ఈ నిర్మాణాలు భారతదేశంలోనే ప్రత్యేకమైనవి.

తదుపరి వ్యాసం