తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Weather Update | రాబోయే ఐదు రోజులు తెలంగాణ, ఏపీలో వర్షాలు

Weather Update | రాబోయే ఐదు రోజులు తెలంగాణ, ఏపీలో వర్షాలు

HT Telugu Desk HT Telugu

05 May 2022, 5:51 IST

    • వచ్చే ఐదు రోజులపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. కొన్ని రోజులుగా ఎండవేడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలుగుతుంది. మరో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది వాతావరణ శాఖ వెల్లడించింది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రాబోయే ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా.. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 ,40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షం పడే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడి వర్షాలు పడనున్నాయి.

హైదరాబాద్, రంగారెడ్డి, కుమురం భీమ్ ఆసిఫాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మంచిర్యాలు, మేడ్చల్-మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, జైశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజలపాటు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తాంద్ర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడనుంది. రాయలసీమలోని పలు జిల్లాల్లో గంటకు 30, 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు రానున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

ఓ వైపు ఎండలు మండిపోతుంటే.. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో చిన్నపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించింది. ఈ కారణంగా మే 6వ తేదీన అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత 24 గంటల్లో మరింత బలపడనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

టాపిక్

తదుపరి వ్యాసం