తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vikarabad News : పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడి రాసలీలలు, యువతులతో హంగామా!

Vikarabad News : పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడి రాసలీలలు, యువతులతో హంగామా!

HT Telugu Desk HT Telugu

14 November 2023, 21:45 IST

    • Vikarabad News : వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వైద్యుడి రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. జూ.డాక్టర్ల నెపంతో యువతులను తీసుకొచ్చి, స్నేహితుడితో కలిసి హంగామా చేస్తున్నాడో వైద్యుడు.
పరిగి ప్రభుత్వ ఆసుపత్రి
పరిగి ప్రభుత్వ ఆసుపత్రి

పరిగి ప్రభుత్వ ఆసుపత్రి

Vikarabad News : తెలంగాణలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ అదే ఆస్పత్రిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. వీకెండ్స్ వస్తే చాలు అపరిచిత యువతులతో ఆ డాక్టర్ ఆస్పత్రిలోని డ్యూటీ డాక్టర్ గదిలో హంగామా చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితులను పిలిపించి వారికోసం కూడా గుర్తు తెలియని యువతులను రాత్రి సమయాల్లో తీసుకొస్తున్నాడు. ఇదంతా వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసే ఓ డాక్టర్ తంతు.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుడు రాసలీలలు

ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ డాక్టర్... శని, ఆదివారాల్లో తన గదిలోనే యువతులతో గడుపుతూ వస్తున్నాడు. ఇలానే గత కొంత కాలంగా చేస్తున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే అసాంఘిక పనులు చేస్తున్న ఆ డాక్టర్ గత కొన్ని రోజులుగా తన స్నేహితుడిని పిలిచి యువతులతో అడ్డూ అదుపూ లేకుండా రాసలీలలు కొనసాగిస్తున్నాడు.

వీడియోతో వైద్యుడి రాసలీలలు బట్టబయలు

అయితే కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియో తీయడంతో ఆ డాక్టర్ బండారం బట్టబయలు అయింది. ఆ వీడియోలో డాక్టర్ తో పాటు మరో యువకుడు, ఇద్దరు యువతులు ఉన్నారు. డాక్టర్ రాసలీలలు బయట పడడంతో వారంతా జూనియర్ డాక్టర్లు అని, ట్రైనింగ్ కోసం వచ్చారని బుకాయించారు. ఇక ఈ విషయంపై స్పందించిన ఆస్పత్రి ఉన్నతాధికారులు...ఈ వ్యవహారంపై తమకు సమాచారం లేదంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లకు ట్రైనింగ్ లేదని వారు చెప్పుకొచ్చారు.

గతంలో ఓ వైద్యుడు మద్యం సేవించి

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆ డాక్టర్ పై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి ఉన్నతాధికారులు తెలిపారు. అయితే గతంలో కూడా పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక వైద్యుడు పేషెంట్లతో విచిత్రంగా ప్రవర్తించాడు. చిన్న గాయం కారణంగా ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన పేషంట్ ను మద్యం మత్తులో ఓ వైద్యుడు తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. ఆ సమయంలో తీసిన వీడియో వైరల్ అయింది.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

తదుపరి వ్యాసం